కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 48:25సుమారు క్రీ.పూ. 584

    మోయాబు కొమ్ము నరికివేయబడింది; దాని బాహువు విరిగింది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  2. యిర్మీయా 48:26సుమారు క్రీ.పూ. 584

    “ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి, ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది. మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది; ఆమె హేళన చేయబడుతుంది.

  3. యిర్మీయా 48:27సుమారు క్రీ.పూ. 584

    ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా? ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా, నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?

  4. యిర్మీయా 48:28సుమారు క్రీ.పూ. 584

    మోయాబులో నివసించేవారలారా, మీ పట్టణాలను విడిచిపెట్టి రాళ్ల మధ్య నివసించండి. గుహ ముఖద్వారం దగ్గర గూడు కట్టుకునే పావురంలా ఉండండి.

  5. యిర్మీయా 48:29సుమారు క్రీ.పూ. 584

    “మోయాబు గర్వం గురించి దానికి అహంకారం గురించి దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం, దాని హృదయ అతిశయం గురించి విన్నాము.

  6. యిర్మీయా 48:30సుమారు క్రీ.పూ. 584

    దాని తలపొగరు నాకు తెలుసు, దానికి ఏ విలువలేదు, దాని ప్రగల్భాలు ఏమీ సాధించవు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  7. యిర్మీయా 48:31సుమారు క్రీ.పూ. 584

    కాబట్టి నేను మోయాబు గురించి రోదిస్తున్నాను, మోయాబు అంతటి కోసం నేను బిగ్గరగా ఏడుస్తున్నాను, కీర్ హరెశెతు ప్రజల కోసం నేను మూలుగుతున్నాను.

  8. యిర్మీయా 48:32సుమారు క్రీ.పూ. 584

    షిబ్మా ద్రాక్షలారా, యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను. మీ కొమ్మలు సముద్రం వరకు వ్యాపించాయి; అవి యాజెరు వరకు వ్యాపించాయి. నాశనం చేసేవాడు, పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.

  9. యిర్మీయా 48:33సుమారు క్రీ.పూ. 584

    మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి ఆనందం, సంతోషం పోయాయి. నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. కేకలు వినిపించినప్పటికీ, అవి ఆనందంతో వేసిన కేకలు కావు.

  10. యిర్మీయా 48:34సుమారు క్రీ.పూ. 584

    “నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.

  11. యిర్మీయా 48:35సుమారు క్రీ.పూ. 584

    క్షేత్రాల దగ్గర అర్పణలు అర్పించేవారిని మోయాబులో తమ దేవుళ్ళకు ధూపం వేసేవారిని నేను మోయాబులో లేకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. యిర్మీయా 48:36సుమారు క్రీ.పూ. 584

    “కాబట్టి నా హృదయం మోయాబు గురించి పిల్లనగ్రోవిలా విలపిస్తుంది; అది కీర్ హరెశెతు ప్రజలకు పిల్లనగ్రోవిలా విలపిస్తుంది. వారు సంపాదించిన సంపద పోయింది.

  13. యిర్మీయా 48:37సుమారు క్రీ.పూ. 584

    ప్రతి తల గుండు చేయబడింది ప్రతి గడ్డం కత్తిరించబడింది; ప్రతి చేయి నరకబడింది ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది.

  14. యిర్మీయా 48:38సుమారు క్రీ.పూ. 584

    మోయాబులో ఇళ్ల పైకప్పులన్నిటి మీద బహిరంగ కూడళ్లలో దుఃఖం తప్ప మరేమీ లేదు, పనికిరాని కుండను పగలగొట్టినట్లు నేను మోయాబును పగులగొట్టాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  15. యిర్మీయా 48:39సుమారు క్రీ.పూ. 584

    “అది ఎలా శిథిలమైపోయిందో! వారు ఎలా విలపిస్తున్నారో! మోయాబు సిగ్గుతో ఎలా వెన్నుచూపిస్తుందో! మోయాబు దాని చుట్టూ ఉన్నవారందరికి, హేళనగా భయం పుట్టించేదిగా మారింది.”

  16. యిర్మీయా 48:40సుమారు క్రీ.పూ. 584

    యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి! ఒక గ్రద్ద మోయాబు మీద రెక్కలు విప్పుకుని దూసుకుపోతుంది.

  17. యిర్మీయా 48:41సుమారు క్రీ.పూ. 584

    కెరీయోతు స్వాధీనం చేసుకోబడుతుంది, బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి. ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి.

  18. యిర్మీయా 48:42సుమారు క్రీ.పూ. 584

    మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది.

  19. యిర్మీయా 48:43సుమారు క్రీ.పూ. 584

    మోయాబు ప్రజలారా, భయాందోళనలు, గొయ్యి, ఉచ్చు మీ కోసం ఎదురుచూస్తున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  20. యిర్మీయా 48:44సుమారు క్రీ.పూ. 584

    “భయాందోళన నుండి పారిపోయేవాడు గొయ్యిలో పడిపోతాడు, గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు ఉచ్చులో చిక్కుకుంటాడు; నేను మోయాబు మీదికి దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  21. యిర్మీయా 48:45సుమారు క్రీ.పూ. 584

    “పారిపోయినవారు హెష్బోను నీడలో బలహీనులై నిలబడి ఉన్నారు, హెష్బోను నుండి అగ్ని, సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి. అది మోయాబు నొసళ్లను, అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది.

  22. యిర్మీయా 48:46సుమారు క్రీ.పూ. 584

    మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలు నాశనమైపోయారు; నీ కుమారులు బందీలుగా వెళ్లారు నీ కుమార్తెలు బందీలుగా కొనిపోబడ్డారు.

  23. యిర్మీయా 48:47సుమారు క్రీ.పూ. 584

    “అయితే నేను రాబోయే రోజుల్లో మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.

  24. యిర్మీయా 49:1సుమారు క్రీ.పూ. 583

    అమ్మోనీయుల గురించి: యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? ఇశ్రాయేలుకు వారసుడు లేడా? మోలెకు గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు?

  25. యిర్మీయా 49:2సుమారు క్రీ.పూ. 583

    అయితే ఆ రోజులు రాబోతున్నాయి” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా నేను యుద్ధధ్వని చేసినప్పుడు; అది శిథిలాల దిబ్బ అవుతుంది, దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి. అప్పుడు ఇశ్రాయేలు దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,” అని యెహోవా అంటున్నారు.