కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 50:14సుమారు క్రీ.పూ. 595

    “బబులోను చుట్టూ యుద్ధపంక్తులు తీరండి, విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కరు విల్లు లాగండి. అది యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది, దానిపై బాణాలు వేయండి! మీ బాణాలు దాచుకోవద్దు.

  2. యిర్మీయా 50:15సుమారు క్రీ.పూ. 595

    అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, దాని గోడలు కూలిపోయాయి. ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి.

  3. యిర్మీయా 50:16సుమారు క్రీ.పూ. 595

    బబులోను నుండి విత్తేవారిని, కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి. అణచివేసే వారి ఖడ్గం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు.

  4. యిర్మీయా 50:17సుమారు క్రీ.పూ. 595

    “ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు సింహాలు వాటిని తరిమికొట్టాయి. మొదట అష్షూరు రాజు వాటిని మ్రింగివేశాడు; చివరిగా బబులోను రాజైన నెబుకద్నెజరు వాటి ఎముకలను విరగ్గొట్టాడు.”

  5. యిర్మీయా 50:18సుమారు క్రీ.పూ. 595

    కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను అష్షూరు రాజును శిక్షించినట్లే బబులోను రాజును అతని దేశాన్ని శిక్షిస్తాను.

  6. యిర్మీయా 50:19సుమారు క్రీ.పూ. 595

    అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను, వారు కర్మెలు బాషాను మీద మేస్తారు. ఎఫ్రాయిం గిలాదు కొండలమీద వారు తృప్తి చెందుతారు.”

  7. యిర్మీయా 50:20సుమారు క్రీ.పూ. 595

    యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “ఆ రోజుల్లో, ఆ సమయంలో, ఇశ్రాయేలీయుల అపరాధాల కోసం వెదకుతారు, కానీ అవి కనబడవు, అలాగే యూదా కోసం వెదకుతారు, కానీ అవి దొరకవు, మిగిలి ఉన్నవారిని నేను క్షమిస్తాను.

  8. యిర్మీయా 50:21సుమారు క్రీ.పూ. 595

    “మెరతాయీము మీద దాడి చేయండి. పేకోదులో నివసించేవారి మీద దాడి చేయండి,” వెంటాడి, వారిని చంపి పూర్తిగా నాశనం చేయండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేయండి.

  9. యిర్మీయా 50:22సుమారు క్రీ.పూ. 595

    దేశంలో యుద్ధధ్వని, మహా విధ్వంసపు ధ్వని వినబడుతుంది!

  10. యిర్మీయా 50:23సుమారు క్రీ.పూ. 595

    మొత్తం భూమిని కొడుతున్న సుత్తి ఎలా విరిగి పగిలిపోయిందో! దేశాల మధ్య బబులోను ఎలా నిర్జనమైపోయిందో చూడండి!

  11. యిర్మీయా 50:24సుమారు క్రీ.పూ. 595

    బబులోనూ, నీ కోసం ఉచ్చు బిగించాను అది నీకు తెలియకముందే దానిలో చిక్కుకున్నావు. నీవు యెహోవాను వ్యతిరేకించావు కాబట్టి నిన్ను కనుగొని బంధించాను.

  12. యిర్మీయా 50:25సుమారు క్రీ.పూ. 595

    బబులోనీయుల దేశంలో ప్రభువైన సైన్యాల యెహోవా చేయవలసిన పని ఉంది. కాబట్టి యెహోవా తన ఆయుధశాలను తెరిచి తన ఉగ్రతను తీర్చే ఆయుధాలను బయటకు తెచ్చారు.

  13. యిర్మీయా 50:26సుమారు క్రీ.పూ. 595

    దూరం నుండి ఆమెపై దాడి చేయడానికి రండి. ఆమె ధాన్యాగారాలు తెరవండి; ధాన్యం కుప్పలా ఆమెను పోగు చేయండి. దాన్ని పూర్తిగా నాశనం చేయండి ఆమెలో దేన్ని వదలవద్దు.

  14. యిర్మీయా 50:27సుమారు క్రీ.పూ. 595

    దాని కోడెలన్నిటినీ చంపండి; వాటిని వధకు పంపండి! వారికి శ్రమ దినం వచ్చింది, వారు శిక్షించబడే సమయం వచ్చింది.

  15. యిర్మీయా 50:28సుమారు క్రీ.పూ. 595

    బబులోను నుండి తప్పించుకొని పారిపోయినవారి శబ్దం వినిపిస్తుంది మన దేవుడైన యెహోవా తన మందిరం కోసం ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో, సీయోనులో ప్రకటించండి.

  16. యిర్మీయా 50:29సుమారు క్రీ.పూ. 595

    “బబులోను మీదికి రమ్మని, విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి. ఆమె చుట్టూ చేరండి; ఎవరూ తప్పించుకోకూడదు. ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి; ఆమె చేసినట్లే ఆమెకు చేయండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను ఆమె ధిక్కరించింది.

  17. యిర్మీయా 50:30సుమారు క్రీ.పూ. 595

    కాబట్టి, ఆమె యువకులు వీధుల్లో కూలిపోతారు; ఆ రోజున ఆమె సైనికులందరూ మూగబోతారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. యిర్మీయా 50:31సుమారు క్రీ.పూ. 595

    సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అహంకారి, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నీ శ్రమ దినం వచ్చింది, నీవు శిక్షించబడే సమయం వచ్చింది.

  19. యిర్మీయా 50:32సుమారు క్రీ.పూ. 595

    గర్విష్ఠులు తడబడి పడిపోతారు ఆమెను లేపడానికి ఎవరూ సహాయం చేయరు. నేను ఆమె పట్టణాల్లో అగ్ని రాజేస్తాను అది ఆమె చుట్టూ ఉన్నవారందరిని కాల్చివేస్తుంది.”

  20. యిర్మీయా 50:33సుమారు క్రీ.పూ. 595

    సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కూడా అణచివేయబడ్డారు. వారిని బంధించినవారు వారిని పట్టుకొని ఉన్నారు వారిని విడిచిపెట్టడానికి నిరాకరించారు.

  21. యిర్మీయా 50:34సుమారు క్రీ.పూ. 595

    అయినా వారి విమోచకుడు బలవంతుడు; ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా వారి పక్షాన వాదిస్తారు, బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.”

  22. యిర్మీయా 50:35సుమారు క్రీ.పూ. 595

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “బబులోనీయుల మీదికి బబులోనులో నివసించేవారి మీదికి దాని అధికారులు జ్ఞానుల మీదికి ఖడ్గం వస్తుంది.

  23. యిర్మీయా 50:36సుమారు క్రీ.పూ. 595

    దాని అబద్ధ ప్రవక్తల మీదికి ఖడ్గం వస్తుంది! వారు మూర్ఖులు అవుతారు. దాని యోధుల మీదికి ఖడ్గం వస్తుంది! వారు భయంతో నిండిపోతారు.

  24. యిర్మీయా 50:37సుమారు క్రీ.పూ. 595

    దాని గుర్రాలు రథాల మీదికి దానిలో ఉన్న విదేశీయులందరి మీదికి ఖడ్గం వస్తుంది! వారు స్త్రీలలా బలహీనులవుతారు. ఆమె సంపద మీదికి ఖడ్గం వస్తుంది! దాన్ని దోచుకుంటారు.

  25. యిర్మీయా 50:38సుమారు క్రీ.పూ. 595

    దానికి నీళ్ల కరువు వస్తుంది! నీళ్లు ఎండిపోతాయి. అది విగ్రహాల దేశం, భయంకరమైన విగ్రహాల వల్ల ప్రజలు పిచ్చివారవుతారు.