- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 రాజులు 15:2సుమారు క్రీ.పూ. 810
అతడు రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా; ఆమె యెరూషలేముకు చెందినది.
- 2 రాజులు 15:3సుమారు క్రీ.పూ. 810
అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
- 2 రాజులు 15:4సుమారు క్రీ.పూ. 810
అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
- 2 రాజులు 15:5సుమారు క్రీ.పూ. 765
యెహోవా రాజును కుష్ఠరోగంతో బాధించారు, అది అతడు చనిపోయే దినం వరకు ఉంది. అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. రాజకుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.
- 2 రాజులు 15:6సుమారు క్రీ.పూ. 765
అజర్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
- 2 రాజులు 15:7సుమారు క్రీ.పూ. 758
అజర్యా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.
- 2 రాజులు 15:8సుమారు క్రీ.పూ. 773
యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో, యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలుకు సమరయలో రాజయ్యాడు, అతడు ఆరు నెలలు పరిపాలించాడు.
- 2 రాజులు 15:9సుమారు క్రీ.పూ. 773
అతడు తన పూర్వికులు చేసినట్లు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
- 2 రాజులు 15:10సుమారు క్రీ.పూ. 772
యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యా మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని తర్వాత రాజయ్యాడు.
- 2 రాజులు 15:11సుమారు క్రీ.పూ. 772
జెకర్యా గురించిన ఇతర విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
- 2 రాజులు 15:12సుమారు క్రీ.పూ. 884
కాబట్టి యెహోవా యెహుతో చెప్పిన ఈ మాట నెరవేర్చబడింది: “నీ సంతానం నాలుగు తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు.”
- 2 రాజులు 15:13సుమారు క్రీ.పూ. 772
యూదా రాజైన ఉజ్జియా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, యాబేషు కుమారుడైన షల్లూము రాజయ్యాడు, అతడు సమరయలో నెలరోజులు పరిపాలించాడు.
- 2 రాజులు 15:14సుమారు క్రీ.పూ. 772
అప్పుడు గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి సమరయకు వచ్చాడు. అతడు సమరయలో యాబేషు కుమారుడైన షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
- 2 రాజులు 15:15సుమారు క్రీ.పూ. 772
షల్లూము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
- 2 రాజులు 15:16సుమారు క్రీ.పూ. 772
ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.
- 2 రాజులు 15:17సుమారు క్రీ.పూ. 772
యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో పది సంవత్సరాలు పరిపాలించాడు.
- 2 రాజులు 15:18సుమారు క్రీ.పూ. 772
అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన ఏలుబడి అంతటిలో, ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
- 2 రాజులు 15:19సుమారు క్రీ.పూ. 771
తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.
- 2 రాజులు 15:20సుమారు క్రీ.పూ. 771
ఈ మొత్తం అష్షూరు రాజుకు ఇవ్వడానికి మెనహేము ఇశ్రాయేలులో ఉన్న ధనవంతులందరి దగ్గరా, యాభై షెకెళ్ళ వెండి చొప్పున వసూలు చేశాడు. కాబట్టి అష్షూరు రాజు విడిచి, ఇశ్రాయేలు దేశంలో ఇక ఉండలేదు.
- 2 రాజులు 15:21సుమారు క్రీ.పూ. 772
మెనహేము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
- 2 రాజులు 15:22సుమారు క్రీ.పూ. 772
మెనహేము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతని తర్వాత అతని కుమారుడైన పెకహ్యా రాజయ్యాడు.
- 2 రాజులు 15:23సుమారు క్రీ.పూ. 761
యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభైయవ సంవత్సరంలో, మెనహేము కుమారుడైన పెకహ్యా సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
- 2 రాజులు 15:24సుమారు క్రీ.పూ. 761
పెకహ్యా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
- 2 రాజులు 15:25సుమారు క్రీ.పూ. 759
అతని ప్రముఖ అధిపతులలో ఒకడు, రెమల్యా కుమారుడైన పెకహు అతని మీద కుట్ర చేశాడు, అతడు తనతో యాభైమంది గిలాదు వారిని వెంటబెట్టుకొని అర్గోబు, అరీహే అనేవారితో పాటు, పెకహ్యాను సమరయ రాజభవనంలో ఉన్న కోటలో చంపేశాడు. కాబట్టి పెకహు పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
- 2 రాజులు 15:26సుమారు క్రీ.పూ. 759
పెకహ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.