కంటెంట్‌కు వెళ్లండి

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. 1 సమూయేలు 1:26సుమారు క్రీ.పూ. 1165

    ఆమె అతనితో, “నా ప్రభువా, నన్ను క్షమించండి. మీ జీవం తోడు ఇక్కడ మీ ప్రక్కన నిలబడి యెహోవాకు ప్రార్థించిన స్త్రీని నేనే.

  2. 1 సమూయేలు 1:27సుమారు క్రీ.పూ. 1165

    నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు.

  3. 1 సమూయేలు 1:28సుమారు క్రీ.పూ. 1165

    కాబట్టి ఇప్పుడు నేను ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వాడు జీవించినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు” అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడే యెహోవాను ఆరాధించాడు.

  4. 1 సమూయేలు 2:1సుమారు క్రీ.పూ. 1165

    హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది: “నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది; యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది. నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది, మీ విడుదలలో నాకు ఆనందము.

  5. 1 సమూయేలు 2:2సుమారు క్రీ.పూ. 1165

    “యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు; మీరు తప్ప మరి ఎవరు లేరు; మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.

  6. 1 సమూయేలు 2:3సుమారు క్రీ.పూ. 1165

    “అంత గర్వంగా మాట్లాడకండి మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి, ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు.

  7. 1 సమూయేలు 2:4సుమారు క్రీ.పూ. 1165

    “శూరుల విల్లులు విరిగిపోయాయి, కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు.

  8. 1 సమూయేలు 2:5సుమారు క్రీ.పూ. 1165

    తృప్తిగా భోజనం చేసినవారు ఆహారం కోసం కూలికి వెళ్తారు, కాని ఆకలితో ఉన్నవారు ఇక ఆకలితో ఉండరు. గొడ్రాలిగా ఉన్న స్త్రీ ఏడుగురు పిల్లలను కన్నది, కాని అనేకమంది పిల్లలను కన్న స్త్రీ కృశించిపోతుంది.

  9. 1 సమూయేలు 2:6సుమారు క్రీ.పూ. 1165

    “మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే; పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే.

  10. 1 సమూయేలు 2:7సుమారు క్రీ.పూ. 1165

    పేదరికాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసేది యెహోవాయే; తగ్గించేది హెచ్చించేది ఆయనే.

  11. 1 సమూయేలు 2:8సుమారు క్రీ.పూ. 1165

    దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు.

  12. 1 సమూయేలు 2:9సుమారు క్రీ.పూ. 1165

    ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు, అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు. “బలం వలన ఎవరూ గెలవలేరు;

  13. 1 సమూయేలు 2:10సుమారు క్రీ.పూ. 1165

    యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు. పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు; భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు. “ఆయన తన రాజుకు బలాన్నిస్తారు తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు.”

  14. 1 సమూయేలు 2:11సుమారు క్రీ.పూ. 1165

    తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు, కాని ఆ బాలుడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండిపోయాడు.

  15. 1 సమూయేలు 2:12సుమారు క్రీ.పూ. 1165

    ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు.

  16. 1 సమూయేలు 2:13సుమారు క్రీ.పూ. 1165

    ప్రజల విషయంలో యాజకులు చేస్తూ వచ్చిన పని ఏంటంటే, ఎవరైనా బలి అర్పిస్తే, దాని మాంసం ఉడుకుతుండగా యాజకుని సేవకులు మూడు ముళ్ళ కొంకి గరిటెను తీసుకువచ్చి,

  17. 1 సమూయేలు 2:14సుమారు క్రీ.పూ. 1165

    పెనంలో గాని కడాయిలోగాని పాత్రలోగాని కుండలోగాని దానిని గుచ్చినప్పుడు ఆ కొంకితో పాటు బయటకు వచ్చిన మాంసమంతా యాజకుడు తన కోసం తీసుకుంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరికి వీరు ఇలాగే చేస్తూ వచ్చారు.

  18. 1 సమూయేలు 2:15సుమారు క్రీ.పూ. 1165

    అయితే క్రొవ్వును దహించకముందే యాజకుని సేవకుడు వచ్చి బలి అర్పించిన వారితో, “యాజకునికి కాల్చడానికి కొంత మాంసం ఇవ్వు; ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు పచ్చి మాంసమే కావాలి” అని చెప్పేవాడు.

  19. 1 సమూయేలు 2:16సుమారు క్రీ.పూ. 1165

    అయితే వారు అతనితో, “మొదట క్రొవ్వును దహించనివ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు” అని చెప్తే ఆ సేవకుడు, “అలా కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి; నీవు ఇవ్వకపోతే నేనే బలవంతంగా తీసుకుంటాను” అని అనేవాడు.

  20. 1 సమూయేలు 2:17సుమారు క్రీ.పూ. 1165

    ఆ యువకుల ఈ పాపం యెహోవా దృష్టిలో చాలా ఘోరమైనది, ఎందుకంటే వారిని బట్టి ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించడానికి అసహ్యించుకున్నారు.

  21. 1 సమూయేలు 2:18సుమారు క్రీ.పూ. 1165

    అయితే బాలుడైన సమూయేలు నారతో చేసిన ఏఫోదు ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు.

  22. 1 సమూయేలు 2:19సుమారు క్రీ.పూ. 1165

    ప్రతి సంవత్సరం అతని తల్లి తన భర్తతో కలిసి వార్షిక బలి అర్పించడానికి వెళ్లినప్పుడు అతనికి ఒక చిన్న వస్త్రాన్ని తయారుచేసి తీసుకెళ్లేది.

  23. 1 సమూయేలు 2:20సుమారు క్రీ.పూ. 1165

    అప్పుడు ఏలీ, ఎల్కానాను, అతని భార్యను, “ఈ స్త్రీ యెహోవాకు ప్రతిష్ఠించిన బిడ్డ స్థానంలో యెహోవా ఈమె ద్వారా మీకు పిల్లలను ప్రసాదించుగాక” అని అంటూ దీవించాడు.

  24. 1 సమూయేలు 2:21సుమారు క్రీ.పూ. 1165

    యెహోవా హన్నా మీద దయ చూపించాడు; ఆమె ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను కన్నది. అదే సమయంలో, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదిగాడు.

  25. 1 సమూయేలు 2:22సుమారు క్రీ.పూ. 1165

    ఇక చాలా ముసలివాడై ఏలీ, ఇశ్రాయేలీయులందరి పట్ల తన కుమారులు చేస్తున్న వాటి గురించి, వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారనే విషయాన్ని గురించి విన్నాడు.