circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 51:18సుమారు క్రీ.పూ. 595
అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.
- యిర్మీయా 51:19సుమారు క్రీ.పూ. 595
యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
- యిర్మీయా 51:20సుమారు క్రీ.పూ. 595
“నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు, యుద్ధ ఆయుధంవంటివాడవు నీతో నేను దేశాలను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రాజ్యాలను నాశనం చేస్తాను,
- యిర్మీయా 51:21సుమారు క్రీ.పూ. 595
నీతో నేను గుర్రాన్ని రౌతును చిన్నాభిన్నం చేస్తాను, నీతో నేను రథాన్ని సారథిని చిన్నాభిన్నం చేస్తాను,
- యిర్మీయా 51:22సుమారు క్రీ.పూ. 595
నీతో పురుషున్ని స్త్రీని చిన్నాభిన్నం చేస్తాను, నీతో వృద్ధులను చిన్నవారిని చిన్నాభిన్నం చేస్తాను, నీతో యువకులను యువతులను చిన్నాభిన్నం చేస్తాను,
- యిర్మీయా 51:23సుమారు క్రీ.పూ. 595
నీతో గొర్రెల కాపరిని మందను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రైతును ఎద్దులను చిన్నాభిన్నం చేస్తాను, నీతో అధిపతులను అధికారులను చిన్నాభిన్నం చేస్తాను.
- యిర్మీయా 51:24సుమారు క్రీ.పూ. 595
“బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 51:25సుమారు క్రీ.పూ. 595
“నాశనం చేసే పర్వతమా, భూమి అంతటిని నాశనం చేసేదానా, నేను నీకు వ్యతిరేకిని,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి, నిన్ను కొండలమీద నుండి దొర్లించి, నిన్ను కాలిపోయిన పర్వతంలా చేస్తాను.
- యిర్మీయా 51:26సుమారు క్రీ.పూ. 595
ప్రజలు నీ నుండి మూలరాయిని గాని, పునాది రాయిని గాని తీసుకోరు, ఎందుకంటే నీవు శాశ్వతంగా నిర్జనమై ఉంటావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 51:27సుమారు క్రీ.పూ. 595
“దేశంలో ఒక జెండా ఎత్తండి! దేశాల మధ్య బాకా ఊదండి! దానితో యుద్ధానికి జనాలను సిద్ధపరచండి; దాని మీద దాడి చేయడానికి: అరారతు, మిన్ని అష్కెనజు. దానికి వ్యతిరేకంగా సేనాధిపతిని నియమించండి; మిడతల దండులా గుర్రాలను పంపండి.
- యిర్మీయా 51:28సుమారు క్రీ.పూ. 595
మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి అధికారులందరిని, వారు పాలించే అన్ని దేశాలను దాని మీదికి యుద్ధానికి సిద్ధపరచండి.
- యిర్మీయా 51:29సుమారు క్రీ.పూ. 595
భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, బబులోను దేశాన్ని పాడు చేయాలని అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు.
- యిర్మీయా 51:30సుమారు క్రీ.పూ. 595
బబులోను యోధులు యుద్ధం ఆపివేశారు; వారు తమ కోటల్లోనే ఉంటారు. వారి బలం సమసిపోయింది; వారు బలహీనులయ్యారు. దాని నివాసాలకు నిప్పు పెట్టారు; దాని ద్వారబంధాలు విరిగిపోయాయి.
- యిర్మీయా 51:31సుమారు క్రీ.పూ. 595
అతని పట్టణమంతా స్వాధీనం చేసుకోబడిందని బబులోను రాజుకు తెలియజేయడానికి, ఒక వార్తాహరుని వెంట మరో వార్తాహరుడు, ఒక దూత వెంట మరో దూత పరుగు పెడుతున్నారు.
- యిర్మీయా 51:32సుమారు క్రీ.పూ. 595
నదుల రేవులను ఆక్రమించబడ్డాయి. చిత్తడి నేలలకు నిప్పంటించబడింది, సైనికులు భయభ్రాంతులకు గురయ్యారు.”
- యిర్మీయా 51:33సుమారు క్రీ.పూ. 595
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది దాన్ని నూర్పిడి సమయం ఇదే; త్వరలో దాని కోతకాలం వస్తుంది.”
- యిర్మీయా 51:34సుమారు క్రీ.పూ. 595
“బబులోను రాజైన నెబుకద్నెజరు మనల్ని మ్రింగివేశాడు, మనల్ని గందరగోళంలో పడేశాడు, మనల్ని ఖాళీ కుండలా చేశాడు. ఘటసర్పంలా మనల్ని మ్రింగివేసి మన రుచికరమైన పదార్ధాలతో తన కడుపు నింపుకొని తర్వాత మనల్ని ఉమ్మివేశాడు.
- యిర్మీయా 51:35సుమారు క్రీ.పూ. 595
మన శరీరానికి చేసిన హింస బబులోనుకు జరుగును గాక,” అని సీయోను నివాసులు అంటున్నారు. “మా రక్తదోషం బబులోనులో నివసించేవారి మీద ఉండును గాక,” అని యెరూషలేము అంటుంది.
- యిర్మీయా 51:36సుమారు క్రీ.పూ. 595
కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను మీ పక్షంగా వాదిస్తాను, మీ కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. నేను దాని సముద్రం ఆరిపోయేలా చేస్తాను, దాని నీటి ఊటలు ఎండిపోయేలా చేస్తాను.
- యిర్మీయా 51:37సుమారు క్రీ.పూ. 595
బబులోను శిథిలాల కుప్పగా, నక్కల నివాసంగా, భయానకంగా, హేళనగా, ఎవరూ నివసించని స్థలంగా అవుతుంది.
- యిర్మీయా 51:38సుమారు క్రీ.పూ. 595
దాని ప్రజలంతా కొదమ సింహాల్లా గర్జిస్తారు, సింహం పిల్లల్లా కేకలు వేస్తారు.
- యిర్మీయా 51:39సుమారు క్రీ.పూ. 595
అయితే వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు, నేను వారికి విందు ఏర్పాటుచేసి, వారు సంతోషించేలా, మద్యంతో వారికి మత్తు ఎక్కేలా చేస్తాను అప్పుడు వారు శాశ్వతంగా నిద్రపోతారు, తిరిగి మేలుకోరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 51:40సుమారు క్రీ.పూ. 595
“వధకు గొర్రెపిల్లలను పొట్టేళ్లను, మేకలను తెచ్చినట్టు, నేను వారిని తీసుకువస్తాను.
- యిర్మీయా 51:41సుమారు క్రీ.పూ. 595
“భూమి అంతా మెచ్చుకునే, షేషకు ఎలా పట్టబడింది! దేశాల మధ్యలో బబులోను ఎంత నిర్జనంగా మారిందో!
- యిర్మీయా 51:42సుమారు క్రీ.పూ. 595
సముద్రం బబులోను మీదికి పొంగి వచ్చింది; ఎగసిపడే అలలు దాన్ని కప్పివేస్తాయి.