కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 16:24సుమారు క్రీ.పూ. 594

    నీవు నీకోసం ఒక మట్టిదిబ్బను నిర్మించుకున్నావు, ప్రతి బహిరంగ కూడలిలో ఒక ఎత్తైన క్షేత్రాన్ని నిర్మించావు.

  2. యెహెజ్కేలు 16:25సుమారు క్రీ.పూ. 594

    ప్రతి వీధి మూలలో నీవు నీ ఎత్తైన క్షేత్రాలను నిర్మించి, నీ అందాన్ని దిగజార్చుకున్నావు, కామం ఎక్కువై దారిన ఎవరు వెళ్తే వారికి నీ కాళ్లను తెరిచి వ్యభిచరించావు.

  3. యెహెజ్కేలు 16:26సుమారు క్రీ.పూ. 594

    నీవు కామవాంఛలతో నిండిన నీ పొరుగువారైన ఈజిప్టు వారితో మరి ఎక్కువగా వ్యభిచారం చేసి నాకు కోపాన్ని రేపావు.

  4. యెహెజ్కేలు 16:27సుమారు క్రీ.పూ. 594

    కాబట్టి నేను నీ మీదికి చేయి చాచి నీ సరిహద్దులను కుదించాను; నీ అశ్లీల ప్రవర్తనకు దిగ్భ్రాంతి చెందిన ఫిలిష్తీయుల కుమార్తెలైన నీ శత్రువుల దురాశకు నిన్ను అప్పగించాను.

  5. యెహెజ్కేలు 16:28సుమారు క్రీ.పూ. 594

    నీకు తృప్తి కలుగలేదు కాబట్టి నీవు అష్షూరీయులతో కూడా వ్యభిచరించావు; ఆ తర్వాత కూడా నీకు తృప్తి కలుగలేదు.

  6. యెహెజ్కేలు 16:29సుమారు క్రీ.పూ. 594

    బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు.

  7. యెహెజ్కేలు 16:30సుమారు క్రీ.పూ. 594

    “ ‘నీవు ఇవన్నీ చేస్తూ సిగ్గులేని వేశ్యలా ప్రవర్తిస్తూ ఉంటే, నాకు నీ మీద కోపం వచ్చింది, అని ప్రభువైన యెహోవా అంటున్నారు.

  8. యెహెజ్కేలు 16:31సుమారు క్రీ.పూ. 594

    నీవు ప్రతి వీధి మూలలో నీ మట్టిదిబ్బలను నిర్మించినప్పుడు, ప్రతి బహిరంగ కూడలిలో నీ క్షేత్రాలను నిర్మించినప్పుడు నీవు ఒక వేశ్య చేసినట్లు చేయలేదు, ఎందుకంటే నీవు డబ్బును తిరస్కరించావు.

  9. యెహెజ్కేలు 16:32సుమారు క్రీ.పూ. 594

    “ ‘వ్యభిచారియైన భార్యా! నీవు నీ సొంత భర్త కంటే అపరిచితులే కావాలనుకుంటావు!

  10. యెహెజ్కేలు 16:33సుమారు క్రీ.పూ. 594

    వేశ్యలందరూ బహుమతులు తీసుకుంటారు, కానీ నీ ప్రేమికులందరికీ నీవు ఎదురు బహుమతులు ఇస్తావు, నీతో వ్యభిచారం చేయడం కోసం ఎక్కడి నుండైనా నీ దగ్గరకు రావాలని వారికి లంచం ఇస్తావు.

  11. యెహెజ్కేలు 16:34సుమారు క్రీ.పూ. 594

    కాబట్టి నీ వ్యభిచారంలో నీకు ఇతరులకు తేడా ఉంది; నీతో వ్యభిచరించడానికి ఎవరూ నీ వెంట పడరు. నీవు డబ్బులు తీసుకోవు కాని తిరిగి నీవే వారికి ఇస్తావు కాబట్టి నీవు చాలా భిన్నమైనదానివి.

  12. యెహెజ్కేలు 16:35సుమారు క్రీ.పూ. 594

    “ ‘కాబట్టి, వేశ్యా, నీవు యెహోవా మాట విను!

