circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 43:8సుమారు క్రీ.పూ. 588
తహ్పన్హేసులో యిర్మీయాకు యెహోవా వాక్కు ఇలా వచ్చింది:
- యిర్మీయా 43:9సుమారు క్రీ.పూ. 588
“యూదులు చూస్తుండగానే, నీతో పాటు కొన్ని పెద్ద రాళ్లను తీసుకెళ్లి, తహ్పన్హేసులోని ఫరో రాజభవనం ద్వారం దగ్గర ఉన్న ఇటుక కాలిబాటలో మట్టిలో పాతిపెట్టు.
- యిర్మీయా 43:10సుమారు క్రీ.పూ. 588
అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను నా సేవకుడును బబులోను రాజైన నెబుకద్నెజరును పిలిపించి, నేను ఇక్కడ పాతిపెట్టిన ఈ రాళ్లపై అతని సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాను; అతడు వాటి మీద తన రాజ మండపాన్ని వేస్తాడు.
- యిర్మీయా 43:11సుమారు క్రీ.పూ. 588
అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు.
- యిర్మీయా 43:12సుమారు క్రీ.పూ. 588
అతడు ఈజిప్టు దేవతల ఆలయాలకు నిప్పంటిస్తాడు; అతడు వారి దేవాలయాలను కాల్చివేస్తాడు వారి దేవుళ్ళను బందీగా తీసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పేళ్లను దులిపివేసినట్లు అతడు ఈజిప్టును శుభ్రంగా దులిపివేసి అక్కడినుండి సమాధానంగా వెళ్లిపోతాడు.
- యిర్మీయా 43:13సుమారు క్రీ.పూ. 588
అక్కడ ఈజిప్టులోని బేత్-షెమెషులో ఉన్న సూర్య దేవాలయంలో పవిత్ర స్తంభాలను పడగొట్టి, ఈజిప్టు దేవతల ఆలయాలను కాల్చివేస్తాడు.’ ”
- యిర్మీయా 44:1సుమారు క్రీ.పూ. 587
ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:
- యిర్మీయా 44:2సుమారు క్రీ.పూ. 587
“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: యెరూషలేము మీదా యూదా పట్టణాలన్నింటి మీదా నేను తెచ్చిన మహా విపత్తును మీరు చూశారు. వారు చేసిన దుర్మార్గం కారణంగా నేడు అవి నిర్జనమై శిథిలావస్థలో ఉన్నాయి.
- యిర్మీయా 44:3సుమారు క్రీ.పూ. 587
వారికి గాని, మీకు గాని, మీ పూర్వికులకు గాని ఎన్నడూ తెలియని ఇతర దేవతలకు వారు ధూపం వేసి, పూజించి వారు నా కోపాన్ని రెచ్చగొట్టారు.
- యిర్మీయా 44:4సుమారు క్రీ.పూ. 587
‘నేను అసహ్యించుకునే ఈ అసహ్యకరమైన పనిని చేయవద్దు!’ అని చెప్పమని మళ్ళీ మళ్ళీ నేను నా సేవకులైన ప్రవక్తలను పంపాను, వారు వెళ్లి చెప్పారు.
- యిర్మీయా 44:5సుమారు క్రీ.పూ. 587
కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఇతర దేవతలకు ధూపం వేయడం ఆపలేదు.
- యిర్మీయా 44:6సుమారు క్రీ.పూ. 587
కాబట్టి, నా తీవ్రమైన కోపం యూదా పట్టణాల మీదా, యెరూషలేము వీధుల మీదా కుమ్మరించబడి వాటిని నేటి వరకు పాడైపోయిన శిథిలాలుగా మిగిల్చింది.
- యిర్మీయా 44:7సుమారు క్రీ.పూ. 587
“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: యూదాలో స్త్రీలూ, పురుషులు, పిల్లలు, పసిపిల్లలు ఎవరూ ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీ మీదికి మీరే విపత్తు ఎందుకు తెచ్చుకుంటున్నారు?
- యిర్మీయా 44:8సుమారు క్రీ.పూ. 587
మీరు నివసించడానికి వచ్చిన ఈజిప్టులో ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ, మీ చేతులు చేసిన వాటితో ఎందుకు నా కోపాన్ని రెచ్చగొడుతున్నారు? మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, భూమిపై ఉన్న అన్ని దేశాల మధ్య మిమ్మల్ని మీరు ఒక శాపంగా చేసుకుంటారు, అవమానం పాలవుతారు.
- యిర్మీయా 44:9సుమారు క్రీ.పూ. 587
మీ పూర్వికులు, యూదా రాజులు, రాణులు చేసిన దుర్మార్గాన్ని, యూదా దేశంలో, యెరూషలేము వీధుల్లో మీరు, మీ భార్యలు చేసిన దుర్మార్గాన్ని మీరు మరచిపోయారా?
- యిర్మీయా 44:10సుమారు క్రీ.పూ. 587
ఈ రోజు వరకు వారు తమను తాము తగ్గించుకోలేదు, గౌరవం చూపించలేదు, నేను మీ ముందు, మీ పూర్వికుల ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను మీరు అనుసరించలేదు.
- యిర్మీయా 44:11సుమారు క్రీ.పూ. 587
“కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మీదికి విపత్తు తెచ్చి యూదా అంతటిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను.
- యిర్మీయా 44:12సుమారు క్రీ.పూ. 587
ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు.
- యిర్మీయా 44:13సుమారు క్రీ.పూ. 587
నేను యెరూషలేమును ఎలా శిక్షించానో ఈజిప్టులో నివసించేవారిని కూడా ఖడ్గంతో, కరువుతో, తెగులుతో అలాగే శిక్షిస్తాను.
- యిర్మీయా 44:14సుమారు క్రీ.పూ. 587
ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.”
- యిర్మీయా 44:15సుమారు క్రీ.పూ. 587
అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తున్నారని తెలిసిన పురుషులు, అక్కడ ఉన్న స్త్రీలందరు పెద్ద సమాజంగా చేరి దిగువ ఎగువ ఈజిప్టులో అనగా పత్రూసులో నివసిస్తున్న ప్రజలందరూ యిర్మీయాతో ఇలా అన్నారు,
- యిర్మీయా 44:16సుమారు క్రీ.పూ. 587
“యెహోవా పేరిట నీవు మాతో చెప్పిన సందేశాన్ని మేము వినము.
- యిర్మీయా 44:17సుమారు క్రీ.పూ. 587
ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు.
- యిర్మీయా 44:18సుమారు క్రీ.పూ. 587
ఆకాశ రాణికి ధూపం వేయడం ఆమెకు పానార్పణలు అర్పించడం మానివేసినప్పటి నుండి మా దగ్గర ఏమి లేకుండా పోయింది, మేము ఖడ్గం చేత కరువుచేత నాశనమవుతున్నాము.”
- యిర్మీయా 44:19సుమారు క్రీ.పూ. 587
ఆ స్త్రీలు ఇంకా ఇలా అన్నారు: “మేము ఆకాశ రాణికి ధూపం వేసి, ఆమెకు పానార్పణలు అర్పించినప్పుడు, మేము ఆమె ప్రతిమకు నచ్చిన రొట్టెలు చేసి, ఆమెకు పానార్పణలు అర్పిస్తున్నామని మా భర్తలకు తెలియదా?” అని అన్నారు.