circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 44:20సుమారు క్రీ.పూ. 587
అప్పుడు యిర్మీయా తనకు జవాబిస్తున్న స్త్రీ పురుషులందరితో ఇలా అన్నాడు:
- యిర్మీయా 44:21సుమారు క్రీ.పూ. 587
“మీరు, మీ పూర్వికులు, మీ రాజులు, మీ అధికారులు దేశ ప్రజలు, యూదా పట్టణాల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ధూపం వేసిన విషయం యెహోవా గుర్తుంచుకుని జ్ఞాపకం తెచ్చుకోలేదా?
- యిర్మీయా 44:22సుమారు క్రీ.పూ. 587
మీ దుష్ట కార్యాలను, మీరు చేసిన అసహ్యకరమైన పనులను యెహోవా ఇక భరించలేనప్పుడు, మీ దేశం నేడు ఉన్నట్లుగా శాపంగా, నివాసులు లేని నిర్జనమైనదిగా మారింది.
- యిర్మీయా 44:23సుమారు క్రీ.పూ. 587
ఎందుకంటే మీరు ధూపం వేసి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయనకు విధేయత చూపలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన నిబంధనలను అనుసరించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.”
- యిర్మీయా 44:24సుమారు క్రీ.పూ. 587
అప్పుడు యిర్మీయా స్త్రీలతో సహా ప్రజలందరితో, “ఈజిప్టులోని యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
- యిర్మీయా 44:25సుమారు క్రీ.పూ. 587
ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు. “అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి!
- యిర్మీయా 44:26సుమారు క్రీ.పూ. 587
అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.”
- యిర్మీయా 44:27సుమారు క్రీ.పూ. 587
ఎందుకంటే నేను వారికి మేలు చేయాలని కాదు వారికి కీడు చేయడం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈజిప్టులోని యూదులు పూర్తిగా నాశనమయ్యే వరకు ఖడ్గంతోను కరువుతోను చస్తారు.
- యిర్మీయా 44:28సుమారు క్రీ.పూ. 587
ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.
- యిర్మీయా 44:29సుమారు క్రీ.పూ. 587
“ ‘నేను ఈ స్థలంలో నిన్ను శిక్షిస్తాను అనడానికి ఇది నీకు సూచనగా ఉంటుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘తద్వార నీకు హాని చేస్తాననే నా బెదిరింపులు తప్పక నిజమవుతాయని మీరు తెలుసుకుంటారు.’
- యిర్మీయా 44:30సుమారు క్రీ.పూ. 587
యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ”
- యిర్మీయా 45:1సుమారు క్రీ.పూ. 607
యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలన నాల్గవ సంవత్సరంలో యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలను నేరియా కుమారుడైన బారూకు గ్రంథపుచుట్టలో వ్రాసినప్పుడు, యిర్మీయా బారూకుతో ఇలా అన్నాడు:
- యిర్మీయా 45:2సుమారు క్రీ.పూ. 607
“బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో ఇలా అంటున్నారు:
- యిర్మీయా 45:3సుమారు క్రీ.పూ. 607
‘అయ్యో నాకు శ్రమ! యెహోవా నా బాధకు దుఃఖాన్ని జోడించారు; నేను మూలుగులతో సొమ్మసిల్లిపోయాను, నాకు నెమ్మది లేదు’ అని నీవు అనుకుంటున్నావు.
- యిర్మీయా 45:4సుమారు క్రీ.పూ. 607
అయితే యెహోవా నీతో, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తాను, నేను నాటిన వాటిని నేనే పెరికివేస్తాను; ఇది భూమి అంతటా జరుగుతుంది’ అని చెప్పమని నాకు చెప్పారు.
- యిర్మీయా 45:5సుమారు క్రీ.పూ. 607
‘అలాంటప్పుడు నీకోసం నీవు గొప్ప వాటిని వెదుక్కోవాలా? వాటిని వెదకవద్దు. నేను ప్రజలందరికి విపత్తు తెస్తాను, కానీ నీవు ఎక్కడికి వెళ్లినా నీవు ప్రాణాలతో తప్పించుకునేలా చేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యిర్మీయా 46:1సుమారు క్రీ.పూ. 607
ఇతర దేశాల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
- యిర్మీయా 46:2సుమారు క్రీ.పూ. 607
ఈజిప్టును గురించి: యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:
- యిర్మీయా 46:3సుమారు క్రీ.పూ. 607
“చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి.
- యిర్మీయా 46:4సుమారు క్రీ.పూ. 607
గుర్రాలను సిద్ధం చేసుకోండి, గుర్రాలను ఎక్కండి! శిరస్త్రాణం ధరించి బయలుదేరడానికి సిద్ధపడండి! నీ ఈటెలను పదును చేయండి, మీ కవచాన్ని ధరించండి!
- యిర్మీయా 46:5సుమారు క్రీ.పూ. 607
నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 46:6సుమారు క్రీ.పూ. 607
“వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.
- యిర్మీయా 46:7సుమారు క్రీ.పూ. 607
“నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు?
- యిర్మీయా 46:8సుమారు క్రీ.పూ. 607
ఈజిప్టు నైలు నదిలా, ఉప్పెనలా ప్రవహిస్తుంది. ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను, పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది.
- యిర్మీయా 46:9సుమారు క్రీ.పూ. 607
గుర్రాల్లారా ఎగరండి, రథాల్లారా రెచ్చిపోండి! యోధులారా, డాళ్లు మోసే కూషు వారలారా, పూతు వారలారా, బయలుదేరండి, విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి.