circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 49:28సుమారు క్రీ.పూ. 583
బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసిన కేదారు, హాసోరు రాజ్యాల గురించి: యెహోవా ఇలా అంటున్నారు: “లేవండి, లేచి కేదారు మీద దాడి చేసి తూర్పు ప్రజలను నాశనం చేయండి.
- యిర్మీయా 49:29సుమారు క్రీ.పూ. 583
వారి గుడారాలు, వారి మందలు స్వాధీనం చేసుకోబడ్తాయి; వారి ఒంటెలు, వారి మొత్తం సామాగ్రితో పాటు, వారి గుడారాలను తీసుకెళ్తారు. ‘అన్నివైపులా భయమే!’ అని ప్రజలు వారితో అంటారు.
- యిర్మీయా 49:30సుమారు క్రీ.పూ. 583
“త్వరగా పారిపోండి! హాసోరులో నివసించేవారలారా, లోతైన గుహల్లో దాక్కోండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “బబులోను రాజైన నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. అతడు నీకు వ్యతిరేకంగా ఒక పథకం వేశాడు.
- యిర్మీయా 49:31సుమారు క్రీ.పూ. 583
“మీరు లేచి, నిర్భయంగా జీవిస్తూ, ద్వారాలు గాని అడ్డు గడియలు గాని లేకుండ ప్రజలు క్షేమంగా ఉంటున్న, దేశం మీద దాడి చేయండి,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 49:32సుమారు క్రీ.పూ. 583
“వారి ఒంటెలు దోచుకోబడతాయి, వారి విస్తారమైన మందలు యుద్ధంలో కొల్లగొట్టబడతాయి. సుదూర ప్రాంతాలకు నలువైపులా వారిని చెదరగొట్టి వారి మీదికి అన్నివైపులా విపత్తు తెస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 49:33సుమారు క్రీ.పూ. 583
“హాసోరు నక్కలకు నిలయంగా, ఎప్పటికీ నిర్జన ప్రదేశంగా మారుతుంది. అక్కడ ఎవరూ నివసించరు; దానిలో ఏ ప్రజలు నివసించరు.”
- యిర్మీయా 49:34సుమారు క్రీ.పూ. 583
యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:
- యిర్మీయా 49:35సుమారు క్రీ.పూ. 583
సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను ఏలాము బలానికి మూలమైన విల్లును విరగ్గొడతాను.
- యిర్మీయా 49:36సుమారు క్రీ.పూ. 583
నేను ఏలాముకు వ్యతిరేకంగా ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు గాలులను రప్పిస్తాను; నేను వారిని నాలుగు గాలులకు చెదరగొడతాను, చెదిరిపోయిన ఏలాము వారు వెళ్లని దేశమే ఉండదు.
- యిర్మీయా 49:37సుమారు క్రీ.పూ. 583
నేను ఏలామును వారి శత్రువుల ఎదుట, వారిని చంపాలనుకున్న వారి ఎదుట వారిని చెదరగొడతాను. నేను వారి మీదికి విపత్తును, నా కోపాగ్నిని కూడా రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.
- యిర్మీయా 49:38సుమారు క్రీ.పూ. 583
ఏలాములో నా సింహాసనాన్ని స్థాపించి, దాని రాజును, అధికారులను నాశనం చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 49:39సుమారు క్రీ.పూ. 583
“అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 50:1సుమారు క్రీ.పూ. 595
బబులోను గురించి, బబులోనీయుల దేశం గురించి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన వాక్కు ఇది:
- యిర్మీయా 50:2సుమారు క్రీ.పూ. 595
“దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, మర్దూకు దేవత పడవేయబడుతుంది. బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’
- యిర్మీయా 50:3సుమారు క్రీ.పూ. 595
ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి దాని దేశాన్ని పాడుచేస్తుంది. దానిలో ఎవరూ నివసించరు; మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి.
- యిర్మీయా 50:4సుమారు క్రీ.పూ. 595
“ఆ రోజుల్లో, ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కన్నీటితో వెళ్తారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 50:5సుమారు క్రీ.పూ. 595
వారు సీయోనుకు వెళ్లే దారి ఎటు అని అడిగి ఆ దారిలో ప్రయాణిస్తారు. వారు వచ్చి మరచిపోలేని శాశ్వతమైన ఒడంబడికలో యెహోవాకు కట్టుబడి ఉంటారు.
- యిర్మీయా 50:6సుమారు క్రీ.పూ. 595
“నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలు; వారి కాపరులు వారిని తప్పుత్రోవ పట్టించి వారిని పర్వతాలమీద తిరిగేలా చేశారు. వారు పర్వతాలు, కొండలమీద తిరుగుతూ, తమ సొంత విశ్రాంతి స్థలాన్ని మరచిపోయారు.
- యిర్మీయా 50:7సుమారు క్రీ.పూ. 595
వారిని చూసినవారు వారిని మ్రింగివేశారు; వారి శత్రువులు, ‘మేము దోషులం కాదు, ఎందుకంటే వారు తమ నీతి సింహాసనమైన యెహోవాకు, తమ పూర్వికుల నిరీక్షణయైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు’ అని అన్నారు.
- యిర్మీయా 50:8సుమారు క్రీ.పూ. 595
“బబులోను నుండి పారిపోండి; బబులోనీయుల దేశాన్ని విడిచిపెట్టండి, మందను నడిపించే మేకపోతుల్లా ప్రజల ముందు నడవండి.
- యిర్మీయా 50:9సుమారు క్రీ.పూ. 595
నేను బబులోనుకు వ్యతిరేకంగా ఉత్తర దేశం నుండి గొప్ప దేశాల కూటమిని రప్పిస్తాను. వారు దానికి వ్యతిరేకంగా యుద్ధపంక్తులు తీర్చుతారు, ఉత్తరం నుండి దాన్ని పట్టుకుంటారు. వారి బాణాలు వట్టి చేతులతో తిరిగి రాని నైపుణ్యం కలిగిన యోధుల వలె ఉంటాయి.
- యిర్మీయా 50:10సుమారు క్రీ.పూ. 595
కాబట్టి బబులోను దోచుకోబడుతుంది; దాన్ని దోచుకునే వారందరూ సంతృప్తి చెందుతారు” అని యెహోవా ప్రకటించాడు.
- యిర్మీయా 50:11సుమారు క్రీ.పూ. 595
“నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా, అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు.
- యిర్మీయా 50:12సుమారు క్రీ.పూ. 595
నీ తల్లి చాలా సిగ్గుపడుతుంది; నీకు జన్మనిచ్చిన ఆమె పరువు పోతుంది. అది దేశాలన్నిటిలో నీచమైనదిగా అరణ్యంగా, ఎండిన భూమిగా, ఎడారిగా ఉంటుంది.
- యిర్మీయా 50:13సుమారు క్రీ.పూ. 595
యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు. పూర్తిగా నిర్జనమైపోతుంది. బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు; దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు.