- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 40:10సుమారు క్రీ.పూ. 712
చూడండి, ప్రభువైన యెహోవా శక్తితో వస్తున్నారు, తన బలమైన చేతితో పరిపాలిస్తారు. చూడండి, ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది, ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనను అనుసరిస్తుంది.
- యెషయా 40:11సుమారు క్రీ.పూ. 712
గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు.
- యెషయా 40:12సుమారు క్రీ.పూ. 712
తన చేతితో నీటిని కొలిచిన వారెవరు? జేనతో ఆకాశాన్ని కొలిచిన వారెవరు? భూమిలోని మట్టి అంతటిని బుట్టలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు? తూనికతో కొండలను తూచిన వాడెవడు?
- యెషయా 40:13సుమారు క్రీ.పూ. 712
యెహోవా ఆత్మను తెలుసుకున్న వారెవరు? యెహోవాకు సలహాదారునిగా ఆలోచన చెప్పగలవారెవరు?
- యెషయా 40:14సుమారు క్రీ.పూ. 712
ఎవరి దగ్గర యెహోవా ఆలోచన అడిగారు? న్యాయ మార్గాన్ని ఆయనకు నేర్పిన వారెవరు? ఆయనకు తెలివిని నేర్పించిన వారెవరు? ఆయనకు బుద్ధి మార్గాన్ని చూపించిన వారెవరు?
- యెషయా 40:15సుమారు క్రీ.పూ. 712
నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి. వారు కొలబద్దల మీది ధూళివంటి వారు; ఆయన ద్వీపాలను సన్నటి ధూళిలా కొలుస్తారు.
- యెషయా 40:16సుమారు క్రీ.పూ. 712
బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు, దహనబలికి దాని జంతువులు చాలవు.
- యెషయా 40:17సుమారు క్రీ.పూ. 712
అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే; ఆయన దృష్టికి అవి విలువలేనివిగా శూన్యం కంటే తక్కువగా ఉంటాయి.
- యెషయా 40:18సుమారు క్రీ.పూ. 712
కాబట్టి మీరు ఎవరితో దేవుని పోలుస్తారు? ఏ రూపంతో ఆయనను పోలుస్తారు?
- యెషయా 40:19సుమారు క్రీ.పూ. 712
విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు, కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.
- యెషయా 40:20సుమారు క్రీ.పూ. 712
అలాంటి విలువైన దానిని అర్పణగా ఇవ్వలేని పేదవారు పుచ్చిపోని చెక్కను ఎంచుకుంటారు; విగ్రహం కదలకుండా నిలబెట్టడానికి వారు నిపుణుడైన పనివానిని వెదుకుతారు.
- యెషయా 40:21సుమారు క్రీ.పూ. 712
మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా? భూమి స్థాపించబడడాన్ని బట్టి మీరు గ్రహించలేదా?
- యెషయా 40:22సుమారు క్రీ.పూ. 712
ఆయన భూమండలంపై ఆసీనుడై కూర్చున్నారు. ఆయన ముందు ప్రజలు మిడతల్లా ఉన్నారు. తెరను విప్పినట్లు ఆయన ఆకాశాన్ని పరిచి గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరిచారు.
- యెషయా 40:23సుమారు క్రీ.పూ. 712
ఆయన రాజులను నిష్ఫలం చేస్తారు ఈ లోక పాలకులను ఏమీ లేకుండా చేస్తారు.
- యెషయా 40:24సుమారు క్రీ.పూ. 712
వారు నాటబడిన వెంటనే, వారు విత్తబడిన వెంటనే, వారి భూమిలో వేరు పారకముందే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు. సుడిగాలికి పొట్టు ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొడతారు.
- యెషయా 40:25సుమారు క్రీ.పూ. 712
“నన్ను ఎవరితో పోలుస్తారు? నాకు సమానులెవరు?” అని పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నారు.
- యెషయా 40:26సుమారు క్రీ.పూ. 712
మీ కళ్లు ఎత్తి ఆకాశం వైపు చూడండి: వీటన్నటిని సృజించింది ఎవరు? నక్షత్ర సమూహాన్ని ఒక్కొక్క దానిని తీసుకువస్తూ, వాటి వాటి పేర్ల ప్రకారం పిలిచేవాడే గదా. తన గొప్ప శక్తినిబట్టి, తనకున్న శక్తివంతమైన బలాన్నిబట్టి వాటిలో ఏ ఒక్క దానిని విడిచిపెట్టలేదు.
- యెషయా 40:27సుమారు క్రీ.పూ. 712
యాకోబూ, “నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది; నా న్యాయాన్ని నా దేవుడు పట్టించుకోలేదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెప్తున్నావు?
- యెషయా 40:28సుమారు క్రీ.పూ. 712
నీకు తెలియదా? నీవు వినలేదా? భూమి అంచులను సృష్టించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు, ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.
- యెషయా 40:29సుమారు క్రీ.పూ. 712
ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు.
- యెషయా 40:30సుమారు క్రీ.పూ. 712
యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు.
- యెషయా 40:31సుమారు క్రీ.పూ. 712
కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు, నూతన బలాన్ని పొందుతారు. వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు; అలసిపోకుండా పరుగెత్తుతారు. సొమ్మసిల్లకుండా నడుస్తారు.
- యెషయా 41:1సుమారు క్రీ.పూ. 712
ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండండి! దేశాలు తమ బలాన్ని నూతన పరచుకోవాలి! వారు ముందుకు వచ్చి మాట్లాడాలి; తీర్పు తీర్చే స్థలం దగ్గర మనం కలుసుకుందాము.
- యెషయా 41:2సుమారు క్రీ.పూ. 712
“తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి నీతిలో పిలిచింది ఎవరు? ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు రాజులను అతని ఎదుట అణచివేస్తారు. అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు, తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు.
- యెషయా 41:3సుమారు క్రీ.పూ. 712
అతడు వారిని వెంటాడుతాడు, ఇంతకుముందు తాను వెళ్లని దారైనా క్షేమంగా వెళ్తాడు.