కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 11:6సుమారు క్రీ.పూ. 594

    మీరు ఈ పట్టణంలో ఎంతోమందిని చంపారు; మీరు చంపిన శవాలతో పట్టణ వీధులు నిండిపోయాయి.

  2. యెహెజ్కేలు 11:7సుమారు క్రీ.పూ. 594

    “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు చంపి పట్టణంలో పడవేసిన వారి శవాలే మాంసం, ఈ పట్టణం ఒక కుండ అయితే నేను మిమ్మల్ని పట్టణంలో ఉండకుండా వెళ్లగొడతాను.

  3. యెహెజ్కేలు 11:8సుమారు క్రీ.పూ. 594

    మీరు ఖడ్గానికి భయపడుతున్నారు, కాబట్టి నేనే మీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. యెహెజ్కేలు 11:9సుమారు క్రీ.పూ. 594

    నేను మిమ్మల్ని పట్టణంలో నుండి వెళ్లగొట్టి విదేశీయుల చేతికి మిమ్మల్ని అప్పగించి మీకు శిక్ష విధిస్తాను.

  5. యెహెజ్కేలు 11:10సుమారు క్రీ.పూ. 594

    ఇశ్రాయేలు సరిహద్దుల లోపలే మీరు ఖడ్గంతో చంపబడేలా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  6. యెహెజ్కేలు 11:11సుమారు క్రీ.పూ. 594

    ఈ పట్టణం మీకు కుండగా ఉండదు, మీరు దానిలో మాంసం కారు. ఇశ్రాయేలు సరిహద్దులలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను.

  7. యెహెజ్కేలు 11:12సుమారు క్రీ.పూ. 594

    మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”

  8. యెహెజ్కేలు 11:13సుమారు క్రీ.పూ. 594

    నేను ఈ విధంగా ప్రవచిస్తుండగానే బెనాయా కుమారుడైన పెలట్యా చనిపోయాడు. అప్పుడు నేను సాష్టాంగపడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో ప్రభువైన యెహోవా! ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారిని కూడా పూర్తిగా నిర్మూలిస్తావా?” అని మొరపెట్టాను.

  9. యెహెజ్కేలు 11:14సుమారు క్రీ.పూ. 594

    అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  10. యెహెజ్కేలు 11:15సుమారు క్రీ.పూ. 594

    “మనుష్యకుమారుడా, మీ తోటి బందీల గురించి ఇతర ఇశ్రాయేలీయులందరి గురించి యెరూషలేము ప్రజలు, ‘వారు యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు; ఈ దేశం మా స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు.

  11. యెహెజ్కేలు 11:16సుమారు క్రీ.పూ. 594

    “కాబట్టి వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దూరంగా ఉన్న జాతుల మధ్యకు నేను వారిని పంపినా, దేశాల మధ్య వారిని చెదరగొట్టినా వారు వెళ్లిన దేశాల్లో కొంతకాలం వారికి నేను పరిశుద్ధాలయంగా ఉన్నాను.’

  12. యెహెజ్కేలు 11:17సుమారు క్రీ.పూ. 594

    “వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’

  13. యెహెజ్కేలు 11:18సుమారు క్రీ.పూ. 594

    “వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచిన అసహ్యమైన విగ్రహాలను హేయమైన వాటిని తొలగిస్తారు.

  14. యెహెజ్కేలు 11:19సుమారు క్రీ.పూ. 594

    నేను వారికి ఏక హృదయం ఇచ్చి వారిలో నూతన ఆత్మను ఉంచుతాను; నేను వారిలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను.

  15. యెహెజ్కేలు 11:20సుమారు క్రీ.పూ. 594

    అప్పుడు వారు నా శాసనాలను అనుసరించి నా కట్టడలను పాటించడంలో జాగ్రత్తగా ఉంటారు. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.

  16. యెహెజ్కేలు 11:21సుమారు క్రీ.పూ. 594

    అయితే తమ విగ్రహాలను అనుసరిస్తూ ఎప్పటిలాగే అసహ్యమైన పనులు చేసేవారికి వాటి ప్రతిఫలాన్ని వారి తల మీదికి రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

  17. యెహెజ్కేలు 11:22సుమారు క్రీ.పూ. 594

    అప్పుడు కెరూబులు రెక్కలు విప్పాయి, చక్రాలు వాటి ప్రక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపై ఉంది.

  18. యెహెజ్కేలు 11:23సుమారు క్రీ.పూ. 594

    యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకి వెళ్లి తూర్పున ఉన్న కొండ పైన ఆగింది.

  19. యెహెజ్కేలు 11:24సుమారు క్రీ.పూ. 594

    దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది. అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది.

  20. యెహెజ్కేలు 11:25సుమారు క్రీ.పూ. 594

    అప్పుడు యెహోవా నాకు చూపించిన వాటన్నిటిని బందీలుగా ఉన్నవారికి చెప్పాను.

  21. యెహెజ్కేలు 12:1సుమారు క్రీ.పూ. 594

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  22. యెహెజ్కేలు 12:2సుమారు క్రీ.పూ. 594

    “మనుష్యకుమారుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య జీవిస్తున్నావు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి చూసే కళ్లు ఉన్నా చూడరు, వినే చెవులు ఉన్నా వినరు.

  23. యెహెజ్కేలు 12:3సుమారు క్రీ.పూ. 594

    “కాబట్టి మనుష్యకుమారుడా, దేశాంతరం వెళ్లడానికి నీ వస్తువులను సర్దుకుని, పగటివేళ వారు చూస్తుండగానే బయలుదేరి నీవు ఉన్న చోటు నుండి వేరొక ప్రదేశానికి వెళ్లు. వారు తిరుగుబాటుదారులే అయినా బహుశా వారు అర్థం చేసుకోవచ్చు.

  24. యెహెజ్కేలు 12:4సుమారు క్రీ.పూ. 594

    పగలు వారు చూస్తుండగా దేశం నుండి వెళ్లిపోడానికి సర్దుకున్న నీ సామాన్లు బయటకు తీసుకురా. సాయంత్రం వారు చూస్తుండగా దేశం విడిచి వెళ్తున్నట్లుగా బయలుదేరి వెళ్లు.

  25. యెహెజ్కేలు 12:5సుమారు క్రీ.పూ. 594

    వారు చూస్తుండగా, గోడను త్రవ్వి దానిలో నుండి నీ వస్తువులను బయటకు తీయి.