- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 13:3సుమారు క్రీ.పూ. 594
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: దర్శనమేమి చూడకపోయినా సొంత ఆత్మను అనుసరించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ.
- యెహెజ్కేలు 13:4సుమారు క్రీ.పూ. 594
ఇశ్రాయేలీయులారా! మీ ప్రవక్తలు శిథిలాల మధ్య తిరిగే నక్కల్లాంటి వారు.
- యెహెజ్కేలు 13:5సుమారు క్రీ.పూ. 594
ఇశ్రాయేలు ప్రజలు యెహోవా రోజున జరిగే యుద్ధంలో స్థిరంగా నిలబడేలా మీరు గోడ పగుళ్ల దగ్గరకు వెళ్లి వాటిని బాగుచేయలేదు.
- యెహెజ్కేలు 13:6సుమారు క్రీ.పూ. 594
వారి దర్శనాలు తప్పు, వారి భవిష్యవాణి అబద్ధము. యెహోవా తమను పంపకపోయినా, “ఇదే యెహోవా వాక్కు” అని చెబుతూ తమ మాటలు నెరవేరుతాయని నమ్మిస్తారు.
- యెహెజ్కేలు 13:7సుమారు క్రీ.పూ. 594
నేను మాట్లాడక పోయినా ఇదే యెహోవా మాట అని మీరు చెప్పినప్పుడు మీ చూసిన దర్శనాలు వట్టి భ్రమలు భవిష్యవాణి అబద్ధమే కదా?
- యెహెజ్కేలు 13:8సుమారు క్రీ.పూ. 594
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు చెప్పే వట్టిమాటలు అబద్ధపు దర్శనాల కారణంగా నేను మీకు వ్యతిరేకంగా ఉన్నానని ప్రభువైన యెహోవా తెలియజేస్తున్నారు.
- యెహెజ్కేలు 13:9సుమారు క్రీ.పూ. 594
వ్యర్థమైన దర్శనాలు చూస్తూ అబద్ధపు సోదె చెప్పే ప్రవక్తలకు నా చేయి వ్యతిరేకంగా ఉంటుంది. వారిని నా ప్రజల సభలోనికి రానివ్వను, వారు ఇశ్రాయేలీయుల జాబితాలో నమోదు చేయబడరు, ఇశ్రాయేలీయుల దేశానికి తిరిగి రారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 13:10సుమారు క్రీ.పూ. 594
“ ‘సమాధానం లేనప్పుడు సమాధానం అంటూ నా ప్రజలను మోసగిస్తున్నారు. ఒకరు కట్టిన బలహీనమైన గోడకు వారు సున్నం వేస్తారు.
- యెహెజ్కేలు 13:11సుమారు క్రీ.పూ. 594
సున్నం వేస్తున్నవారితో అది కూలిపోతుందని చెప్పు. నేను వర్షం, వడగండ్లు కురిపించినప్పుడు బలమైన గాలులు వీచి అది పడిపోతుంది.
- యెహెజ్కేలు 13:12సుమారు క్రీ.పూ. 594
గోడ కూలిపోవడం చూసిన ప్రజలు, “మీరు వేసిన సున్నం ఏది అని అడగరా?”
- యెహెజ్కేలు 13:13సుమారు క్రీ.పూ. 594
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఉగ్రతతో బలమైన గాలిని, కోపంతో వడగండ్లు కుండపోత వర్షాన్ని పంపి దానిని పడగొడతాను.
- యెహెజ్కేలు 13:14సుమారు క్రీ.పూ. 594
మీరు సున్నం వేసిన గోడను దాని పునాది కనబడేలా నేలమట్టం చేస్తాను. ఆ గోడ పడినప్పుడు దాని క్రింద మీరంతా నాశనమవుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 13:15సుమారు క్రీ.పూ. 594
ఆ గోడ మీద దానికి సున్నం వేసిన వారి మీద నా కోపం కురిపిస్తాను. అప్పుడు నేను మీతో, “గోడ లేదు దానికి సున్నం వేసినవారు కూడా లేరు,
- యెహెజ్కేలు 13:16సుమారు క్రీ.పూ. 594
యెరూషలేముకు సమాధానం లేకపోయినా సమాధానం కలిగే దర్శనాలు చూసి ప్రవచించే ఇశ్రాయేలు ప్రవక్తలు కూడా ఉండరు అని చెప్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” ’
- యెహెజ్కేలు 13:17సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, ప్రవచిస్తున్న నీ ప్రజల కుమార్తెలకు విరోధంగా ప్రవచించి,
- యెహెజ్కేలు 13:18సుమారు క్రీ.పూ. 594
వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ప్రజలను వలలో వేసుకోవడానికి తమ మణికట్టు మీద తాయెత్తులు కట్టుకుని తమ తలలపై వేసుకోడానికి వివిధ రకాల ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ. మీరు నా ప్రజల జీవితాలను ఉచ్చులో ఇరికించి, మీ సొంత ప్రాణాలను కాపాడుకుంటారా?
- యెహెజ్కేలు 13:19సుమారు క్రీ.పూ. 594
మీరు గుప్పెడు యవల కోసం రొట్టె ముక్కల కోసం నా ప్రజలమధ్య నన్ను అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పి, చావకూడని వారిని చంపారు; బ్రతకకూడని వారిని విడిచిపెట్టారు.
- యెహెజ్కేలు 13:20సుమారు క్రీ.పూ. 594
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు పక్షులకు వల వేసినట్లు ప్రజల ప్రాణాలకు వల వేయడానికి ఉపయోగించే మీ మంత్రాలకు నేను వ్యతిరేకిని. నేను వాటిని మీ చేతుల నుండి తెంపివేస్తాను; పక్షులను పట్టినట్లు వలవేసి మీరు పట్టిన ప్రజలను విడిపిస్తాను.
- యెహెజ్కేలు 13:21సుమారు క్రీ.పూ. 594
నేను మీ ముసుగులను చింపివేసి, నా ప్రజలను మీ చేతుల నుండి రక్షిస్తాను, వారు ఇకపై మీ శక్తికి బలి అవరు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 13:22సుమారు క్రీ.పూ. 594
ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు.
- యెహెజ్కేలు 13:23సుమారు క్రీ.పూ. 594
కాబట్టి ఇకపై మీరు అబద్ధపు దర్శనాలు చూడరు భవిష్యవాణి చెప్పరు. మీ చేతుల్లో నుండి నా ప్రజలను రక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
- యెహెజ్కేలు 14:1సుమారు క్రీ.పూ. 594
ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు ఎదురుగా కూర్చున్నారు.
- యెహెజ్కేలు 14:2సుమారు క్రీ.పూ. 594
అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 14:3సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, ఈ మనుష్యులు తమ హృదయాల్లో విగ్రహాలను ఉంచుకొని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకున్నారు. నా దగ్గర విచారణ చేయడానికి నేను వారిని అనుమతించాలా?
- యెహెజ్కేలు 14:4సుమారు క్రీ.పూ. 594
కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ఇశ్రాయేలు సర్వసమాజం తమ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని ప్రవక్త దగ్గరకు వెళ్తే వారు చేసే విగ్రహారాధనను బట్టి వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను.