- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 14:5సుమారు క్రీ.పూ. 594
తమ విగ్రహాలన్నిటి కోసం నన్ను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల హృదయాలను తిరిగి నా వైపు త్రిప్పుకోడానికి నేను ఇలా చేస్తాను.’
- యెహెజ్కేలు 14:6సుమారు క్రీ.పూ. 594
“కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీ విగ్రహాలను విడిచిపెట్టి అసహ్యకరమైన ఆచారాలు మానివేసి మనస్సు మార్చుకోండి.
- యెహెజ్కేలు 14:7సుమారు క్రీ.పూ. 594
“ ‘ఇశ్రాయేలీయులు గాని వారి దేశంలో ఉంటున్న విదేశీయులు గాని నన్ను విడిచిపెట్టి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని నా దగ్గర విచారణచేయమని వారు ప్రవక్త దగ్గరకు వెళ్తే వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను.
- యెహెజ్కేలు 14:8సుమారు క్రీ.పూ. 594
వారికి నేను విరోధిగా ఉండి వారిని ఒక సూచనగా సామెతగా చేస్తాను. నేను వారిని నా ప్రజల నుండి తొలగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 14:9సుమారు క్రీ.పూ. 594
“ ‘ఎవరైనా ప్రవక్త మోసపోయి ఏదైన ప్రవచనం చెబితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి వ్యతిరేకంగా నా చేయి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలులో నుండి అతన్ని నాశనం చేస్తాను.
- యెహెజ్కేలు 14:10సుమారు క్రీ.పూ. 594
వారు తమ శిక్షను భరిస్తారు; ప్రవచనం కోసం వచ్చిన వాని దోషమెంతో ప్రవచించిన ప్రవక్త దోషం కూడా అంతే.
- యెహెజ్కేలు 14:11సుమారు క్రీ.పూ. 594
అప్పుడిక ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టరు, వారు తమ పాపాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వారు నా ప్రజలై ఉంటారు. నేను వారి దేవుడినై ఉంటానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యెహెజ్కేలు 14:12సుమారు క్రీ.పూ. 594
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 14:13సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, ఒక దేశం నమ్మకద్రోహంతో నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి వ్యతిరేకంగా నా చేతిని చాపి ఆహారం లేకుండా చేసి కరువు పంపించి దాని మనుష్యులను పశువులను చంపుతాను.
- యెహెజ్కేలు 14:14సుమారు క్రీ.పూ. 594
ఆ దేశంలో నోవహు దానియేలు యోబు ఈ ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- యెహెజ్కేలు 14:15సుమారు క్రీ.పూ. 594
“ఆ దేశం పిల్లలు లేనిదై నిర్మానుష్యంగా మారేలా దాని మీదికి అడవి మృగాలను పంపుతాను. వాటి కారణంగా దానిగుండా ఎవరూ ప్రయాణించరు.
- యెహెజ్కేలు 14:16సుమారు క్రీ.పూ. 594
నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు కాని దేశం పాడైపోతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- యెహెజ్కేలు 14:17సుమారు క్రీ.పూ. 594
“నేను ఆ దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించి, ఆ దేశమంతా తిరిగి దానిలోని మనుష్యులను పశువులను చంపమని చెప్పినప్పుడు,
- యెహెజ్కేలు 14:18సుమారు క్రీ.పూ. 594
నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- యెహెజ్కేలు 14:19సుమారు క్రీ.పూ. 594
“నేను ఆ దేశంలోకి తెగులు పంపి రక్తపాతం జరిగేంతగా నా ఉగ్రత కుమ్మరించి మనుష్యులను పశువులను చంపినప్పుడు,
- యెహెజ్కేలు 14:20సుమారు క్రీ.పూ. 594
నా జీవం తోడు నోవహు దానియేలు యోబు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలరని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెహెజ్కేలు 14:21సుమారు క్రీ.పూ. 594
“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది!
- యెహెజ్కేలు 14:22సుమారు క్రీ.పూ. 594
అయినప్పటికీ దానిలో నుండి బయటకు రప్పించబడిన కుమారులు కుమార్తెలలో కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు. వారు మీ దగ్గరకు వస్తారు, మీరు వారి ప్రవర్తనలో పనులలో తేడాను చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన కీడు గురించి నేను దానికి చేసిన వాటన్నిటి గురించి మీరు ఓదార్పు పొందుతారు.
- యెహెజ్కేలు 14:23సుమారు క్రీ.పూ. 594
వారి ప్రవర్తన వారి పనులు చూసినప్పుడు నేను కారణం లేకుండా ఏదీ చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు పొందుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”
- యెహెజ్కేలు 15:1సుమారు క్రీ.పూ. 594
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 15:2సుమారు క్రీ.పూ. 594
“మనుష్యకుమారుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కొమ్మల కంటే ఏమైనా గొప్పదా?
- యెహెజ్కేలు 15:3సుమారు క్రీ.పూ. 594
దాని కర్ర ఏ పనికైనా ఉపయోగపడుతుందా? ఏ పనికైనా దాని కర్రను వాడతారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో మేకులు తయారుచేస్తారా?
- యెహెజ్కేలు 15:4సుమారు క్రీ.పూ. 594
లేదు కదా, అది మంటలో వేయడానికే ఉపయోగపడుతుంది. అగ్నిలో రెండు చివరలు మధ్య భాగం కాలిపోయిన తర్వాత అది దేనికైనా ఉపయోగపడుతుందా?
- యెహెజ్కేలు 15:5సుమారు క్రీ.పూ. 594
అది కాలక ముందే దేనికి ఉపయోగపడనప్పుడు అగ్నిలో పూర్తిగా కాలిన తర్వాత మరి దేనికి ఉపయోగపడుతుంది?
- యెహెజ్కేలు 15:6సుమారు క్రీ.పూ. 594
“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలా అగ్నికి అప్పగించానో అలానే యెరూషలేములో నివసించే ప్రజలను అప్పగిస్తాను.