circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 39:7సుమారు క్రీ.పూ. 588
అప్పుడు అతడు సిద్కియా కళ్లు ఊడదీసి, అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.
- యిర్మీయా 39:8సుమారు క్రీ.పూ. 588
బబులోనీయులు రాజభవనాలన్నిటిని ప్రజల ఇళ్ళను తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు.
- యిర్మీయా 39:9సుమారు క్రీ.పూ. 588
రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలి ఉన్నవారిని, ద్రోహులై తమ రాజును విడిచి అతనితో చేరిన వారిని, మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.
- యిర్మీయా 39:10సుమారు క్రీ.పూ. 588
అయితే రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలో విడిచిపెట్టి వారికి ద్రాక్షతోటలు పొలాలు ఇచ్చాడు.
- యిర్మీయా 39:11సుమారు క్రీ.పూ. 588
ఇప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యిర్మీయా గురించి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు:
- యిర్మీయా 39:12సుమారు క్రీ.పూ. 588
“అతన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలి; అతనికి హాని చేయవద్దు, అతడు ఏమి అడిగినా అతని కోసం చేయాలి.”
- యిర్మీయా 39:13సుమారు క్రీ.పూ. 588
కాబట్టి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను, ముఖ్య అధికారి నెబూషజ్బాను, ఉన్నతాధికారియైన నెర్గల్-షారెజెరు, బబులోను రాజు ఇతర అధికారులందరూ,
- యిర్మీయా 39:14సుమారు క్రీ.పూ. 588
మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు.
- యిర్మీయా 39:15సుమారు క్రీ.పూ. 588
యిర్మీయా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉన్నప్పుడు, అతనికి యెహోవా వాక్కు వచ్చి:
- యిర్మీయా 39:16సుమారు క్రీ.పూ. 588
“వెళ్లి కూషీయుడైన ఎబెద్-మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణానికి వ్యతిరేకంగా చెప్పిన నా మాటలను అనగా మేలు గురించి కాదు కాని కీడు గురించి చెప్పిన మాటలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ సమయంలో అవి మీ కళ్లముందు నెరవేరుతాయి.
- యిర్మీయా 39:17సుమారు క్రీ.పూ. 588
అయితే ఆ రోజు నేను నిన్ను రక్షిస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు; నీవు భయపడేవారి చేతికి నీవు అప్పగించబడవు.
- యిర్మీయా 39:18సుమారు క్రీ.పూ. 588
నేను నిన్ను రక్షిస్తాను; నీవు నన్ను నమ్మావు కాబట్టి నీవు ఖడ్గానికి బలి కాకుండ, నీవు ప్రాణంతో తప్పించుకుంటావు అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యిర్మీయా 40:1సుమారు క్రీ.పూ. 588
రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను రామాలో విడిచిపెట్టిన తర్వాత యిర్మీయాకు యెహోవా నుండి వాక్కు వచ్చింది. నెబూజరదాను యెరూషలేము, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్తున్న వారిలో గొలుసులతో బంధించబడి ఉన్న యిర్మీయాను చూశాడు.
- యిర్మీయా 40:2సుమారు క్రీ.పూ. 588
రాజ రక్షక దళాధిపతి యిర్మీయాతో, “నీ దేవుడైన యెహోవా ఈ స్థలానికి విపత్తు రప్పిస్తానని ప్రకటించారు కదా.
- యిర్మీయా 40:3సుమారు క్రీ.పూ. 588
ఇప్పుడు యెహోవా దాన్ని రప్పించి తాను చెప్పినట్లే ఆయన చేశారు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయనకు లోబడలేదు కాబట్టి ఇదంతా జరిగింది.
- యిర్మీయా 40:4సుమారు క్రీ.పూ. 588
అయితే ఈ రోజు నేను నీ మణికట్టుకు ఉన్న సంకెళ్ళ నుండి నిన్ను విడిపిస్తున్నాను. నీకు ఇష్టమైతే నాతో పాటు బబులోనుకు రా, నేను నిన్ను చూసుకుంటాను; ఒకవేళ నాతో రావడం సరియైనది కాదని నీకు అనిపిస్తే రావద్దు. చూడు, దేశం మొత్తం నీ ముందు ఉంది; నీకిష్టమైన చోటికి వెళ్లు” అన్నాడు.
- యిర్మీయా 40:5సుమారు క్రీ.పూ. 588
అయితే, యిర్మీయా బయలుదేరక ముందు, నెబూజరదాను, “బబులోను రాజు యూదా పట్టణాలపై నియమించిన షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు తిరిగివెళ్లి, అతనితో పాటు ప్రజలమధ్య నివసించు, లేదా ఎక్కడికి వెళ్లడం సరియైనది అని నీకు అనిపిస్తే అక్కడికి వెళ్లు” అని చెప్పాడు. తర్వాత దళాధిపతి అతనికి ఆహారపదార్థాలు బహుమానం ఇచ్చి అతన్ని పంపించాడు.
- యిర్మీయా 40:6సుమారు క్రీ.పూ. 588
కాబట్టి యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వెళ్లి, దేశంలో మిగిలిపోయిన ప్రజలమధ్య నివసించాడు.
- యిర్మీయా 40:7సుమారు క్రీ.పూ. 588
బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడని, అలాగే బబులోనుకు బందీలుగా వెళ్లకుండా మిగిలిన నిరుపేదలైన పురుషులు, స్త్రీలు, పిల్లల మీద అధికారిగా నియమించాడని చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విన్నప్పుడు,
- యిర్మీయా 40:8సుమారు క్రీ.పూ. 588
నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహానాను యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏఫా కుమారులు, మయకాతీయుని కుమారుడైన యెజన్యా వారి మనుష్యులు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చారు.
- యిర్మీయా 40:9సుమారు క్రీ.పూ. 588
అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.
- యిర్మీయా 40:10సుమారు క్రీ.పూ. 588
మన దగ్గరకు వచ్చే బబులోనీయుల ముందు మీకు ప్రాతినిధ్యం వహించడానికి స్వయంగా నేనే మిస్పాలో ఉంటాను, అయితే మీరు ద్రాక్షరసాన్ని, వేసవికాలపు పండ్లను, ఒలీవ నూనెను సేకరించి, వాటిని మీ పాత్రల్లో నిల్వజేయండి, మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివసించండి” అని అన్నాడు.
- యిర్మీయా 40:11సుమారు క్రీ.పూ. 588
బబులోను రాజు యూదాలో కొందరిని విడిచిపెట్టి షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడునైన గెదల్యాను వారి మీద అధిపతిగా నియమించాడని మోయాబు, అమ్మోను, ఎదోము ఇతర దేశాల్లో ఉన్న యూదులందరు విన్నప్పుడు,
- యిర్మీయా 40:12సుమారు క్రీ.పూ. 588
వారందరూ వారు చెదరగొట్టబడిన అన్ని దేశాల నుండి యూదా దేశానికి, మిస్పాలోని గెదల్యా దగ్గరకు తిరిగి వచ్చారు. వారు సమృద్ధిగా ద్రాక్షరసాన్ని వేసవికాలపు పండ్లను సేకరించారు.
- యిర్మీయా 40:13సుమారు క్రీ.పూ. 588
కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చి,