కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 15:27సుమారు క్రీ.పూ. 759

    యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభై రెండవ సంవత్సరంలో, రెమల్యా కుమారుడైన పెకహు సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు.

  2. 2 రాజులు 15:28సుమారు క్రీ.పూ. 759

    అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.

  3. 2 రాజులు 15:29సుమారు క్రీ.పూ. 759

    ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.

  4. 2 రాజులు 15:30సుమారు క్రీ.పూ. 739

    తర్వాత ఏలా కుమారుడైన హోషేయ రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేశాడు. ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలన యొక్క ఇరవయ్యవ సంవత్సరంలో అతడు పెకహు మీద దాడి చేసి, అతన్ని చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.

  5. 2 రాజులు 15:31సుమారు క్రీ.పూ. 739

    పెకహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  6. 2 రాజులు 15:32సుమారు క్రీ.పూ. 758

    ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో, యూదారాజు, ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలించడం ఆరంభించాడు.

  7. 2 రాజులు 15:33సుమారు క్రీ.పూ. 758

    అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష, ఆమె సాదోకు కుమార్తె.

  8. 2 రాజులు 15:34సుమారు క్రీ.పూ. 758

    అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.

  9. 2 రాజులు 15:35సుమారు క్రీ.పూ. 758

    అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు.

  10. 2 రాజులు 15:36సుమారు క్రీ.పూ. 758

    యోతాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  11. 2 రాజులు 15:37సుమారు క్రీ.పూ. 742

    (ఆ రోజుల్లో యెహోవా యూదా మీదికి అరాము రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును పంపించడం మొదలుపెట్టారు.)

  12. 2 రాజులు 15:38సుమారు క్రీ.పూ. 742

    యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని దావీదు పట్టణంలో, తన తండ్రి పట్టణంలో, వారితో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.

  13. రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో యూదారాజు, యోతాము కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.

  14. ఆహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తన పితరుడైన దావీదులా కాకుండా, అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో సరియైనది చేయలేదు.

  15. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాల హేయక్రియలు చేసి, తన కుమారున్ని అగ్నిలో బలి ఇచ్చాడు.

  16. అతడు క్షేత్రాల్లో, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ ధూపం వేసేవాడు.

  17. 2 రాజులు 16:5సుమారు క్రీ.పూ. 742

    అప్పుడు అరాము రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి ఆహాజును ముట్టడించారు కాని, అతన్ని జయించలేకపోయారు.

  18. 2 రాజులు 16:6సుమారు క్రీ.పూ. 742

    ఆ సమయంలో అరాము రాజైన రెజీను, అరాము కోసం ఏలతును తిరిగి పట్టుకుని, దానిలో నుండి యూదా వారిని వెళ్లగొట్టాడు. అప్పుడు ఎదోమీయులు ఏలతుకు వెళ్లి నేటి వరకు అక్కడే నివసిస్తున్నారు.

  19. 2 రాజులు 16:7సుమారు క్రీ.పూ. 742

    ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరుకు దూతలను పంపి, “నేను మీ దాసున్ని మీ బానిసను. మీరు వచ్చి, నాపై దాడి చేస్తున్న అరాము ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను రక్షించండి” అని చెప్పాడు.

  20. 2 రాజులు 16:8సుమారు క్రీ.పూ. 742

    ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనం ఖజానాలో నుండి వెండి బంగారాలు అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.

  21. 2 రాజులు 16:9సుమారు క్రీ.పూ. 740

    అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు మీద దండెత్తి, దానిని స్వాధీనపరచుకున్నాడు. దాని ప్రజలను కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు, రెజీనును చంపాడు.

  22. 2 రాజులు 16:10సుమారు క్రీ.పూ. 740

    రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వెళ్లాడు. దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని నిర్మాణ విధానం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.

  23. 2 రాజులు 16:11సుమారు క్రీ.పూ. 740

    కాబట్టి యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు నుండి పంపిన నమూనా ప్రకారం బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు.

  24. 2 రాజులు 16:12సుమారు క్రీ.పూ. 740

    రాజు దమస్కు నుండి తిరిగివచ్చి ఆ బలిపీఠాన్ని చూసి, దానిని సమీపించి, దాని మీద బలి అర్పించాడు.

  25. 2 రాజులు 16:13సుమారు క్రీ.పూ. 740

    దాని మీద దహనబలిని, భోజనార్పణను అర్పించాడు, పానార్పణాన్ని పోశాడు, సమాధానబలి రక్తాన్ని బలిపీఠం మీద చల్లాడు.