- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 12:6సుమారు క్రీ.పూ. 594
వారు చూస్తుండగానే వాటిని నీ భుజంపై వేసుకుని సంధ్యా సమయంలో వాటిని తీసుకుని వెళ్లు. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు సూచనగా చేశాను కాబట్టి నీకు నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో.”
- యెహెజ్కేలు 12:7సుమారు క్రీ.పూ. 594
నాకు ఆజ్ఞాపించిన ప్రకారమే నేను చేశాను. దేశం విడిచి వెళ్తున్నట్లుగా పగలు నా సామాన్లు బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేతితో గోడను త్రవ్వాను. రాత్రి వారు చూస్తుండగా నా సామాన్లు భుజంపై ఎత్తుకున్నాను.
- యెహెజ్కేలు 12:8సుమారు క్రీ.పూ. 594
ఉదయాన యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
- యెహెజ్కేలు 12:9సుమారు క్రీ.పూ. 594
మనుష్యకుమారుడా, నీవేం చేస్తున్నావని తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు నిన్ను అడగలేదా?
- యెహెజ్కేలు 12:10సుమారు క్రీ.పూ. 594
“వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ప్రవచనం యెరూషలేములోని యువరాజుకు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి సంబంధించినది.’
- యెహెజ్కేలు 12:11సుమారు క్రీ.పూ. 594
వారికి ఈ మాట చెప్పు: ‘నేను మీకు సూచనగా ఉన్నాను.’ “నేను చేసినట్లే వారికి కూడా జరుగుతుంది. వారు బందీలుగా దేశం నుండి కొనిపోబడతారు.
- యెహెజ్కేలు 12:12సుమారు క్రీ.పూ. 594
“వారిలో యువరాజు రాత్రివేళ తన సామాన్లు భుజంపై వేసుకుని తాను వెళ్లడానికి గోడను త్రవ్వుతాడు. అతడు నేల కనిపించకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.
- యెహెజ్కేలు 12:13సుమారు క్రీ.పూ. 594
అతన్ని పట్టుకోడానికి వల వేయగా అతడు దానిలో చిక్కుకుంటాడు. నేను అతన్ని బబులోనీయుల దేశమైన బబులోనుకు తీసుకువస్తాను కానీ అతడు దానిని చూడకుండానే అక్కడే అతడు చనిపోతాడు.
- యెహెజ్కేలు 12:14సుమారు క్రీ.పూ. 594
అతనితో ఉన్నవారందరిని అనగా అతని సహాయకులను అతని సైన్యాన్ని గాలికి చెదరగొడతాను. కత్తి దూసి వారినందరిని తరుముతాను.
- యెహెజ్కేలు 12:15సుమారు క్రీ.పూ. 594
“నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టి వివిధ దేశాలకు వెళ్లగొట్టినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 12:16సుమారు క్రీ.పూ. 594
వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.”
- యెహెజ్కేలు 12:17సుమారు క్రీ.పూ. 594
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 12:18సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, వణుకుతూ నీ ఆహారం తిను, భయంతో తడబడుతూ నీ నీళ్లు త్రాగు.
- యెహెజ్కేలు 12:19సుమారు క్రీ.పూ. 594
దేశంలోని ప్రజలకు ఇలా చెప్పు: ‘యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నవారి గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అక్కడ నివసించే వారందరు చేసే హింస కారణంగా వారి దేశంలోని ప్రతిదీ తీసివేయబడుతుంది. కాబట్టి వారు ఆందోళనలో తమ ఆహారాన్ని తింటారు నిరాశతో నీరు త్రాగుతారు.
- యెహెజ్కేలు 12:20సుమారు క్రీ.పూ. 594
నివాసులు ఉండిన పట్టణాలు వ్యర్థమైన శిథిలాలుగా, దేశం నిర్జనంగా మారుతాయి. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
- యెహెజ్కేలు 12:21సుమారు క్రీ.పూ. 594
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 12:22సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, ప్రతీ దర్శనం విఫలమవుతుంది’ అని ఇశ్రాయేలు దేశంలో చెప్పే సామెతకు అర్థం ఏమిటి?
- యెహెజ్కేలు 12:23సుమారు క్రీ.పూ. 594
వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఇకపై ఇశ్రాయేలు దేశంలో వినబడకుండ నేను ఆ సామెతకు ముగింపు ఇవ్వబోతున్నాను. ప్రతీ దర్శనం నెరవేరబోయే రోజులు ఎదురుగా ఉన్నాయని వారితో చెప్పు.
- యెహెజ్కేలు 12:24సుమారు క్రీ.పూ. 594
ఇశ్రాయేలీయుల మధ్య తప్పుడు దర్శనాలు గాని పొగడ్తలతో కూడిన భవిష్యవాణి గాని ఉండవు.
- యెహెజ్కేలు 12:25సుమారు క్రీ.పూ. 594
అయితే యెహోవానైన నేను, నేను ఏమి చేస్తానో అదే మాట్లాడతాను, అది ఆలస్యం లేకుండా నెరవేరుతుంది. ఎందుకంటే, తిరుగుబాటుదారులారా, మీ రోజుల్లో నేను చెప్పేది నెరవేరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యెహెజ్కేలు 12:26సుమారు క్రీ.పూ. 594
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 12:27సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు, ‘అతడు చూసే దర్శనం నెరవేరడానికి చాలా సంవత్సరాల పడుతుంది, అతడు చాలా కాలం తర్వాత భవిష్యత్తులో జరిగే వాటి గురించి ప్రవచిస్తున్నాడు’ అని అంటున్నారు.
- యెహెజ్కేలు 12:28సుమారు క్రీ.పూ. 594
“కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇకపై నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యెహెజ్కేలు 13:1సుమారు క్రీ.పూ. 594
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 13:2సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, ఇప్పుడు ప్రవచిస్తున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించు. తమ సొంత ఊహ ఆధారంగా ప్రవచించే వారితో ఇలా చెప్పు: ‘యెహోవా మాట వినండి!