- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 3:12సుమారు క్రీ.పూ. 1165
ఆ రోజున ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా మొదటి నుండి చివరి వరకు వారి మీదికి రప్పిస్తాను.
- 1 సమూయేలు 3:13సుమారు క్రీ.పూ. 1165
ఎందుకంటే అతనికి తెలిసిన పాపం కారణంగా నేను అతని కుటుంబానికి ఎప్పటికీ తీర్పు తీరుస్తానని అతనితో చెప్పాను; అతని కుమారులు దేవున్ని దూషించారు, అతడు వారిని అరికట్టలేక పోయాడు.
- 1 సమూయేలు 3:14సుమారు క్రీ.పూ. 1165
కాబట్టి, ‘ఏలీ ఇంటివారి దోషానికి బలుల వలన గాని, అర్పణల వలన గాని ఎప్పటికీ ప్రాయశ్చిత్తం జరుగదు’ అని ఏలీ ఇంటివారికి నేను ప్రమాణం చేశాను.”
- 1 సమూయేలు 3:15సుమారు క్రీ.పూ. 1165
తర్వాత సమూయేలు ఉదయమయ్యే వరకు పడుకుని లేచి, యెహోవా మందిర తలుపులను తెరిచాడు. అయితే తనకు వచ్చిన దర్శనం గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు.
- 1 సమూయేలు 3:16సుమారు క్రీ.పూ. 1165
కాని ఏలీ సమూయేలును, “సమూయేలూ, నా కుమారుడా” అని పిలిచాడు. అందుకు సమూయేలు, “నేనిక్కడే ఉన్నాను” అన్నాడు.
- 1 సమూయేలు 3:17సుమారు క్రీ.పూ. 1165
అప్పుడు ఏలీ, “యెహోవా నీతో ఏమి చెప్పారు? వాటిలో ఏదీ నా దగ్గర దాచవద్దు. ఆయన నీతో చెప్పిన సంగతుల్లో ఏదైనా నీవు దాచిపెడితే దేవుడు నిన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు.
- 1 సమూయేలు 3:18సుమారు క్రీ.పూ. 1165
కాబట్టి సమూయేలు ఏ విషయం దాచిపెట్టకుండా అంతా అతనితో చెప్పాడు. అది విని ఏలీ, “అది చెప్పింది యెహోవాయే; ఆయన దృష్టికి ఏది మంచిదో ఆయన అదే చేస్తారు” అన్నాడు.
- 1 సమూయేలు 3:19సుమారు క్రీ.పూ. 1165
సమూయేలు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా, యెహోవా అతనికి తోడుగా ఉండి, సమూయేలు మాటల్లో ఏదీ నేల మీద వ్యర్థంగా పడనివ్వలేదు.
- 1 సమూయేలు 3:20సుమారు క్రీ.పూ. 1165
కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలీయులందరు గుర్తించారు.
- 1 సమూయేలు 3:21సుమారు క్రీ.పూ. 1165
యెహోవా మరలా షిలోహులో దర్శనమివ్వడం ప్రారంభించి, అక్కడ ఆయన తన వాక్కు ద్వారా సమూయేలుకు ప్రత్యక్షపరుచుకున్నారు.
- 1 సమూయేలు 4:1సుమారు క్రీ.పూ. 1141
సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికి వ్యాపించింది. ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇశ్రాయేలీయులు ఎబెనెజెరులో, ఫిలిష్తీయులు ఆఫెకులో శిబిరం ఏర్పరచుకున్నారు.
- 1 సమూయేలు 4:2సుమారు క్రీ.పూ. 1141
ఇశ్రాయేలీయుల మీదికి వెళ్లడానికి ఫిలిష్తీయులు తమ బలగాలను మోహరించారు. యుద్ధం ముమ్మరమైనప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయి యుద్ధభూమిలోనే సుమారు నాలుగు వేలమంది మరణించారు.
- 1 సమూయేలు 4:3సుమారు క్రీ.పూ. 1141
సైనికులు శిబిరం దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల పెద్దలు, “ఈ రోజు యెహోవా ఫిలిష్తీయుల ముందు ఎందుకు మనలను ఓడిపోయేలా చేశారు? మనం యెహోవా నిబంధన మందసాన్ని షిలోహులో నుండి తీసుకువద్దాం, అప్పుడు ఆయన మనతో వెళ్లి మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షిస్తారు” అని అన్నారు.
- 1 సమూయేలు 4:4సుమారు క్రీ.పూ. 1141
కాబట్టి ప్రజలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడినుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాల యెహోవా యొక్క నిబంధన మందసాన్ని తెప్పించారు. దేవుని నిబంధన మందసంతో పాటు ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు అక్కడే ఉన్నారు.
- 1 సమూయేలు 4:5సుమారు క్రీ.పూ. 1141
యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు.
- 1 సమూయేలు 4:6సుమారు క్రీ.పూ. 1141
ఆ కేకల ధ్వని ఫిలిష్తీయులు విని, “హెబ్రీయుల శిబిరంలో ఆ పెద్ద కేకలు ఏంటి?” అనుకున్నారు. యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి వచ్చిందని వారు తెలుసుకొని,
- 1 సమూయేలు 4:7సుమారు క్రీ.పూ. 1141
ఫిలిష్తీయులు భయపడి, “ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.
- 1 సమూయేలు 4:8సుమారు క్రీ.పూ. 1141
మనకు శ్రమ! బలాఢ్యుడైన ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో అనేక రకాల తెగుళ్ళతో ఈజిప్టువారిని నాశనం చేసిన దేవుడు ఈయనే.
- 1 సమూయేలు 4:9సుమారు క్రీ.పూ. 1141
ఫిలిష్తీయులారా, ధైర్యంగా ఉండండి! మగవారిగా ఉండండి, లేదా వారు మీకు బానిసలైనట్టు మీరు హెబ్రీయులకు బానిసలు కాకుండ మగవారిగా బలాఢ్యులై పోరాడండి!” అని చెప్పుకొన్నారు.
- 1 సమూయేలు 4:10సుమారు క్రీ.పూ. 1141
కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు.
- 1 సమూయేలు 4:11సుమారు క్రీ.పూ. 1141
దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.
- 1 సమూయేలు 4:12సుమారు క్రీ.పూ. 1141
ఆ రోజే ఒక బెన్యామీనీయుడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతో తలమీద దుమ్ముతో షిలోహులోనికి వచ్చాడు.
- 1 సమూయేలు 4:13సుమారు క్రీ.పూ. 1141
అతడు వచ్చేటప్పటికి, ఏలీ మార్గం ప్రక్కన తన కుర్చీలో చూస్తూ కూర్చున్నాడు, ఎందుకంటే అతని హృదయం దేవుని మందసాన్ని గురించిన భయంతో నిండింది. ఆ వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించి జరిగిన విషయం చెప్పగానే పట్టణమంతా కేకలు వేసింది.
- 1 సమూయేలు 4:14సుమారు క్రీ.పూ. 1141
ఏలీ ఆ కేకలు విని, “ఈ కేకలకు అర్థమేంటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి వెంటనే ఏలీ దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు.
- 1 సమూయేలు 4:15సుమారు క్రీ.పూ. 1141
ఏలీకి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు, అతనికి చూపు మందగించి చూడలేకపోయేవాడు.