- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
తర్వాత షెకెము, బేత్-మిల్లో పౌరులందరూ కలిసివచ్చి షెకెములో స్తంభం ఉన్న మస్తకిచెట్టు క్రింద అబీమెలెకును రాజుగా నియమించారు.
అది యోతాముకు తెలిసినప్పుడు అతడు గెరిజీము పర్వత శిఖరం ఎక్కి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “షెకెము పౌరులారా, మీరు చెప్పేది దేవుడు వినాలంటే, నేను చెప్పేది మీరు వినాలి.
ఒక రోజు చెట్లన్నీ తమకు ఒక రాజును అభిషేకించుకోవాలని బయలుదేరి వెళ్లి ఒలీవ చెట్టుతో, ‘మాకు రాజుగా ఉండు’ అన్నాయి.
“అయితే ఒలీవచెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవుడిని మానవులను గౌరవించడానికి వాడే నా తైలాన్ని నేను వదిలేయాలా?’ అన్నది.
“తర్వాత చెట్లు అంజూర చెట్టుతో, ‘రా, మాకు రాజుగా ఉండు’ అన్నాయి.
“అయితే అంజూర చెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం మధురుమైన నా మంచి ఫలాలను వదిలేయాలా?’ అన్నది.
“తర్వాత చెట్లు ద్రాక్షవల్లితో అన్నాయి, ‘రా, మా రాజుగా ఉండు.’
“అయితే ద్రాక్షవల్లి, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవునికి మనుష్యులకు సంతోషాన్ని ఇచ్చే నా ద్రాక్షరసాన్ని ఇవ్వడం మానివేయాలా?’ అన్నది.
“చివరికి చెట్లన్నీ ముళ్ళపొదతో, ‘నీవు వచ్చి మాకు రాజుగా ఉండు’ అని అడిగాయి.
“ముళ్ళపొద చెట్లతో, ‘మీరు నిజంగా నన్ను మీ రాజుగా అభిషేకించాలనుకుంటే రండి, నా నీడలో ఆశ్రయం తీసుకోండి; లేదా ముళ్ళపొద నుండి అగ్ని వచ్చి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును గాక!’ అన్నది.
“అబీమెలెకును రాజుగా చేసి మీరు మర్యాదగా సరిగా వ్యవహరించారా? మీరు యెరుబ్-బయలుకు, అతని కుటుంబానికి న్యాయం చేశారా? మీరు అతని పట్ల సరియైన విధంగా వ్యవహరించారా?
నా తండ్రి మీ కోసం పోరాడి మిద్యాను చేతి నుండి మిమ్మల్ని కాపాడడానికి తన ప్రాణం పణంగా పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి.
అయితే మీరు నా తండ్రి కుటుంబానికి విరోధంగా లేచారు. ఒకే బండ మీద అతని డెబ్బైమంది కుమారులను చంపిన అతని దాసి కుమారుడైన అబీమెలెకు మీకు బంధువు కాబట్టి షెకెము పౌరుల మీద రాజుగా నియమించారు.
యెరుబ్-బయలు, అతని కుటుంబంపట్ల సత్యంగా యథార్థంగా ఉన్నారా? ఒకవేళ మీరు అలా ఉంటే, అబీమెలెకును బట్టి సంతోషించండి అతడు మిమ్మల్ని బట్టి సంతోషించును గాక!
లేకపోతే, అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అనగా షెకెము, బేత్-మిల్లో పౌరులను కాల్చివేయును గాక. మీ నుండి అనగా షెకెము, బేత్-మిల్లో పౌరుల నుండి అగ్ని వచ్చి అబీమెలెకును కాల్చివేయును గాక!”
తర్వాత యోతాము తన సోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేర్‌కు వెళ్లి అక్కడ నివసించాడు.
అబీమెలెకు మూడేళ్ళు ఇశ్రాయేలు మీద పాలించిన తర్వాత,
- న్యాయాధిపతులు 9:23సుమారు క్రీ.పూ. 1233
దేవుడు అబీమెలెకుకు, షెకెము పౌరులకు వైరం కలిగించారు, కాబట్టి వారు అబీమెలెకుకు ద్రోహం చేశారు.
- న్యాయాధిపతులు 9:24సుమారు క్రీ.పూ. 1233
యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులను చంపి వారికి చేసిన ద్రోహానికి, వారిని చంపిన వారి సోదరుడైన అబీమెలెకు మీదికి, తన సోదరులను చంపడానికి అతనికి సహాయం చేసిన షెకెము పౌరుల మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు.
- న్యాయాధిపతులు 9:25సుమారు క్రీ.పూ. 1233
అతనికి వ్యతిరేకంగా ఈ షెకెము పౌరులు దారిలో వెళ్లే వారందరి మీద దాడి చేసి దోచుకునేలా కొండ శిఖరాల మీద మనుషులను ఉంచారు. ఇది అబీమెలెకుకు తెలిసింది.
- న్యాయాధిపతులు 9:26సుమారు క్రీ.పూ. 1233
ఎబెదు కుమారుడైన గాలు అతని సోదరులతో షెకెముకు వెళ్లగా షెకము నాయకులు అతనిపై నమ్మకం ఉంచారు.
- న్యాయాధిపతులు 9:27సుమారు క్రీ.పూ. 1233
వారు పొలాలలోనికి వెళ్లి ద్రాక్షపండ్లను ఏరుకుని వాటిని త్రొక్కిన తర్వాత, తమ దేవుని గుడిలో పండగ చేసుకున్నారు. వారు తింటూ, త్రాగుతూ అబీమెలెకును శపించారు.
- న్యాయాధిపతులు 9:28సుమారు క్రీ.పూ. 1233
అప్పుడు ఎబెదు కుమారుడైన గాలు ఇలా అన్నాడు, “మనం సేవ చేయడానికి అబీమెలెకు ఎవరు, షెకెము ఎవరు? అతడు యెరుబ్-బయలు కుమారుడు కాడా? జెబూలు తన క్రింది అధికారి కాడా? మనం షెకెము తండ్రియైన హమోరు కుటుంబానికి సేవ చేద్దాం! అబీమెలెకుకు ఎందుకు మనం సేవ చేయాలి?
- న్యాయాధిపతులు 9:29సుమారు క్రీ.పూ. 1233
ఈ ప్రజలు నా ఆధీనంలో ఉండి ఉంటే నేను అతన్ని తొలగించేవాన్ని. ‘నీ సైన్యమంతటిని పిలిపించు!’ అని అబీమెలెకుకు చెప్పేవాన్ని.”
- న్యాయాధిపతులు 9:30సుమారు క్రీ.పూ. 1233
పట్టణ అధికారియైన జెబూలు ఎబెదు కుమారుడైన గాలు మాటలను విన్నప్పుడు అతడు చాలా కోప్పడ్డాడు.