కంటెంట్‌కు వెళ్లండి

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. 1 సమూయేలు 8:19సుమారు క్రీ.పూ. 1112

    అయితే ప్రజలు సమూయేలు మాటలు పట్టించుకోకుండా, “అలా ఏం కాదు! మాకు రాజు కావల్సిందే.

  2. 1 సమూయేలు 8:20సుమారు క్రీ.పూ. 1112

    ఇతర దేశాలకు ఉన్నట్లే మాకు రాజు ఉండాలి, అతడు మాకు న్యాయం చేస్తూ మాకు ముందు నడుస్తూ మా యుద్ధాలన్నిటిలో పోరాడతాడు” అన్నారు.

  3. 1 సమూయేలు 8:21సుమారు క్రీ.పూ. 1112

    సమూయేలు ప్రజలు చెప్పిన మాటలన్నిటిని విని వాటిని యెహోవాకు వినిపించాడు.

  4. 1 సమూయేలు 8:22సుమారు క్రీ.పూ. 1112

    అప్పుడు యెహోవా, “నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు” అన్నారు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీరందరూ మీ సొంత పట్టణాలకు వెళ్లండి” అని చెప్పాడు.

  5. 1 సమూయేలు 9:1సుమారు క్రీ.పూ. 1095

    ధనవంతుడై, పలుకుబడి కలిగిన ఒక బెన్యామీనీయుడు ఉండేవాడు. అతని పేరు కీషు, అతడు అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు, సెరోరు బెకోరతు కుమారుడు, బెకోరతు అఫియా కుమారుడు.

  6. 1 సమూయేలు 9:2సుమారు క్రీ.పూ. 1095

    కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు చాలా అందంగా ఉంటాడు. ఇశ్రాయేలీయులలో అతనిలాంటి అందమైన యువకులు లేరు, అతడు భుజాలు పైనుండి ఇతరులకంటే ఎత్తుగా ఉంటాడు.

  7. 1 సమూయేలు 9:3సుమారు క్రీ.పూ. 1095

    ఒక రోజు సౌలు తండ్రియైన కీషు యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు, కీషు సౌలును పిలిచి, “మన సేవకులలో ఒకరిని తీసుకెళ్లి గాడిదలను వెదకు” అని చెప్పాడు.

  8. 1 సమూయేలు 9:4సుమారు క్రీ.పూ. 1095

    అతడు వెళ్లి ఎఫ్రాయిం కొండ ప్రాంతమంతా తిరిగి షాలిషా దేశమంతా వెదికాడు కాని అవి కనబడలేదు. తర్వాత వారు షయలీము దేశం దాటి వెదికినా ఆ గాడిదలు దొరకలేదు. బెన్యామీనీయుల ప్రాంతంలో తిరిగి చూశారు కాని అవి దొరకలేదు.

  9. 1 సమూయేలు 9:5సుమారు క్రీ.పూ. 1095

    వారు సూఫు ప్రాంతానికి వచ్చినప్పుడు, “మనం వెనుకకు వెళ్దాం, లేకపోతే నా తండ్రి గాడిదల గురించి ఆలోచించడం మాని మన కోసం కంగారుపడతాడు” అని సౌలు తనతో వచ్చిన సేవకునితో అన్నాడు.

  10. 1 సమూయేలు 9:6సుమారు క్రీ.పూ. 1095

    అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.

  11. 1 సమూయేలు 9:7సుమారు క్రీ.పూ. 1095

    అందుకు సౌలు, “ఒకవేళ మనం అతని దగ్గరకు వెళ్తే అతనికి మనం ఏమివ్వగలం? మన సంచుల్లో ఉన్న ఆహారమంతా అయిపోయింది. ఆ దైవజనునికి కానుకగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు. మరెలా?” అని సేవకుడిని అడిగాడు.

  12. 1 సమూయేలు 9:8సుమారు క్రీ.పూ. 1095

    ఆ సేవకుడు మళ్ళీ సౌలుతో, “చూడండి, నా దగ్గర పావు షెకెల్ వెండి ఉంది. మనం వెళ్లవలసిన దారిని మనకు చెప్పడానికి దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.

  13. 1 సమూయేలు 9:9సుమారు క్రీ.పూ. 1095

    (గతంలో ఇశ్రాయేలీయులలో ఎవరైనా దేవుని దగ్గర ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే వారు, “మనం దీర్ఘదర్శి దగ్గరకు వెళ్దాం రండి” అని అనేవారు. ఇప్పుడు ప్రవక్తలని పిలిచేవారిని, ఒకప్పుడు దీర్ఘదర్శి అని పిలిచేవారు.)

  14. 1 సమూయేలు 9:10సుమారు క్రీ.పూ. 1095

    సౌలు తన సేవకునితో, “సరే, పద వెళ్దాం” అన్నాడు. వారు బయలుదేరి దైవజనుడున్న పట్టణానికి వెళ్లారు.

  15. 1 సమూయేలు 9:11సుమారు క్రీ.పూ. 1095

    వారు కొండ ఎక్కి ఆ పట్టణానికి వెళ్తుండగా, నీళ్లు తోడుకోడానికి వస్తున్న యువతులు ఎదురయ్యారు, అప్పుడు వారు, “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని వారిని అడిగారు.

  16. 1 సమూయేలు 9:12సుమారు క్రీ.పూ. 1095

    అందుకు వారు, “అతడు మీకు దగ్గరలోనే ఉన్నాడు. త్వరగా వెళ్లి కలవండి; ఎందుకంటే ఈ రోజు క్షేత్రంలో ప్రజల కోసం బలి అర్పించబడుతుంది, అందుకు ఈ రోజే మా ఊరికి వచ్చాడు.

  17. 1 సమూయేలు 9:13సుమారు క్రీ.పూ. 1095

    అతడు భోజనం చేయడానికి ఉన్నత స్థలానికి వెళ్లకముందే మీరు పట్టణంలోకి వెళ్లండి. అతడు వచ్చేవరకు ప్రజలు తినరు. అతడు బలిని దీవించిన తర్వాత ఆహ్వానించబడిన వారు తింటారు. మీరు ఇప్పుడే పైకి వెళ్లండి; ఈపాటికి మీరు అతన్ని కలుసుకోవల్సింది” అన్నారు.

  18. 1 సమూయేలు 9:14సుమారు క్రీ.పూ. 1095

    అప్పుడు వారు ఆ పట్టణం వరకు వెళ్లారు. వారు పట్టణంలోనికి వెళ్లబోతుండగా ఉన్నత స్థలానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురు వచ్చాడు.

  19. 1 సమూయేలు 9:15సుమారు క్రీ.పూ. 1095

    సౌలు రావడానికి ఒక రోజు ముందే యెహోవా సమూయేలుకు,

  20. 1 సమూయేలు 9:16సుమారు క్రీ.పూ. 1095

    “రేపు ఈ సమయానికి బెన్యామీను ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తాను. అతన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా అభిషేకించు; నా ప్రజల మొర నాకు విని వారివైపు చూశాను. అతడే వారిని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు” అని చెప్పారు.

  21. 1 సమూయేలు 9:17సుమారు క్రీ.పూ. 1095

    సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా అతనితో, “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి; ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని చెప్పారు.

  22. 1 సమూయేలు 9:18సుమారు క్రీ.పూ. 1095

    సౌలు గుమ్మం దగ్గర సమూయేలును కలుసుకొని, “దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడో దయచేసి నాకు చెప్పరా?” అని అడిగాడు.

  23. 1 సమూయేలు 9:19సుమారు క్రీ.పూ. 1095

    అందుకు సమూయేలు సౌలుతో, “నేనే దీర్ఘదర్శిని, ఉన్నత స్థలానికి నా కంటే ముందు వెళ్లండి, ఈ రోజు మీరు నాతో భోజనం చేయాలి. ఉదయాన నీ హృదయంలో ఉన్నదంతా నీకు చెప్పి నిన్ను పంపిస్తాను.

  24. 1 సమూయేలు 9:20సుమారు క్రీ.పూ. 1095

    మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదల గురించి బాధపడకు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయులు కోరుకుంటుంది నిన్ను నీ కుటుంబమంతటిని గాక, ఇంకెవరిని?” అన్నాడు.

  25. 1 సమూయేలు 9:21సుమారు క్రీ.పూ. 1095

    అందుకు సౌలు, “నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల్లోని చిన్న గోత్రం కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు వంశాలన్నిటిలో నా వంశం చిన్నది కాదా? నాతో ఇలా ఎందుకు అంటున్నారు?” అన్నాడు.