కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే అష్కెలోను మీదా, సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని, యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు, అది ఎలా విశ్రమిస్తుంది?”

  2. యిర్మీయా 48:1సుమారు క్రీ.పూ. 584

    మోయాబు గురించి: ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “నెబోకు శ్రమ, అది శిథిలమైపోతుంది. కిర్యతాయిము ఆక్రమించబడి అవమానించబడుతుంది; దాని కోట పడగొట్టబడి అవమానించబడుతుంది.

  3. యిర్మీయా 48:2సుమారు క్రీ.పూ. 584

    మోయాబును ఇకపై పొగడరు; హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు: ‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’ మద్మేను ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు; ఖడ్గం నిన్ను వెంటాడుతుంది.

  4. యిర్మీయా 48:3సుమారు క్రీ.పూ. 584

    హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.

  5. యిర్మీయా 48:4సుమారు క్రీ.పూ. 584

    మోయాబు ధ్వంసమవుతుంది; దాని చిన్న బిడ్డలు బిగ్గరగా ఏడుస్తారు.

  6. యిర్మీయా 48:5సుమారు క్రీ.పూ. 584

    వారు కొండపై నుండి లూహీతుకు, ఏడుస్తూ వెళ్తున్నారు; హొరొనయీముకు వెళ్లే దారిలో జరిగిన విధ్వంసం వల్ల ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

  7. యిర్మీయా 48:6సుమారు క్రీ.పూ. 584

    పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి.

  8. యిర్మీయా 48:7సుమారు క్రీ.పూ. 584

    మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి, మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు, అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.

  9. యిర్మీయా 48:8సుమారు క్రీ.పూ. 584

    యెహోవా చెప్పారు కాబట్టి నాశనం చేసేవాడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు, ఒక్క పట్టణం తప్పించుకోదు. లోయ పాడైపోతుంది, పీఠభూమి నాశనమవుతుంది.

  10. యిర్మీయా 48:9సుమారు క్రీ.పూ. 584

    మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే, అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది; నివసించేవారు లేక, దాని పట్టణాలు నిర్జనమైపోయేవి.

  11. యిర్మీయా 48:10సుమారు క్రీ.పూ. 584

    “యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు! రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు!

  12. యిర్మీయా 48:11సుమారు క్రీ.పూ. 584

    “మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.”

  13. యిర్మీయా 48:12సుమారు క్రీ.పూ. 584

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను, కుండను కుమ్మరించే వారిని పంపినప్పుడు, వారు దాన్ని బయటకు కుమ్మరించి, కుండలను ఖాళీచేసి వాటిని పగలగొడతారు.

  14. యిర్మీయా 48:13సుమారు క్రీ.పూ. 584

    ఇశ్రాయేలీయులు బేతేలును నమ్మినప్పుడు ఎలా సిగ్గుపడ్డారో మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడతారు.

  15. యిర్మీయా 48:14సుమారు క్రీ.పూ. 584

    “ ‘మేము యోధులం, యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు?

  16. యిర్మీయా 48:15సుమారు క్రీ.పూ. 584

    మోయాబు నాశనమై దాని పట్టణాలు ఆక్రమించబడతాయి; దాని శ్రేష్ఠమైన యువకులు వధకు గురవుతారు,” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.

  17. యిర్మీయా 48:16సుమారు క్రీ.పూ. 584

    “మోయాబు పతనం సమీపించింది; దాని విపత్తు త్వరగా వస్తుంది.

  18. యిర్మీయా 48:17సుమారు క్రీ.పూ. 584

    దాని చుట్టూ నివసించేవారలారా, దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి.

  19. యిర్మీయా 48:18సుమారు క్రీ.పూ. 584

    “దీబోను కుమార్తెలారా, మీ కీర్తి నుండి క్రిందికి దిగి, ఎండిపోయిన నేల మీద కూర్చుండి, ఎందుకంటే మోయాబును నాశనం చేసేవాడు మీ మీదికి వస్తాడు మీ కోట పట్టణాలను పతనం చేస్తాడు.

  20. యిర్మీయా 48:19సుమారు క్రీ.పూ. 584

    అరోయేరులో నివసించేవారలారా, రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి. పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని, ‘ఏమైంది?’ అని అడగండి.

  21. యిర్మీయా 48:20సుమారు క్రీ.పూ. 584

    మోయాబు కుప్పకూలిపోయి, అపకీర్తి పాలయింది. రోదించండి, బిగ్గరగా ఏడవండి! మోయాబు నాశనమైపోయిందని అర్నోనులో ప్రకటించండి.

  22. యిర్మీయా 48:21సుమారు క్రీ.పూ. 584

    పీఠభూమికి తీర్పు తీర్చబడింది హోలోనుకు, యహజుకు, మెఫాతుకు,

  23. యిర్మీయా 48:22సుమారు క్రీ.పూ. 584

    దీబోనుకు, నెబోకు, బేత్-దిబ్లాతయీము,

  24. యిర్మీయా 48:23సుమారు క్రీ.పూ. 584

    కిర్యతాయిముకు, బేత్-గమూలుకు, బేత్-మెయోనుకు,

  25. యిర్మీయా 48:24సుమారు క్రీ.పూ. 584

    కెరీయోతుకు, బొస్రాకు దూరంగా దగ్గరగా ఉన్న మోయాబులోని అన్ని పట్టణాలకు శిక్ష విధించబడుతుంది.