కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 16:49సుమారు క్రీ.పూ. 594

    “ ‘నీ సోదరి సొదొమ చేసిన పాపమేమిటంటే, తాను, తన కుమార్తెలు అహంకారులు, ఆహార సమృద్ధి కలిగి ఉండి ఇతరులను పట్టించుకోరు; వారు పేదలకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయలేదు.

  2. యెహెజ్కేలు 16:50సుమారు క్రీ.పూ. 594

    వారంతా గర్వించి నా ఎదుట అసహ్యమైన వాటిని చేశారు కాబట్టి అదంతా చూసి నేను వారిని వెళ్లగొట్టాను.

  3. యెహెజ్కేలు 16:51సుమారు క్రీ.పూ. 594

    సమరయ సైతం నీవు చేసిన పాపంలో సగమైనా చేయలేదు. నీవు వారికంటే అసహ్యమైన పనులు చేశావు. నీవు చేసిన వాటితో పోల్చితే నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడతారు.

  4. యెహెజ్కేలు 16:52సుమారు క్రీ.పూ. 594

    నీ అక్కచెల్లెళ్లకు నీవు విధించిన అవమాన శిక్ష నీవే భరించాలి. వారి పాపాల నీ పాపాలు కంటే చాలా నీచంగా ఉన్నాయి కాబట్టి వారు నీ కంటే ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారు. నీ పనుల వలన నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి సిగ్గుపడి అవమానాన్ని భరించు.

  5. యెహెజ్కేలు 16:53సుమారు క్రీ.పూ. 594

    “ ‘నేను సొదొమకు దాని కుమార్తెలకు, సమరయకు దాని కుమార్తెలకు వారి సంపదతో పాటు మీ సంపదను తిరిగి ఇస్తాను.

  6. యెహెజ్కేలు 16:54సుమారు క్రీ.పూ. 594

    తద్వార వారి ఆదరణ కోసం నీవు చేసిన దానంతటిని బట్టి నీవు అవమానాన్ని భరించి సిగ్గుపడతావు.

  7. యెహెజ్కేలు 16:55సుమారు క్రీ.పూ. 594

    నీ సోదరీలైన సొదొమ దాని కుమార్తెలు, సమరయ దాని కుమార్తెలు తమ పూర్వస్థితికి వస్తారు. అలాగే నీవు నీ కుమార్తెలు కూడా మీ పూర్వస్థితికి వస్తారు.

  8. యెహెజ్కేలు 16:56సుమారు క్రీ.పూ. 594

    నీవు గర్వించే రోజుల్లో, నీ దుర్మార్గం బయటపడక ముందు నీ సోదరి సొదొమ గురించి కూడా ప్రస్తావించవు,

  9. యెహెజ్కేలు 16:57సుమారు క్రీ.పూ. 594

    అయినప్పటికీ, ఇప్పుడు ఎదోము కుమార్తెలు, ఆమె పొరుగువారైన ఫిలిష్తీయుల కుమార్తెలు, మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని తృణీకరించే వారందరూ మిమ్మల్ని దూషిస్తున్నారు.

  10. యెహెజ్కేలు 16:58సుమారు క్రీ.పూ. 594

    నీ అసభ్య ప్రవర్తనకు నీ అసహ్యమైన ఆచారాల పర్యవసానాన్ని నీవే భరించాలి అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. యెహెజ్కేలు 16:59సుమారు క్రీ.పూ. 594

    “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు చేసిన నిబంధన ఉల్లంఘించడం ద్వారా నీవు నా ప్రమాణాన్ని తృణీకరించావు కాబట్టి దానికి తగినట్లుగా నీకు చేస్తాను.

  12. యెహెజ్కేలు 16:60సుమారు క్రీ.పూ. 594

    అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.

  13. యెహెజ్కేలు 16:61సుమారు క్రీ.పూ. 594

    నీవు నీ అక్కచెల్లెళ్లను కలుసుకున్నప్పుడు నీ మార్గాలను జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు. నీతో నా ఒడంబడికలో భాగం కాకపోయినా నేను వారిని నీకు కుమార్తెలుగా ఇస్తాను.

  14. యెహెజ్కేలు 16:62సుమారు క్రీ.పూ. 594

    నేను నీతో నా ఒడంబడికను స్థిరపరుస్తాను, అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

  15. యెహెజ్కేలు 16:63సుమారు క్రీ.పూ. 594

    నీవు చేసిన వాటన్నిటికి నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు నీవు వాటిని జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు, నీ అవమానాన్ని బట్టి ఇక ఎన్నటికీ నోరు విప్పవు, ఇదే యెహోవా వాక్కు.’ ”

  16. యెహెజ్కేలు 17:1సుమారు క్రీ.పూ. 594

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  17. యెహెజ్కేలు 17:2సుమారు క్రీ.పూ. 594

    “మనుష్యకుమారుడా, నీవు ఒక పొడుపు కథ వేసి, దానిని ఇశ్రాయేలీయులకు ఒక ఉపమానంలా చెప్పాలి.

  18. యెహెజ్కేలు 17:3సుమారు క్రీ.పూ. 594

    వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: బలమైన రెక్కలు, పొడవైన ఈకలు కలిగి రకరకాల రంగులతో ఉన్న ఒక పెద్ద గ్రద్ద లెబానోను పర్వతానికి వచ్చి, దేవదారు చెట్టు కొమ్మపై వాలి,

  19. యెహెజ్కేలు 17:4సుమారు క్రీ.పూ. 594

    దాని అంచున ఉన్న లేత కొమ్మల చిగురు తెంపి వర్తకుల దేశానికి తీసుకెళ్లి వ్యాపారుల పట్టణంలో దానిని నాటింది.

  20. యెహెజ్కేలు 17:5సుమారు క్రీ.పూ. 594

    “ ‘అది ఆ దేశపు విత్తనాలను తీసుకెళ్లి సారవంతమైన నేలలో నాటింది. విస్తారమైన నీటి ప్రక్కన పెరిగే నిరవంజి చెట్లలా ఆ మొక్కను నాటింది,

  21. యెహెజ్కేలు 17:6సుమారు క్రీ.పూ. 594

    అది చిగురు వేసి పైకి పెరగకుండ నేలమీద విస్తరించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు గ్రద్ద వరకు వెళ్లాయి, కాని దాని వేర్లు గ్రద్ద క్రింద ఉన్నాయి. అలా అది ద్రాక్షవల్లిలా మారి అనేక కొమ్మలతో రెమ్మలు వేసింది.

  22. యెహెజ్కేలు 17:7సుమారు క్రీ.పూ. 594

    “ ‘అయితే బలమైన రెక్కలు దట్టమైన ఈకలతో మరొక పెద్ద గ్రద్ద ఉంది. ఆ ద్రాక్షావల్లి అది నాటబడిన చోటు నుండి ఆ గ్రద్ద వైపు తన వేర్లు విస్తరింపజేసుకుని, దాని కొమ్మలను నీటి కోసం దానివైపు విస్తరింపచేసుకుంది.

  23. యెహెజ్కేలు 17:8సుమారు క్రీ.పూ. 594

    ఆ ద్రాక్షావల్లికి తీగెలు వచ్చి, పండ్లు ఇచ్చేలా, అద్భుతమైన ద్రాక్షవల్లిలా అయ్యేలా, అది మంచి నేలలో విస్తారమైన నీటి ప్రక్కన నాటబడింది.’

  24. యెహెజ్కేలు 17:9సుమారు క్రీ.పూ. 594

    “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి చెందుతుందా? అది ఎండిపోయేలా ప్రజలు దాని వేరు పెకిలించి, దాని పండ్లు కోయరా? దాని చిగురులన్నీ ఎండిపోతాయి. దానిని వేర్లతో సహా పెకిలించడానికి బలమైన చేయి గాని, చాలామంది వ్యక్తులు గాని అవసరం లేదు.

  25. యెహెజ్కేలు 17:10సుమారు క్రీ.పూ. 594

    అది ఒకచోట నుండి మరొక చోట నాటబడింది, అది వృద్ధి చెందుతుందా? తూర్పు గాలి దాని మీద వీచినపుడు అది నాటబడిన చోటనే ఎండిపోదా?’ ”