కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 13:6సుమారు క్రీ.పూ. 856

    అయితే వారు ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన యరొబాము కుటుంబీకులు చేసిన పాపాలను చేస్తూనే ఉన్నారు. అంతేకాక, అషేరా స్తంభం అలాగే సమరయలో నిలిచి ఉంది.

  2. 2 రాజులు 13:7సుమారు క్రీ.పూ. 856

    యెహోయాహాజు సైన్యంలో మిగిలింది యాభై రౌతులు, పది రథాలు, పదివేలమంది కాల్బలం మాత్రమే. ఎందుకంటే అరాము రాజు మిగతా వారిని కళ్ళం దగ్గర దుళ్ళగొట్టిన దుమ్ములా చేశాడు.

  3. 2 రాజులు 13:8సుమారు క్రీ.పూ. 856

    యెహోయాహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  4. 2 రాజులు 13:9సుమారు క్రీ.పూ. 839

    యెహోయాహాజు చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాషు రాజయ్యాడు.

  5. 2 రాజులు 13:10సుమారు క్రీ.పూ. 839

    యూదా రాజైన యోవాషు పరిపాలనలోని ముప్పై ఏడవ సంవత్సరంలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.

  6. 2 రాజులు 13:11సుమారు క్రీ.పూ. 839

    అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను చేస్తూనే ఉన్నాడు.

  7. 2 రాజులు 13:12సుమారు క్రీ.పూ. 841

    యెహోయాషును పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, యూదా రాజైన అమజ్యాతో చేసిన యుద్ధం, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  8. 2 రాజులు 13:13సుమారు క్రీ.పూ. 841

    యెహోయాషు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, యరొబాము అతని స్థానంలో సింహాసనం ఎక్కాడు. యెహోయాషును సమరయలో ఇశ్రాయేలు రాజులతో పాటు సమాధి చేశారు.

  9. 2 రాజులు 13:14సుమారు క్రీ.పూ. 838

    ఆ కాలంలో ఎలీషాకు జబ్బుచేసింది, దానిని బట్టి తర్వాత అతడు చనిపోతాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతన్ని చూడడానికి వచ్చి అతన్ని చూసి, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు!” అని అంటూ ఏడ్చాడు.

  10. 2 రాజులు 13:15సుమారు క్రీ.పూ. 838

    అతనితో ఎలీషా, “విల్లు, కొన్ని బాణాలు తీసుకో” అని చెప్పగా అతడు అలా చేశాడు.

  11. 2 రాజులు 13:16సుమారు క్రీ.పూ. 838

    అతడు ఇశ్రాయేలు రాజుతో, “నీ చేతుల్లో విల్లును ఎక్కుపెట్టు” అన్నాడు. అతడు ఎక్కుపెట్టిన తర్వాత ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద ఉంచాడు.

  12. 2 రాజులు 13:17సుమారు క్రీ.పూ. 838

    ఎలీషా, “తూర్పున ఉన్న కిటికీ తెరువు” అన్నాడు, అతడు తెరిచాడు. ఎలీషా, “బాణం విసురు” అన్నాడు, రాజు బాణం విసిరాడు. ఎలీషా, “ఇది యెహోవా విజయ బాణం, అరాము మీద విజయ బాణం! నీవు ఆఫెకు దగ్గర అరామీయులను పూర్తిగా నాశనం చేస్తావు” అని ప్రకటించాడు.

  13. 2 రాజులు 13:18సుమారు క్రీ.పూ. 838

    తర్వాత అతడు, “బాణాలు చేత పట్టుకో” అన్నాడు, రాజు వాటిని తీసుకున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “వాటితో నేలను కొట్టు” అన్నాడు. అతడు నేలను మూడుసార్లు కొట్టి ఆగాడు.

  14. 2 రాజులు 13:19సుమారు క్రీ.పూ. 838

    దైవజనుడు అతని మీద కోప్పడి, “నీవు అయిదు లేదా ఆరు సార్లు కొట్టివుంటే, నీవు అరాము దేశాన్ని ఓడించి పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి. కాని, ఇప్పుడు దానిని మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు” అని అన్నాడు.

  15. 2 రాజులు 13:20సుమారు క్రీ.పూ. 837

    తర్వాత ఎలీషా చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు. అయితే ప్రతి వసంతకాలంలో మోయాబు దోపిడి మూకలు దేశంలోకి వచ్చేవారు.

  16. 2 రాజులు 13:21సుమారు క్రీ.పూ. 837

    ఒకసారి కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక శవాన్ని సమాధి చేస్తుండగా అకస్మాత్తుగా దోపిడి మూకను చూసి ఆ మనిషి శవాన్ని ఎలీషా సమాధిలో పడేశారు. ఆ శవం ఎలీషా ఎముకలకు తగలగానే, ఆ మనిషి తిరిగి బ్రతికి లేచి తన కాళ్లమీద నిలబడ్డాడు.

  17. 2 రాజులు 13:22సుమారు క్రీ.పూ. 856

    యెహోయాహాజు పరిపాలన అంతటిలో, అరాము రాజైన హజాయేలు ఇశ్రాయేలు ప్రజలను బాధించాడు.

  18. 2 రాజులు 13:23సుమారు క్రీ.పూ. 856

    అయితే యెహోవా తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వారి మీద జాలిపడి దయ చూపారు. ఈనాటి వరకు యెహోవా వారిని తన సముఖం నుండి వెళ్లగొట్టడానికి ఇష్టపడలేదు.

  19. 2 రాజులు 13:24సుమారు క్రీ.పూ. 856

    అరాము రాజైన హజాయేలు చనిపోయాడు, అతని తర్వాత అతని కుమారుడైన బెన్-హదదు రాజయ్యాడు.

  20. 2 రాజులు 13:25సుమారు క్రీ.పూ. 836

    అప్పుడు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు అంతకుముందు హజాయేలు యెహోయాహాజుతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్న పట్టణాలను హజాయేలు కుమారుడైన బెన్-హదదు నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మూడుసార్లు యెహోయాషు అతన్ని ఓడించి ఇశ్రాయేలు పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

  21. 2 రాజులు 14:1సుమారు క్రీ.పూ. 839

    ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యూదారాజు యోవాషు కుమారుడైన అమజ్యా పరిపాలన ఆరంభించాడు.

  22. 2 రాజులు 14:2సుమారు క్రీ.పూ. 839

    అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది.

  23. 2 రాజులు 14:3సుమారు క్రీ.పూ. 839

    అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కాని తన పితరుడైన దావీదులా కాదు. అన్ని విషయాల్లో అతని తండ్రియైన యోవాషు మాదిరిని అనుసరించాడు.

  24. 2 రాజులు 14:4సుమారు క్రీ.పూ. 839

    అయితే క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.

  25. 2 రాజులు 14:5సుమారు క్రీ.పూ. 838

    రాజ్యం తన వశంలో స్థిరమైన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు.