- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 6:7సుమారు క్రీ.పూ. 1140
“కాబట్టి, మీరు క్రొత్త బండి ఒకటి తయారుచేయించి, ఇంతవరకు కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి బండికి కట్టాలి. కాని వాటి దూడలను వాటి దగ్గర నుండి దొడ్డికి తోలివేయాలి.
- 1 సమూయేలు 6:8సుమారు క్రీ.పూ. 1140
యెహోవా మందసాన్ని బండిపైన ఉంచి, దాని ప్రక్కన అపరాధ పరిహారార్థబలిగా మీరు పంపుతున్న బంగారు వస్తువులు ఉన్న పెట్టెను పెట్టండి. దాని మార్గాన దాన్ని పంపండి,
- 1 సమూయేలు 6:9సుమారు క్రీ.పూ. 1140
కాని దానిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. అది తన సొంత ప్రాంతమైన బేత్-షెమెషు వైపుకు వెళ్తే యెహోవా మన మీదికి ఈ గొప్ప విపత్తు తెచ్చారని, అలా జరుగకపోతే మన మీదికి వచ్చిన విపత్తు ఆయన హస్తం వలన కాదని ఇది అనుకోకుండ మనకు జరిగిందని మనకు తెలుస్తుంది.”
- 1 సమూయేలు 6:10సుమారు క్రీ.పూ. 1140
కాబట్టి వారు అలాగే చేశారు. రెండు పాడి ఆవులను తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను దొడ్డికి పంపి,
- 1 సమూయేలు 6:11సుమారు క్రీ.పూ. 1140
యెహోవా మందసాన్ని దానితో పాటు బంగారు ఎలుకలు, గడ్డల రూపాలు ఉన్న పెట్టెను వారు బండిపైన పెట్టారు.
- 1 సమూయేలు 6:12సుమారు క్రీ.పూ. 1140
అప్పుడు ఆ ఆవులు దారిలో తిన్నగా వెళ్తూ, అరుస్తూ తిన్నగా బేత్-షెమెషు దారిలో నడిచాయి; అవి కుడికి గాని ఎడమకు గాని తిరగలేదు. ఫిలిష్తీయుల పాలకులు బేత్-షెమెషు సరిహద్దు వరకు వాటిని వెంబడిస్తూ వెళ్లారు.
- 1 సమూయేలు 6:13సుమారు క్రీ.పూ. 1140
బేత్-షెమెషు ప్రజలు లోయలో తమ గోధుమపంటను కోస్తున్నారు. వారు కళ్ళెత్తి చూసినప్పుడు మందసం కనబడింది, వారు దాన్ని చూసి సంతోషించారు.
- 1 సమూయేలు 6:14సుమారు క్రీ.పూ. 1140
ఆ బండి బేత్-షెమెషుకు చెందిన యెహోషువ పొలంలోనికి వచ్చి, అక్కడ ఉన్న ఒక పెద్ద బండ ప్రక్కన ఆగింది. ప్రజలు ఆ బండి కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.
- 1 సమూయేలు 6:15సుమారు క్రీ.పూ. 1140
లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను దించి వాటిని ఆ పెద్ద బండ మీద పెట్టారు. ఆ రోజే బేత్-షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు అర్పించి, బలులు వధించారు.
- 1 సమూయేలు 6:16సుమారు క్రీ.పూ. 1140
అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులు అదంతా చూసి ఆ రోజే ఎక్రోనుకు తిరిగి వెళ్లిపోయారు.
- 1 సమూయేలు 6:17సుమారు క్రీ.పూ. 1140
ఫిలిష్తీయులు యెహోవాకు అపరాధపరిహార అర్పణగా పంపిన బంగారు గడ్డలు అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులకు ఒక్కొక్కటి.
