కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 38:15సుమారు క్రీ.పూ. 718

    కాని నేనేమి అనగలను? ఆయనే నాకు మాట ఇచ్చారు, ఆయనే ఇది నెరవేర్చారు. నాకు కలిగిన వేదన బట్టి నా సంవత్సరాలన్నీ దీనుడిగా జీవిస్తాను.

  2. యెషయా 38:16సుమారు క్రీ.పూ. 718

    ప్రభువా! వీటి వలన మనుష్యులు జీవిస్తారు. వాటిలో కూడా నా ఆత్మకు జీవం దొరుకుతుంది. మీరు నాకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చారు నన్ను జీవింపచేశారు.

  3. యెషయా 38:17సుమారు క్రీ.పూ. 718

    నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు.

  4. యెషయా 38:18సుమారు క్రీ.పూ. 718

    ఎందుకంటే, సమాధి మిమ్మల్ని స్తుతించలేదు, మరణం మీకు స్తుతులు పాడలేదు. సమాధిలోనికి వెళ్లేవారు మీ నమ్మకత్వం కోసం నిరీక్షించలేరు.

  5. యెషయా 38:19సుమారు క్రీ.పూ. 718

    నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; తల్లిదండ్రులు తమ పిల్లలకు మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు.

  6. యెషయా 38:20సుమారు క్రీ.పూ. 718

    యెహోవా నన్ను రక్షిస్తారు. మనం బ్రతికినన్ని రోజులు యెహోవా మందిరంలో తంతి వాద్యాలు వాయిస్తూ పాడదాము.

  7. యెషయా 38:21సుమారు క్రీ.పూ. 718

    యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేసి ఆ పుండుకు రాస్తే అతడు బాగుపడతాడు” అన్నాడు.

  8. యెషయా 38:22సుమారు క్రీ.పూ. 718

    హిజ్కియా, “నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.

  9. యెషయా 39:1సుమారు క్రీ.పూ. 712

    ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోను రాజైన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసి, తిరిగి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాలు, కానుక పంపాడు.

  10. యెషయా 39:2సుమారు క్రీ.పూ. 712

    హిజ్కియా సంతోషంగా ఆ రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.

  11. యెషయా 39:3సుమారు క్రీ.పూ. 712

    తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు.

  12. యెషయా 39:4సుమారు క్రీ.పూ. 712

    “నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ దాచకుండా అన్నీ వారికి చూపించాను” అన్నాడు.

  13. యెషయా 39:5సుమారు క్రీ.పూ. 712

    అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను:

  14. యెషయా 39:6సుమారు క్రీ.పూ. 712

    ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ, ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు.

  15. యెషయా 39:7సుమారు క్రీ.పూ. 712

    నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.”

  16. యెషయా 39:8సుమారు క్రీ.పూ. 712

    హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే. నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి” అని అన్నాడు.

  17. యెషయా 40:1సుమారు క్రీ.పూ. 712

    నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి, అని మీ దేవుడు చెప్తున్నారు.

  18. యెషయా 40:2సుమారు క్రీ.పూ. 712

    యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి ఆమె యుద్ధకాలం ముగిసిందని ఆమె పాపదోషం తీరిపోయిందని యెహోవా చేతిలో ఆమె పాపాలన్నిటి కోసం రెండింతల ఫలం పొందిందని ఆమెకు తెలియజేయండి.

  19. యెషయా 40:3సుమారు క్రీ.పూ. 712

    బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం: “అరణ్యంలో యెహోవా కోసం మార్గాన్ని సిద్ధపరచండి ఎడారిలో మన దేవునికి రహదారిని సరాళం చేయండి.

  20. యెషయా 40:4సుమారు క్రీ.పూ. 712

    ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది, ప్రతి పర్వతం ప్రతి కొండ సమం చేయబడుతుంది; వంకర త్రోవ తిన్నగా, గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి.

  21. యెషయా 40:5సుమారు క్రీ.పూ. 712

    యెహోవా మహిమ వెల్లడవుతుంది. దాన్ని ప్రజలందరు చూస్తారు. యెహోవాయే ఇది తెలియజేశారు.”

  22. యెషయా 40:6సుమారు క్రీ.పూ. 712

    “మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది, నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను. “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది.

  23. యెషయా 40:7సుమారు క్రీ.పూ. 712

    గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు. నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు.

  24. యెషయా 40:8సుమారు క్రీ.పూ. 712

    గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి, కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.”

  25. యెషయా 40:9సుమారు క్రీ.పూ. 712

    సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తైన పర్వతం ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, నీ గొంత్తెత్తి బలంగా భయపడకుండా ప్రకటించు; యూదా పట్టణాలకు, “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు.