కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 51:43సుమారు క్రీ.పూ. 595

    దాని పట్టణాలు నిర్జనమై, ఎండిపోయి ఎడారిగా, ఎవరూ నివసించని దేశంగా ఉంది, ఎవరూ ప్రయాణించని దేశంగా ఉంటుంది.

  2. యిర్మీయా 51:44సుమారు క్రీ.పూ. 595

    నేను బబులోనులో బేలును శిక్షిస్తాను అతడు మ్రింగివేసిన దాన్ని బయటకు కక్కేలా చేస్తాను. దేశాలు అతని దగ్గరకు ఇక గుంపులుగా రావు. బబులోను గోడ కూలిపోతుంది.

  3. యిర్మీయా 51:45సుమారు క్రీ.పూ. 595

    “నా ప్రజలారా, దాని నుండి బయటకు రండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! యెహోవా కోపాగ్ని నుండి పారిపోండి.

  4. యిర్మీయా 51:46సుమారు క్రీ.పూ. 595

    దేశంలో పుకార్లు వినబడినప్పుడు, ధైర్యం కోల్పోవద్దు, భయపడవద్దు; ప్రతి సంవత్సరం ఒకదాని తర్వాత ఇంకొక పుకారు వస్తూనే ఉంటుంది, దేశంలో హింస జరుగుతుందని, పాలకునికి వ్యతిరేకంగా మరో పాలకుడు ఉన్నాడని పుకార్లు వినబడతాయి.

  5. యిర్మీయా 51:47సుమారు క్రీ.పూ. 595

    ఎందుకంటే నేను బబులోను విగ్రహాలను శిక్షించే సమయం తప్పకుండా వస్తుంది; దాని దేశమంతా అవమానించబడుతుంది చనిపోయిన దాని ప్రజలు దానిలోనే పడిపోయి ఉంటారు.

  6. యిర్మీయా 51:48సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, ఎందుకంటే ఉత్తర దిక్కునుండి నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  7. యిర్మీయా 51:49సుమారు క్రీ.పూ. 595

    “బబులోను ఇశ్రాయేలు వారిని చంపినట్లే, బబులోను పతనం కావాలి బబులోనువారు భూమి అంతటా చంపబడతారు.

  8. యిర్మీయా 51:50సుమారు క్రీ.పూ. 595

    ఖడ్గం నుండి తప్పించుకున్న వారలారా, వెళ్లిపొండి, ఆలస్యం చేయకండి! సుదూరదేశంలో ఉన్నాసరే, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి.”

  9. యిర్మీయా 51:51సుమారు క్రీ.పూ. 595

    “మేము అపకీర్తి పాలయ్యాము, ఎందుకంటే మేము అవమానించబడ్డాము సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.”

  10. యిర్మీయా 51:52సుమారు క్రీ.పూ. 595

    యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “రాబోయే రోజుల్లో, నేను దాని విగ్రహాలను శిక్షిస్తాను, దాని దేశమంతటా గాయపడినవారు మూల్గుతారు.

  11. యిర్మీయా 51:53సుమారు క్రీ.పూ. 595

    బబులోను ఆకాశానికి ఎక్కి తన ఎత్తైన కోటను పటిష్టం చేసుకున్నా, నేను దాని మీదికి నాశనం చేసేవారిని పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. యిర్మీయా 51:54సుమారు క్రీ.పూ. 595

    “బబులోను నుండి ఏడ్పు వస్తుంది, బబులోనీయుల దేశం నుండి మహా విధ్వంస శబ్దం వస్తుంది.

  13. యిర్మీయా 51:55సుమారు క్రీ.పూ. 595

    యెహోవా బబులోనును నాశనం చేస్తారు; ఆయన దాని సందడిని అణచివేస్తారు. శత్రువుల కెరటాలు మహా జలాల్లా ఎగసిపడతాయి; వారి స్వరాల గర్జన ప్రతిధ్వనిస్తుంది.

  14. యిర్మీయా 51:56సుమారు క్రీ.పూ. 595

    బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; దాని యోధులు బందీలవుతారు, ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.

  15. యిర్మీయా 51:57సుమారు క్రీ.పూ. 595

    నేను దాని ఉన్నతాధికారులు, జ్ఞానులు, దాని అధిపతులు, అధికారులు, యోధులు కూడా మద్యం త్రాగి మత్తెక్కేలా చేస్తాను. వారు శాశ్వతంగా నిద్రపోతారు ఇక మేలుకోరు,” అని సైన్యాల యెహోవా అనే పేరుగల రాజు ప్రకటిస్తున్నారు.

  16. యిర్మీయా 51:58సుమారు క్రీ.పూ. 595

    సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను దృఢమైన గోడ నేలమట్టం అవుతుంది, దాని ఎత్తైన ద్వారాలకు నిప్పు పెట్టబడుతుంది. ప్రజలు వృధాగా కష్టపడుతున్నారు, దేశాల శ్రమ అగ్ని పాలవుతుంది.”

  17. యిర్మీయా 51:59సుమారు క్రీ.పూ. 595

    యూదా రాజైన సిద్కియా పాలనలోని నాల్గవ సంవత్సరంలో మహశేయా మనుమడును నేరియా కుమారుడును రాజు వసతిగృహ అధికారియునైన శెరాయా, రాజైన సిద్కియాతో కలిసి బబులోనుకు వెళ్లినప్పుడు, ప్రవక్తయైన యిర్మీయా ఈ సందేశాన్ని అతనికి ఇచ్చాడు.

  18. యిర్మీయా 51:60సుమారు క్రీ.పూ. 595

    యిర్మీయా ఒక గ్రంథపుచుట్టలో బబులోను మీదికి రాబోతున్న విపత్తులన్నిటిని గురించి వ్రాశాడు. బబులోను గురించి వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాశాడు.

  19. యిర్మీయా 51:61సుమారు క్రీ.పూ. 595

    అప్పుడు యిర్మీయా శెరాయాతో, “మీరు బబులోనుకు చేరుకున్నప్పుడు, ఈ మాటలన్నీ బిగ్గరగా చదివి వినిపించు.

  20. యిర్మీయా 51:62సుమారు క్రీ.పూ. 595

    తర్వాత ఇలా చెప్పండి, ‘యెహోవా, ఈ స్థలంలో మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండ దాన్ని నాశనం చేస్తాను; అది శాశ్వతంగా పాడైపోయి ఉంటుందని యెహోవా చెప్పారు’ అని నీవు చెప్పాలి.

  21. యిర్మీయా 51:63సుమారు క్రీ.పూ. 595

    నీవు ఈ గ్రంథపుచుట్ట చదవడం ముగించాక, దానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నదిలో పడేయండి.

  22. యిర్మీయా 51:64సుమారు క్రీ.పూ. 595

    తర్వాత, ‘నేను దాని మీదికి తెచ్చే విపత్తు వల్ల బబులోను ఇక లేవకుండ అలాగే మునిగిపోతుంది. దాని ప్రజలు పతనమవుతారు.’ అని నీవు చెప్పాలి.” యిర్మీయా మాటలు ఇంతటితో ముగిశాయి.

  23. యిర్మీయా 52:1సుమారు క్రీ.పూ. 598

    సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు.

  24. యిర్మీయా 52:2సుమారు క్రీ.పూ. 598

    యెహోయాకీము చేసినట్టే అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

  25. యిర్మీయా 52:3సుమారు క్రీ.పూ. 598

    యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు.