కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 37:28సుమారు క్రీ.పూ. 710

    “అయితే నీవు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు.

  2. యెషయా 37:29సుమారు క్రీ.పూ. 710

    నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.

  3. యెషయా 37:30సుమారు క్రీ.పూ. 710

    “హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు.

  4. యెషయా 37:31సుమారు క్రీ.పూ. 710

    యూదా రాజ్యంలో శేషం మరోసారి క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది.

  5. యెషయా 37:32సుమారు క్రీ.పూ. 710

    యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది.

  6. యెషయా 37:33సుమారు క్రీ.పూ. 710

    “కాబట్టి, అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.

  7. యెషయా 37:34సుమారు క్రీ.పూ. 710

    అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోతాడు. అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  8. యెషయా 37:35సుమారు క్రీ.పూ. 710

    “నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను!”

  9. యెషయా 37:36సుమారు క్రీ.పూ. 710

    అప్పుడు యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో 1,85,000 మంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు.

  10. యెషయా 37:37సుమారు క్రీ.పూ. 710

    అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.

  11. యెషయా 37:38సుమారు క్రీ.పూ. 710

    ఒక రోజు, అతడు నిస్రోకు అనే తన దేవుని గుడిలో పూజ చేస్తుండగా అతని కుమారులు ఆద్రమ్మెలెకు, షెరెజరు ఖడ్గంతో అతన్ని చంపి, అరారతు ప్రాంతానికి పారిపోయారు. అతని తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్దోను రాజయ్యాడు.

  12. యెషయా 38:1సుమారు క్రీ.పూ. 718

    ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.

  13. యెషయా 38:2సుమారు క్రీ.పూ. 718

    హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,

  14. యెషయా 38:3సుమారు క్రీ.పూ. 718

    “యెహోవా, నేను నమ్మకంగా యథార్థ హృదయంతో, మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.

  15. యెషయా 38:4సుమారు క్రీ.పూ. 718

    అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ఇలా వచ్చింది:

  16. యెషయా 38:5సుమారు క్రీ.పూ. 718

    “నీవు వెళ్లి హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను.

  17. యెషయా 38:6సుమారు క్రీ.పూ. 718

    అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.

  18. యెషయా 38:7సుమారు క్రీ.పూ. 718

    “ ‘యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తారని తెలియజేయడానికి యెహోవా నీకు ఇచ్చే సూచన ఇదే:

  19. యెషయా 38:8సుమారు క్రీ.పూ. 718

    ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి వలన ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు వెనుకకు వెళ్లేలా నేను చేస్తాను.’ ” కాబట్టి సూర్యకాంతి ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మరలా వెనుకకు జరిగింది.

  20. యెషయా 38:9సుమారు క్రీ.పూ. 718

    యూదా రాజైన హిజ్కియా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అతని రచన:

  21. యెషయా 38:10సుమారు క్రీ.పూ. 718

    నేను, “నా జీవిత సగభాగంలో నేను మరణ ద్వారం గుండా వెళ్లాలా, నా మిగిలిన జీవితకాలమంతా పొగొట్టుకున్నానా?”

  22. యెషయా 38:11సుమారు క్రీ.పూ. 718

    నేను, “సజీవుల దేశంలో నేనిక యెహోవాను చూడలేను; నా తోటి మనుష్యులను చూడలేను ఈ లోకంలో ఇప్పుడు నివసించే వారితో ఉండలేను.

  23. యెషయా 38:12సుమారు క్రీ.పూ. 718

    గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు పడవేయబడి నా నుండి తీసివేయబడింది. నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు.

  24. యెషయా 38:13సుమారు క్రీ.పూ. 718

    ఉదయం వరకు ఓపికగా ఉన్నాను, కాని సింహం విరిచినట్లు ఆయన నా ఎముకలన్నీ విరిచారు; పగలు రాత్రి మీరు నా ముగింపు తెచ్చారు.

  25. యెషయా 38:14సుమారు క్రీ.పూ. 718

    కొంగలా చిన్న పిట్టలా నేను కిచకిచ అరిచాను, దుఃఖపడే పావురంలా మూలిగాను ఆకాశాల వైపు చూసి నా కళ్లు అలసిపోయాయి. నేను బెదిరిపోయాను; ప్రభువా, నాకు సహాయం చేయండి.”