circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 42:5సుమారు క్రీ.పూ. 588
అప్పుడు వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ దేవుడైన యెహోవా నీ ద్వారా మాకు తెలియజేసిన మాటల ప్రకారం మేము చేయకపోతే, యెహోవాయే మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండును గాక.
- యిర్మీయా 42:6సుమారు క్రీ.పూ. 588
అది మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము నిన్ను పంపుతున్న మా దేవుడైన యెహోవాకు లోబడతాము. మా దేవుడైన యెహోవాకు లోబడితే మాకు మంచే జరుగుతుంది.”
- యిర్మీయా 42:7సుమారు క్రీ.పూ. 588
పది రోజుల తర్వాత యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.
- యిర్మీయా 42:8సుమారు క్రీ.పూ. 588
కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు.
- యిర్మీయా 42:9సుమారు క్రీ.పూ. 588
అతడు వారితో, “మీ విన్నపాన్ని తెలియజేయడానికి మీరు ఎవరి దగ్గరకు నన్ను పంపించారో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు:
- యిర్మీయా 42:10సుమారు క్రీ.పూ. 588
‘మీరు ఈ దేశంలోనే ఉంటే, నేను మిమ్మల్ని కడతాను, కూల్చివేయను; నేను మిమ్మల్ని నాటుతాను, పెరికివేయను, ఎందుకంటే నేను మీకు కలిగించిన విపత్తు గురించి బాధపడ్డాను.
- యిర్మీయా 42:11సుమారు క్రీ.పూ. 588
ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను.
- యిర్మీయా 42:12సుమారు క్రీ.పూ. 588
నేను మీమీద కనికరం చూపిస్తాను, అప్పుడు అతడు మీమీద కనికరం చూపి, మిమ్మల్ని మీ దేశానికి తిరిగి పంపుతాడు.’
- యిర్మీయా 42:13సుమారు క్రీ.పూ. 588
“అయితే, ‘మేము ఈ దేశంలో ఉండము’ అని చెప్పి, మీ దేవుడైన యెహోవాకు అవిధేయత చూపితే,
- యిర్మీయా 42:14సుమారు క్రీ.పూ. 588
ఒకవేళ మీరు, ‘వద్దు, మేము ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసిస్తాము. మేము యుద్ధం చూడం, బూరధ్వని వినం, రొట్టెల కోసం ఆకలితో ఉండం’ అని అంటే,
- యిర్మీయా 42:15సుమారు క్రీ.పూ. 588
యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే,
- యిర్మీయా 42:16సుమారు క్రీ.పూ. 588
మీరు ఏ ఖడ్గానికి భయపడతారో అది అక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు భయపడే కరువు ఈజిప్టులోకి కూడా మిమ్మల్ని వెంటపడుతుంది, అక్కడే మీరు చనిపోతారు.
- యిర్మీయా 42:17సుమారు క్రీ.పూ. 588
నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’
- యిర్మీయా 42:18సుమారు క్రీ.పూ. 588
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘యెరూషలేములో నివసించేవారి మీద నా కోపం, ఉగ్రత ఎలా కుమ్మరించానో, మీరు ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా నా కోపం మీమీద అలాగే కుమ్మరిస్తాను. మీరు శాపగ్రస్తులుగా, భయానకంగా, శాపంగా, నిందగా అవుతారు; మీరు ఈ స్థలాన్ని మళ్ళీ చూడలేరు.’
- యిర్మీయా 42:19సుమారు క్రీ.పూ. 588
“యూదాలో మిగిలి ఉన్నవారలారా, ‘ఈజిప్టుకు వెళ్లవద్దు’ అని యెహోవా మీతో చెప్పారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి:
- యిర్మీయా 42:20సుమారు క్రీ.పూ. 588
మీరు నన్ను మీ దేవుడైన యెహావా దగ్గరకు పంపి, ‘మాకోసం మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి, ఆయన చెప్పే ప్రతిదీ మాతో చెప్పు, మేము అలాగే చేస్తాము’ అని చెప్పి మీరు ఘోరమైన తప్పు చేశారని గుర్తుంచుకోండి.
- యిర్మీయా 42:21సుమారు క్రీ.పూ. 588
ఈ రోజు నేను మీతో చెప్పాను, కానీ మీకు చెప్పమని నన్ను పంపిన వాటన్నిటిలో దేనికి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు.
- యిర్మీయా 42:22సుమారు క్రీ.పూ. 588
కాబట్టి ఇప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోండి: మీరు ఎక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా మీరు ఖడ్గం, కరువు, తెగులు వల్ల చనిపోతారు.”
- యిర్మీయా 43:1సుమారు క్రీ.పూ. 588
వారి దేవుడైన యెహోవా వారికి చెప్పమని తెలియజేసిన వాక్కులన్నిటిని యిర్మీయా ప్రజలకు చెప్పడం ముగించిన తర్వాత ఏ వాక్కులు చెప్పమని యెహోవా అతన్ని వారి దగ్గరకు పంపాడో ఆ వాక్కులన్నిటిని చెప్పిన తర్వాత,
- యిర్మీయా 43:2సుమారు క్రీ.పూ. 588
హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.
- యిర్మీయా 43:3సుమారు క్రీ.పూ. 588
అయితే నేరియా కుమారుడైన బారూకు మమ్మల్ని బబులోనీయులకు అప్పగించమని నిన్ను మా మీదికి రెచ్చగొడుతున్నాడు, అలా చేస్తే వారు మమ్మల్ని చంపుతారు లేదా బబులోనుకు బందీలుగా తీసుకెళ్తారు” అని అన్నారు.
- యిర్మీయా 43:4సుమారు క్రీ.పూ. 588
కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్య అధికారులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండాలి అనే యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించారు.
- యిర్మీయా 43:5సుమారు క్రీ.పూ. 588
అందుకు బదులుగా, కారేహ కుమారుడైన యోహానాను సైన్య అధికారులందరూ ఆయా దేశాలకు పారిపోయి యూదా దేశానికి తిరిగివచ్చిన మిగిలి ఉన్న యూదా ప్రజలందరిని తీసుకెళ్లారు.
- యిర్మీయా 43:6సుమారు క్రీ.పూ. 588
షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యా దగ్గర రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను విడిచిపెట్టిన వారందరినీ అనగా పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను కూడా వారు తీసుకెళ్లారు. అలాగే వారు ప్రవక్తయైన యిర్మీయాను, నేరియా కుమారుడైన బారూకును తమ వెంట తీసుకెళ్లారు.
- యిర్మీయా 43:7సుమారు క్రీ.పూ. 588
వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు.