కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 రాజులు 18:3సుమారు క్రీ.పూ. 726

    అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.

  2. 2 రాజులు 18:4సుమారు క్రీ.పూ. 726

    అతడు క్షేత్రాలను తొలగించి, పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు, ఎందుకంటే ఆ కాలం వరకు ఇశ్రాయేలీయులు దానికి ధూపం వేసేవారు. (అది నెహుష్టాను అని పిలువబడేది.)

  3. 2 రాజులు 18:5సుమారు క్రీ.పూ. 726

    హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు నమ్మకం ఉంచాడు. అతని ముందు గాని అతని తర్వాత గాని వచ్చిన యూదా రాజులలో, ఎవరూ అతని వంటివారు లేరు.

  4. 2 రాజులు 18:6సుమారు క్రీ.పూ. 726

    అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయనను వెంబడించడం మానేయలేదు; యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞలను అతడు పాటించాడు.

  5. 2 రాజులు 18:7సుమారు క్రీ.పూ. 726

    యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి హిజ్కియా చేసిన వాటన్నిటిలో జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు సేవచేయకుండ అతని మీద తిరగబడ్డాడు.

  6. 2 రాజులు 18:8సుమారు క్రీ.పూ. 726

    కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, గాజా దాని సరిహద్దుల వరకు ఫిలిష్తీయులను ఓడించాడు.

  7. 2 రాజులు 18:9సుమారు క్రీ.పూ. 723

    రాజైన హిజ్కియా పరిపాలన యొక్క నాలుగవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క ఏడవ సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి దండెత్తి దాన్ని ముట్టడించాడు.

  8. 2 రాజులు 18:10సుమారు క్రీ.పూ. 721

    మూడు సంవత్సరాల ముగింపులో అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. కాబట్టి హిజ్కియా పరిపాలన యొక్క ఆరవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన హోషేయ పరిపాలన యొక్క తొమ్మిదవ సంవత్సరంలో సమరయ స్వాధీనపరచుకోబడింది.

  9. 2 రాజులు 18:11సుమారు క్రీ.పూ. 721

    అష్షూరు రాజు ఇశ్రాయేలును చెరగా తీసుకెళ్లి, హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.

  10. 2 రాజులు 18:12సుమారు క్రీ.పూ. 721

    వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా, ఆయన నిబంధనను, యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిందంతటిని ఉల్లంఘించినందుకు ఇలా జరిగింది. వారు ఆజ్ఞలను వినలేదు, పాటించలేదు.

  11. 2 రాజులు 18:13సుమారు క్రీ.పూ. 713

    రాజైన హిజ్కియా పాలన యొక్క పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.

  12. 2 రాజులు 18:14సుమారు క్రీ.పూ. 713

    కాబట్టి యూదా రాజైన హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరకు, “నేను తప్పు చేశాను. నా దగ్గర నుండి నీవు వెనుకకు వెళ్లిపో, నీవు నా నుండి ఏమి కోరిన అది ఇస్తాను” అని సందేశం పంపాడు. అష్షూరు రాజు మూడువందలు తలాంతుల వెండి, ముప్పై తలాంతుల బంగారం యూదా రాజైన హిజ్కియా చెల్లించాలని విధించాడు.

  13. 2 రాజులు 18:15సుమారు క్రీ.పూ. 713

    కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజభవన ధననిధిలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చాడు.

  14. 2 రాజులు 18:16సుమారు క్రీ.పూ. 713

    ఇంకా ఆ కాలంలో యూదా రాజైన హిజ్కియా యెహోవా ఆలయ తలుపులకున్న బంగారం, తలుపు స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు.

  15. 2 రాజులు 18:17సుమారు క్రీ.పూ. 710

    అష్షూరు రాజు తన ప్రధాన సైన్యాధిపతిని, ముఖ్య అధికారిని, సైన్యాధిపతిని, పెద్ద సైన్యంతో, లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా దగ్గరకు పంపాడు. వారు యెరూషలేముకు దండెత్తి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగారు.

  16. 2 రాజులు 18:18సుమారు క్రీ.పూ. 710

    వారు రాజును పిలిపించారు; హిల్కీయా కుమారుడు, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు రాజ్య లేఖికుడైన యోవాహు వారి దగ్గరకు వెళ్లారు.

  17. 2 రాజులు 18:19సుమారు క్రీ.పూ. 710

    అప్పుడు సైన్యాధిపతి వారితో అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి: “ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం?

  18. 2 రాజులు 18:20సుమారు క్రీ.పూ. 710

    యుద్ధం విషయంలో నీకు ఆలోచన, బలం ఉంది అంటావు, కాని నీవు మాట్లాడేవి వట్టి మాటలే. నీవు ఎవరిని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేస్తున్నావు?

  19. 2 రాజులు 18:21సుమారు క్రీ.పూ. 710

    చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే.

  20. 2 రాజులు 18:22సుమారు క్రీ.పూ. 710

    అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది?

  21. 2 రాజులు 18:23సుమారు క్రీ.పూ. 710

    “ ‘ఇప్పుడు రండి, నా యజమానియైన అష్షూరు రాజుతో బేరం కుదుర్చుకోండి: మీ దగ్గర సరిపడే రౌతులు ఉంటే, నేను మీకు రెండువేల గుర్రాలు ఇస్తాను!

  22. 2 రాజులు 18:24సుమారు క్రీ.పూ. 710

    రథాలు, రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు?

  23. 2 రాజులు 18:25సుమారు క్రీ.పూ. 710

    యెహోవా నుండి మాట రాకుండానే ఈ స్థలంపై దాడి చేసి నాశనం చేయడానికి వచ్చానా? ఈ దేశంపై దాడి చేసి నాశనం చేయమని స్వయాన యెహోవాయే చెప్పారు.’ ”

  24. 2 రాజులు 18:26సుమారు క్రీ.పూ. 710

    అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు.

  25. 2 రాజులు 18:27సుమారు క్రీ.పూ. 710

    అయితే సైన్యాధిపతి జవాబిస్తూ, “ఈ విషయాలు కేవలం మీకు, మీ యజమానికి మాత్రమే చెప్పటానికి నా యజమాని నన్ను పంపాడని, గోడ మీద కూర్చున్న ప్రజలకు కాదనుకున్నారా? వారు కూడా మీలాగే తమ మలం తింటూ తమ మూత్రం త్రాగాల్సిందే” అని అన్నాడు.