కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 15:7సుమారు క్రీ.పూ. 594

    నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  2. యెహెజ్కేలు 15:8సుమారు క్రీ.పూ. 594

    వారు నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి నేను దేశాన్ని పాడుచేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”

  3. యెహెజ్కేలు 16:1సుమారు క్రీ.పూ. 594

    యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చి:

  4. యెహెజ్కేలు 16:2సుమారు క్రీ.పూ. 594

    “మనుష్యకుమారుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన ఆచారాలు దానికి తెలియజేసి,

  5. యెహెజ్కేలు 16:3సుమారు క్రీ.పూ. 594

    ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఇలా చెప్తున్నారు: మీ మూలలు, మీ పుట్టుక కనానీయుల దేశంలోనే; మీ తండ్రి అమోరీయుడు, మీ తల్లి హిత్తీయురాలు.

  6. యెహెజ్కేలు 16:4సుమారు క్రీ.పూ. 594

    నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు.

  7. యెహెజ్కేలు 16:5సుమారు క్రీ.పూ. 594

    నీ మీద ఎవరూ జాలిపడలేదు. ఈ పనులలో ఒక్కటైనా చేయాలని ఎవరూ నీ మీద కనికరం చూపించలేదు. పైగా, పుట్టిననాడే నిన్ను అసహ్యించుకుని, బయట పొలంలో విసిరివేశారు.

  8. యెహెజ్కేలు 16:6సుమారు క్రీ.పూ. 594

    “ ‘అప్పుడు నేను అటు నుండి వెళ్తూ నీ రక్తంలో కొట్టుకుంటున్న నిన్ను చూసి, నీవు నీ రక్తంలో పడి ఉన్నప్పుడు నేను నీతో, “బ్రతుకు!” అని అన్నాను.

  9. యెహెజ్కేలు 16:7సుమారు క్రీ.పూ. 594

    నిన్ను పొలం లోని మొక్కలా పెంచాను. నీవు పెరిగి అభివృద్ధిచెంది యుక్తవయస్సులోకి ప్రవేశించావు. నీకు రొమ్ములు ఏర్పడ్డాయి, నీ జుట్టు పెరిగింది, అయినప్పటికీ నీవు పూర్తిగా నగ్నంగా ఉన్నావు.

  10. యెహెజ్కేలు 16:8సుమారు క్రీ.పూ. 594

    “ ‘తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి, నీవు ప్రేమకు తగిన వయస్సులో ఉన్నావు కాబట్టి నా వస్త్రాన్ని నీపై వేసి నీ నగ్న శరీరాన్ని కప్పాను. నేను నీతో ప్రమాణం చేసి నిబంధన చేసుకున్నప్పుడు నీవు నా దానివి అయ్యావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. యెహెజ్కేలు 16:9సుమారు క్రీ.పూ. 594

    “ ‘నీకు నీళ్లతో స్నానం చేయించి నీ రక్తాన్ని కడిగి సువాసనగల నూనెతో నిన్ను అభిషేకించాను.

  12. యెహెజ్కేలు 16:10సుమారు క్రీ.పూ. 594

    నీకు అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు వేసి, మంచి చర్మంతో చేసిన చెప్పులు నీ పాదాలకు తొడిగించాను. నీకు సన్నని అవిసె నారబట్టలు వేసి ఖరీదైన పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.

  13. యెహెజ్కేలు 16:11సుమారు క్రీ.పూ. 594

    నేను నిన్ను నగలతో అలంకరించాను: నీ చేతులకు కంకణాలు, మెడలో హారం వేసి,

  14. యెహెజ్కేలు 16:12సుమారు క్రీ.పూ. 594

    ముక్కుకు ముక్కుపుడక, చెవులకు పోగులు తలపై కిరీటం పెట్టాను.

  15. యెహెజ్కేలు 16:13సుమారు క్రీ.పూ. 594

    ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు.

  16. యెహెజ్కేలు 16:14సుమారు క్రీ.పూ. 594

    నీ అందం కారణంగా నీ కీర్తి దేశాల్లో వ్యాపించింది, ఎందుకంటే నేను నీకు ఇచ్చిన వైభవం నీ అందాన్ని పరిపూర్ణం చేసిందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  17. యెహెజ్కేలు 16:15సుమారు క్రీ.పూ. 594

    “ ‘అయితే నీ అందాన్ని నమ్ముకుని, నీ కీర్తిని ఉపయోగించుకుని నీవు వేశ్యగా మారావు. దారిన వెళ్లే వారందరితో వ్యభిచరించావు; నీ అందం వారి సొంతం అయింది.

  18. యెహెజ్కేలు 16:16సుమారు క్రీ.పూ. 594

    నీవు అందమైన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి నీ వస్త్రాల్లో కొన్నిటిని తీసుకున్నావు, అక్కడ నీవు నీ వ్యభిచారం కొనసాగించావు. నీవు అతని దగ్గరకు వెళ్లావు, అతడు నీ అందాన్ని తనది చేసుకున్నాడు.

  19. యెహెజ్కేలు 16:17సుమారు క్రీ.పూ. 594

    నేను నీకు ఇచ్చిన నాణ్యమైన నగలు, నా బంగారు వెండితో చేసిన నగలు కూడా తీసుకుని, నీకోసం మగ విగ్రహాలను తయారుచేసి, వాటితో వ్యభిచారం చేశావు.

  20. యెహెజ్కేలు 16:18సుమారు క్రీ.పూ. 594

    నీవు వాటికి నీ కుట్టుపని చేసిన వస్త్రాలు ధరింపజేసి, నీవు వాటికి నా నూనె, ధూపం సమర్పించావు.

  21. యెహెజ్కేలు 16:19సుమారు క్రీ.పూ. 594

    నేను నీకు ఆహారంగా ఇచ్చిన నాణ్యమైన పిండి, తేనె, నూనెలను తీసుకుని సువాసన వచ్చేలా వాటికి అర్పించావు. జరిగింది ఇదే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  22. యెహెజ్కేలు 16:20సుమారు క్రీ.పూ. 594

    “ ‘నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను ఆ విగ్రహాలకు ఆహారంగా బలి అర్పించావు. నీవు చేసిన వ్యభిచారం సరిపోలేదా?

  23. యెహెజ్కేలు 16:21సుమారు క్రీ.పూ. 594

    నా పిల్లలను నీవు వధించి ఆ విగ్రహాలకు బలి ఇచ్చావు.

  24. యెహెజ్కేలు 16:22సుమారు క్రీ.పూ. 594

    నీవు అసహ్యకరమైన ఆచారాలు పాటిస్తూ వ్యభిచారం చేస్తున్నప్పుడు నీ యవ్వనంలో నీవు నగ్నంగా ఒంటి మీద ఏమి లేకుండ, నీ రక్తంలో పడి తన్నుకుంటున్న రోజులను జ్ఞాపకం చేసుకోలేదు.

  25. యెహెజ్కేలు 16:23సుమారు క్రీ.పూ. 594

    “ ‘నీవు చేసిన చెడుతనాన్ని బట్టి శ్రమ! నీకు శ్రమ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.