- 1 సమూయేలు 6:18సుమారు క్రీ.పూ. 1140
బంగారు ఎలుకల సంఖ్య అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులకు చెందిన కోటగోడలు గల పట్టణాలు చుట్టుప్రక్కల గ్రామాల లెక్క ప్రకారం ఉంది. బేత్-షెమెషులోని యెహోషువ పొలంలో లేవీయులు యెహోవా మందసాన్ని పెట్టిన పెద్ద బండ నేటికీ సాక్షిగా ఉంది.
- 1 సమూయేలు 6:19సుమారు క్రీ.పూ. 1140
బేత్-షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరిచి చూసిన కారణంగా దేవుడు వారిలో డెబ్బై మందిని హతం చేశారు. యెహోవా వారిని బలంగా దెబ్బ కొట్టడం వలన ప్రజలు ఎంతో దుఃఖించారు.
- 1 సమూయేలు 6:20సుమారు క్రీ.పూ. 1140
అప్పుడు బేత్-షెమెషు ప్రజలు, “ఈ పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడినుండి మందసం ఎవరి దగ్గరకు వెళ్లాలి?” అని అడిగారు.
- 1 సమూయేలు 6:21సుమారు క్రీ.పూ. 1140
తర్వాత వారు కిర్యత్-యారీము ప్రజల దగ్గరకు దూతలను పంపించి, “ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి ఇచ్చారు. వచ్చి దానిని మీ పట్టణానికి తీసుకెళ్లండి” అని కబురు పంపారు.
అప్పుడు కిర్యత్-యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకెళ్లారు. వారు దానిని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి తీసుకువచ్చి యెహోవా మందసానికి కాపాడడానికి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు.
యెహోవా మందసం కిర్యత్-యారీములో ఇరవై సంవత్సరాలు ఉంది. ఇశ్రాయేలు ప్రజలంతా మళ్ళీ యెహోవా వైపు తిరిగారు.
- 1 సమూయేలు 7:3సుమారు క్రీ.పూ. 1120
కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీ పూర్ణహృదయంతో యెహోవా దగ్గరకు మీరు తిరిగి వస్తే, ఇతర దేవుళ్ళను, అష్తారోతు విగ్రహాలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలతో యెహోవా వైపు మీ హృదయాలను త్రిప్పి ఆయనను మాత్రమే సేవించండి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు” అన్నాడు.
- 1 సమూయేలు 7:4సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు ఇశ్రాయేలీయులు బయలు ప్రతిమలను, అష్తారోతు విగ్రహాలను తీసివేసి కేవలం యెహోవాను మాత్రమే సేవించారు.
- 1 సమూయేలు 7:5సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు సమూయేలు, “ఇశ్రాయేలీయులందరిని మిస్పా దగ్గర సమకూర్చండి, నేను మీ అందరి పక్షంగా యెహోవాకు విజ్ఞాపన చేస్తాను” అన్నాడు.
- 1 సమూయేలు 7:6సుమారు క్రీ.పూ. 1120
వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు.
- 1 సమూయేలు 7:7సుమారు క్రీ.పూ. 1120
ఇశ్రాయేలీయులు మిస్పాకు చేరుకున్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు, ఫిలిష్తీయుల పాలకులు వారి మీద దాడి చేయడానికి వచ్చారు. ఇది విన్న ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు భయపడ్డారు.
- 1 సమూయేలు 7:8సుమారు క్రీ.పూ. 1120
వారు సమూయేలుతో, “మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించేలా మాకోసం ఆయనకు ప్రార్థన చేయడం మానవద్దు” అని మనవి చేశారు.
- 1 సమూయేలు 7:9సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు సమూయేలు పాలు త్రాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సంపూర్ణమైన దహనబలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతనికి జవాబిచ్చారు.
- 1 సమూయేలు 7:10సుమారు క్రీ.పూ. 1120
సమూయేలు దహనబలి అర్పిస్తుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు. అయితే ఆ రోజు యెహోవా ఫిలిష్తీయుల మీద గొప్ప ఉరుములు ఉరిమించి వారిని చెదరగొట్టడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.