కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 50:39సుమారు క్రీ.పూ. 595

    “కాబట్టి ఎడారి జీవులు, హైనాలు అక్కడ నివసిస్తాయి, గుడ్లగూబ అక్కడ నివసిస్తుంది. అది ఇంకెప్పుడు నివాసస్థలంగా ఉండదు తరతరాల వరకు దానిలో ఎవరూ నివసించరు.

  2. యిర్మీయా 50:40సుమారు క్రీ.పూ. 595

    సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా చేసిన తర్వాత, అక్కడ ఎవరూ నివసించనట్లే, ఇక్కడ కూడా ఎవరూ నివసించరు” అని యెహోవా అంటున్నారు.

  3. యిర్మీయా 50:41సుమారు క్రీ.పూ. 595

    “చూడండి! ఉత్తర దిక్కునుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం అనేకమంది రాజులు భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.

  4. యిర్మీయా 50:42సుమారు క్రీ.పూ. 595

    వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు క్రూరులు, కనికరం లేనివారు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు వారి స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది; బబులోను కుమార్తె, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వ్యూహంలోని సైనికుల్లాగా వస్తారు.

  5. యిర్మీయా 50:43సుమారు క్రీ.పూ. 595

    బబులోను రాజు వారి గురించిన వార్తలను విన్నాడు, అతని చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన అతన్ని పట్టుకుంది.

  6. యిర్మీయా 50:44సుమారు క్రీ.పూ. 595

    యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”

  7. యిర్మీయా 50:45సుమారు క్రీ.పూ. 595

    కాబట్టి, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో, బబులోనీయుల దేశానికి వ్యతిరేకంగా ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.

  8. యిర్మీయా 50:46సుమారు క్రీ.పూ. 595

    బబులోను పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; వారి మొర దేశాల్లో ప్రతిధ్వనిస్తుంది.

  9. యిర్మీయా 51:1సుమారు క్రీ.పూ. 595

    యెహోవా ఇలా చెప్తున్నారు: “చూడండి, నేను బబులోనుకు, లేబ్-కమాయి ప్రజలకు వ్యతిరేకంగా నాశనకరమైన ఆత్మను రేపుతాను.

  10. యిర్మీయా 51:2సుమారు క్రీ.పూ. 595

    బబులోనును చెదరగొట్టడానికి దాని దేశాన్ని నాశనం చేయడానికి విదేశీయులను పంపుతాను; దాని విపత్తు దినాన ప్రతి వైపున వారు దానిని వ్యతిరేకిస్తారు.

  11. యిర్మీయా 51:3సుమారు క్రీ.పూ. 595

    విలుకాండ్రు తమ విల్లును తీయకుందురు గాక, తమ కవచాలను ధరించకుందురు గాక. దాని యువకులను విడిచిపెట్టవద్దు; దాని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయాలి.

  12. యిర్మీయా 51:4సుమారు క్రీ.పూ. 595

    వారు బబులోనులో హతమవుతారు, దాని వీధుల్లో ఘోరంగా గాయపరచబడతారు.

  13. యిర్మీయా 51:5సుమారు క్రీ.పూ. 595

    ఎందుకంటే ఇశ్రాయేలు, యూదా దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకంగా చేసిన దోషాలతో నిండి ఉన్నప్పటికీ వారి దేవుడైన సైన్యాల యెహోవా వారిని విడిచిపెట్టలేదు.

  14. యిర్మీయా 51:6సుమారు క్రీ.పూ. 595

    “బబులోను నుండి పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! దాని పాపాలను బట్టి నాశనం కాకండి. ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు.

  15. యిర్మీయా 51:7సుమారు క్రీ.పూ. 595

    బబులోను యెహోవా చేతిలో బంగారు గిన్నె; అది భూమినంతటిని మత్తెక్కించింది. అన్ని దేశాలు దాని ద్రాక్షారసాన్ని త్రాగాయి; కాబట్టి వారు ఇప్పుడు పిచ్చివారైపోయారు.

  16. యిర్మీయా 51:8సుమారు క్రీ.పూ. 595

    బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.

  17. యిర్మీయా 51:9సుమారు క్రీ.పూ. 595

    “ ‘మనం బబులోనును స్వస్థపరచి ఉండేవారం, కానీ దానికి స్వస్థత కలగదు; మనం దాన్ని విడిచి మన సొంత దేశానికి వెళ్దాం, ఎందుకంటే దాని తీర్పు ఆకాశాన్ని తాకుతుంది, అది మేఘాలంత ఎత్తుగా లేస్తుంది.’

  18. యిర్మీయా 51:10సుమారు క్రీ.పూ. 595

    “ ‘యెహోవా మన నీతిని బయటపెట్టారు; రండి, మన దేవుడైన యెహోవా ఏమి చేశారో సీయోనులో చెప్పుదాము.’

  19. యిర్మీయా 51:11సుమారు క్రీ.పూ. 595

    “బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.

  20. యిర్మీయా 51:12సుమారు క్రీ.పూ. 595

    బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! రక్షకభటులను బలపరచండి, కావలివారిని నిలబెట్టండి, మాటుగాండ్రను సిద్ధం చేయండి! యెహోవా తన ఉద్దేశాన్ని, బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు.

  21. యిర్మీయా 51:13సుమారు క్రీ.పూ. 595

    అనేక జలాల ప్రక్కన నివసించేదానా, సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, నీ అంతం వచ్చింది, నీవు నాశనమయ్యే సమయం వచ్చింది.

  22. యిర్మీయా 51:14సుమారు క్రీ.పూ. 595

    సైన్యాల యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశారు: మిడతల దండులా నేను నిన్ను నిశ్చయంగా మనుష్యులతో నింపుతాను, వారు నీపై విజయ కేకలు వేస్తారు.

  23. యిర్మీయా 51:15సుమారు క్రీ.పూ. 595

    “ఆయన తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.

  24. యిర్మీయా 51:16సుమారు క్రీ.పూ. 595

    ఆయన ఉరిమినప్పుడు, ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.

  25. యిర్మీయా 51:17సుమారు క్రీ.పూ. 595

    “మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.