కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 16:14సుమారు క్రీ.పూ. 740

    యెహోవా సముఖంలో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని మందిరం ఎదుట నుండి అనగా తాను కట్టించిన నూతన బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య నుండి తీసి, నూతన బలిపీఠానికి ఉత్తర దిక్కున దానిని ఉంచాడు.

  2. 2 రాజులు 16:15సుమారు క్రీ.పూ. 740

    ఆహాజు రాజ యాజకుడైన ఊరియాకు ఇలా ఆదేశాలిచ్చాడు: “నూతన పెద్ద బలిపీఠం మీద ఉదయకాలపు దహనబలి, సాయంకాలపు భోజనార్పణ, రాజు దహనబలి, దేశ ప్రజల దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. ఈ బలిపీఠం మీద దహనబలులు ఇతర బలులన్నిటి రక్తాన్ని చల్లాలి. అయితే నేను ఇత్తడి బలిపీఠాన్ని విచారణ కోసం వాడుకుంటాను.”

  3. 2 రాజులు 16:16సుమారు క్రీ.పూ. 740

    రాజైన ఆహాజు ఆదేశించినట్లే యాజకుడైన ఊరియా చేశాడు.

  4. 2 రాజులు 16:17సుమారు క్రీ.పూ. 739

    రాజైన ఆహాజు పీఠాలకున్న ప్రక్క పలకలను, పీఠాల నుండి గంగాళాన్ని తీయించాడు. ఇత్తడి ఎడ్ల మీద పెద్ద నీళ్ల తొట్టిని తీసేసి పరచిన రాళ్లమీద దానిని ఉంచాడు.

  5. 2 రాజులు 16:18సుమారు క్రీ.పూ. 739

    మందిరం దగ్గర కట్టబడిన సబ్బాతు మంటపాలను, యెహోవా మందిరం బయట రాజు ద్వారాన్ని తీయించాడు. ఇది అష్షూరు రాజుకు భయపడి ఇదంతా చేశాడు.

  6. 2 రాజులు 16:19సుమారు క్రీ.పూ. 742

    ఆహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసింది, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  7. 2 రాజులు 16:20సుమారు క్రీ.పూ. 726

    ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని దావీదు పట్టణంలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు.

  8. 2 రాజులు 17:1సుమారు క్రీ.పూ. 730

    యూదా రాజైన ఆహాజు పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు.

  9. 2 రాజులు 17:2సుమారు క్రీ.పూ. 730

    అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అయితే తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల మాదిరిగా కాదు.

  10. 2 రాజులు 17:3సుమారు క్రీ.పూ. 730

    అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేయడానికి రాగా హోషేయ అతనికి లొంగిపోయి అతనికి పన్ను చెల్లించాడు.

  11. 2 రాజులు 17:4సుమారు క్రీ.పూ. 725

    అయితే హోషేయ కుట్ర చేస్తున్నట్టు అష్షూరు రాజు పసిగట్టాడు, ఎందుకంటే హోషేయ, ఈజిప్టు రాజైన సో దగ్గరకు దూతలను పంపి ప్రతి సంవత్సరం అష్షూరు రాజుకు చెల్లించే పన్ను చెల్లించడం మానేశాడు; కాబట్టి షల్మనేసెరు అతన్ని పట్టుకుని చెరసాలలో వేశాడు.

  12. 2 రాజులు 17:5సుమారు క్రీ.పూ. 723

    అప్పుడు అష్షూరు రాజు దేశానంతా ఆక్రమించి, సమరయ మీదికి దండెత్తి దాన్ని మూడేళ్ళ వరకు ముట్టడించాడు.

  13. 2 రాజులు 17:6సుమారు క్రీ.పూ. 721

    హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.

  14. 2 రాజులు 17:7సుమారు క్రీ.పూ. 721

    ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి రాజైన ఫరో బలం నుండి విడిపించి, వారిని బయటకు తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. వారు ఇతర దేవుళ్ళను పూజిస్తూ,

  15. 2 రాజులు 17:8సుమారు క్రీ.పూ. 721

    తమ ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాల ఆచారాలను, ఇశ్రాయేలు రాజులు ప్రవేశపెట్టిన ఆచారాలను పాటించారు.

  16. 2 రాజులు 17:9సుమారు క్రీ.పూ. 721

    ఇశ్రాయేలీయులు తమ దేవుడు యెహోవాకు వ్యతిరేకంగా, రహస్యంగా చెడు కార్యాలు చేశారు. కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, తమ పట్టణాల్లో క్షేత్రాలను కట్టుకున్నారు.

  17. 2 రాజులు 17:10సుమారు క్రీ.పూ. 721

    వారు ప్రతీ ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను నిలబెట్టారు.

  18. 2 రాజులు 17:11సుమారు క్రీ.పూ. 721

    తమ ఎదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం క్షేత్రాల్లో ధూపం వేశారు. చెడుపనులు చేస్తూ యెహోవాకు కోపం రేపారు.

  19. 2 రాజులు 17:12సుమారు క్రీ.పూ. 721

    యెహోవా వారికి, “మీరు ఇలా చేయకూడదు” అని చెప్పినప్పటికి వారు విగ్రహాలను సేవించారు.

  20. 2 రాజులు 17:13సుమారు క్రీ.పూ. 721

    యెహోవా ఇశ్రాయేలును, యూదాను తన ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శులందరి ద్వారా, “మీ చెడు మార్గాలను విడిచిపెట్టండి. మీ పూర్వికులకు ఆజ్ఞాపించిన, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నా ఆజ్ఞలను, శాసనాలను పాటించండి” అని హెచ్చరించారు.

  21. 2 రాజులు 17:14సుమారు క్రీ.పూ. 721

    అయితే వారు వినలేదు, తమ దేవుడైన యెహోవాపై నమ్మకముంచని తమ పూర్వికుల్లా మొండిగా ఉన్నారు.

  22. 2 రాజులు 17:15సుమారు క్రీ.పూ. 721

    ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు.

  23. 2 రాజులు 17:16సుమారు క్రీ.పూ. 721

    తమ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టి, తమ కోసం పోతపోసిన రెండు దూడలను, అషేరా స్తంభాన్ని చేసుకున్నారు. వారు నక్షత్రాలకు నమస్కరించి బయలును సేవించారు.

  24. 2 రాజులు 17:17సుమారు క్రీ.పూ. 721

    తమ కుమారులను, కుమార్తెలను అగ్నిలో బలి ఇచ్చారు. భవిష్యవాణి, సోదె చెప్పించడం చేసి, యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తమను తాము అమ్ముకుని ఆయనకు కోపం రేపారు.

  25. 2 రాజులు 17:18సుమారు క్రీ.పూ. 721

    కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీద చాలా కోప్పడి, తన సముఖం నుండి వారిని తొలగించారు. యూదా గోత్రం మాత్రమే మిగిలింది.