  13. యెహెజ్కేలు 16:36సుమారు క్రీ.పూ. 594

    ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నీవు నీ ప్రేమికులతో నీ వ్యభిచారంలో నీ కామాన్ని కుమ్మరించి, నీ నగ్న శరీరాన్ని చూపించినందుకు, నీ అసహ్యకరమైన విగ్రహాల కారణంగా, నీవు వాటికోసం నీ పిల్లల రక్తాన్ని చిందించినందున,

  14. యెహెజ్కేలు 16:37సుమారు క్రీ.పూ. 594

    నీకు ఇష్టమైన నీ ప్రేమికులందరిని నీవు ప్రేమించినవారిని అలాగే నీవు ద్వేషించిన వారందరిని పోగుచేస్తాను. నీ చుట్టూ వారిని పోగు చేసి వారు నీ నగ్న శరీరాన్ని చూసేలా వారి ఎదుట నిన్ను వివస్త్రను చేస్తాను.

  15. యెహెజ్కేలు 16:38సుమారు క్రీ.పూ. 594

    వ్యభిచారులై హత్యలు చేసే స్త్రీలకు విధించే శిక్షను నేను నీకు విధిస్తాను; నా కోపం, రోషంతో కూడిన రక్త ప్రతీకారాన్ని నేను నీ మీదికి తెస్తాను.

  16. యెహెజ్కేలు 16:39సుమారు క్రీ.పూ. 594

    తర్వాత నేను నిన్ను నీ ప్రేమికుల చేతికి అప్పగిస్తాను, వారు నీ మట్టిదిబ్బలను కూల్చివేసి, నీ ఎత్తైన క్షేత్రాలను నాశనం చేస్తారు. వారు నీ బట్టలు విప్పి, నీ సొగసైన నగలును తీసుకుని నిన్ను నగ్నంగా వదిలివేస్తారు.

  17. యెహెజ్కేలు 16:40సుమారు క్రీ.పూ. 594

    వారు నీ మీదికి గుంపును రెచ్చగొట్టి పంపుతారు, ఆ గుంపు నిన్ను రాళ్లతో కొట్టి, తమ ఖడ్గాలతో నిన్ను ముక్కలు చేస్తారు.

  18. యెహెజ్కేలు 16:41సుమారు క్రీ.పూ. 594

    వారు నీ ఇళ్ళను తగలబెట్టి, అనేకమంది స్త్రీల చూస్తుండగా నీకు శిక్ష విధిస్తారు. నేను నీ వ్యభిచారాన్ని మాన్పిస్తాను, నీవు ఇకపై నీ ప్రేమికులకు డబ్బు చెల్లించవు.

  19. యెహెజ్కేలు 16:42సుమారు క్రీ.పూ. 594

    అప్పుడు నీ మీద నా ఉగ్రత తగ్గిపోతుంది, రోషంతో కూడిన నా కోపం నీ మీద నుండి తొలగిపోతుంది; నేను ప్రశాంతంగా ఉంటాను, ఇకపై కోపంగా ఉండను.

  20. యెహెజ్కేలు 16:43సుమారు క్రీ.పూ. 594

    “ ‘నీవు నీ యవ్వన దినాలను జ్ఞాపకం చేసుకోక వీటన్నిటితో నాకు కోపం రేపావు కాబట్టి, నీవు చేసిన పనిని నేను నిశ్చయంగా నీ తల మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. మీరు మీ ఇతర అసహ్యకరమైన ఆచారాలకు అసభ్యతను జోడించలేదా?

  21. యెహెజ్కేలు 16:44సుమారు క్రీ.పూ. 594

    “ ‘సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నీ గురించి ఈ సామెత చెప్తారు: “తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదే” అని.

  22. యెహెజ్కేలు 16:45సుమారు క్రీ.పూ. 594

    నీవు భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ తల్లికి తగిన కుమార్తెవు; అలాగే నీవు తన భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ అక్కకు తగ్గ చెల్లెలివి. నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు.

  23. యెహెజ్కేలు 16:46సుమారు క్రీ.పూ. 594

    నీ ఎడమ ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సమరయ నీకు అక్క, నీ కుడి ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సొదొమ నీకు చెల్లెలు.

  24. యెహెజ్కేలు 16:47సుమారు క్రీ.పూ. 594

    నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు.

  25. యెహెజ్కేలు 16:48సుమారు క్రీ.పూ. 594

    నీవు, నీ కుమార్తెలు చేసినట్లు నీ సోదరియైన సొదొమ గాని దాని కుమార్తెలు గాని చేయలేదని నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.