- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 9:22సుమారు క్రీ.పూ. 1095
అప్పుడు సమూయేలు సౌలును అతని సేవకుడిని భోజనశాలలోనికి తీసుకెళ్లి, ప్రత్యేకంగా పిలువబడ్డ సుమారు ముప్పైమంది ఉన్న ప్రధాన స్థలంలో వారిని కూర్చోబెట్టాడు.
- 1 సమూయేలు 9:23సుమారు క్రీ.పూ. 1095
సమూయేలు వంటమనిషితో, “నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన మాంసపు భాగాన్ని తీసుకురా” అని చెప్పాడు.
- 1 సమూయేలు 9:24సుమారు క్రీ.పూ. 1095
వంటమనిషి మాంసంతో ఉన్న తొడను తెచ్చి సౌలు ముందు పెట్టాడు. అప్పుడు సమూయేలు సౌలుతో, “ఇదిగో నీకోసం దాచిపెట్టింది, ఇది తిను ఎందుకంటే ‘నేను అతిథులను ఆహ్వానించాను’ అని వంటమనిషితో చెప్పి దీన్ని నీ కోసం తీసి ఉంచమన్నాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
- 1 సమూయేలు 9:25సుమారు క్రీ.పూ. 1095
వారు ఉన్నత స్థలం నుండి పట్టణంలోకి దిగి వచ్చినప్పుడు సమూయేలు తన ఇంటిపైన సౌలుతో మాట్లాడాడు.
- 1 సమూయేలు 9:26సుమారు క్రీ.పూ. 1095
తర్వాతి రోజు ఉదయమే వారు లేచిన తర్వాత సమూయేలు సౌలును పిలిచి, “నేను నీ దారిన నిన్ను పంపిస్తాను, సిద్ధపడు” అని చెప్పాడు. సౌలు సిద్ధమవగానే, అతడు సమూయేలు కలిసి బయలుదేరారు.
- 1 సమూయేలు 9:27సుమారు క్రీ.పూ. 1095
వారు పట్టణ శివారుకు వెళ్తుండగా సమూయేలు సౌలుతో, “దాసుని మనకంటే ముందు వెళ్లమను” అని చెప్పగానే ఆ దాసుడు వెళ్లిపోయాడు. అప్పుడతడు సౌలుతో, “నీవిక్కడే ఉండు, దేవుడు నీతో చెప్పమని నాకు చెప్పింది నీకు చెప్తాను” అన్నాడు.
- 1 సమూయేలు 10:1సుమారు క్రీ.పూ. 1095
అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు.
- 1 సమూయేలు 10:2సుమారు క్రీ.పూ. 1095
ఈ రోజు నీవు నా దగ్గరి నుండి వెళ్లిన తర్వాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనబడతారు. వారు నీతో, ‘నీవు వెదకుతున్న గాడిదలు దొరికాయి. నీ తండ్రి వాటి గురించి ఆలోచించడం మాని నీకోసం కంగారు పడుతూ, “నా కుమారుని గురించి నేనేమి చేయాలి?” అని అడుగుతున్నాడు’ అని చెప్తారు.
- 1 సమూయేలు 10:3సుమారు క్రీ.పూ. 1095
“తర్వాత నీవు అక్కడినుండి తాబోరు సింధూర వృక్షం వరకు వెళ్తావు. అక్కడ బేతేలులో దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ముగ్గురు మనుష్యులు నీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను, మరొకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ఒక్క ద్రాక్షరసపు తిత్తిని మోస్తుంటారు.
- 1 సమూయేలు 10:4సుమారు క్రీ.పూ. 1095
వారు నీ క్షేమసమాచారాన్ని తెలుసుకుని రెండు రొట్టెలు ఇస్తారు, నీవు వాటిని తీసుకోవాలి.
- 1 సమూయేలు 10:5సుమారు క్రీ.పూ. 1095
“ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు.
- 1 సమూయేలు 10:6సుమారు క్రీ.పూ. 1095
యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చినప్పడు, నీవు కూడా వారితో కలిసి ప్రవచిస్తావు; నీవు క్రొత్త వ్యక్తిగా మారతావు.
- 1 సమూయేలు 10:7సుమారు క్రీ.పూ. 1095
ఈ సూచనలు నెరవేరిన తర్వాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటారు.
- 1 సమూయేలు 10:8సుమారు క్రీ.పూ. 1095
“నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్లు. దహనబలులు సమాధానబలులు అర్పించడానికి నేను తప్పక నీ దగ్గరకు వస్తాను. అయితే నేను వచ్చి నీవు ఏం చేయాలో నీకు చెప్పే వరకు, నీవు ఏడు రోజులు అక్కడే వేచి ఉండాలి.”
- 1 సమూయేలు 10:9సుమారు క్రీ.పూ. 1095
సౌలు సమూయేలు దగ్గరి నుండి వెళ్లడానికి వెనుకకు తిరగ్గానే దేవుడు సౌలు హృదయాన్ని మార్చారు, ఆ రోజే ఈ సూచనలన్నీ నెరవేరాయి.
- 1 సమూయేలు 10:10సుమారు క్రీ.పూ. 1095
అతడు, అతని సేవకుడు గిబియా దగ్గరకు చేరుకున్నప్పుడు, ప్రవక్తల ఊరేగింపు అతనికి ఎదురైంది; దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చి, అతడు వారితో కలిసి ప్రవచించాడు.
- 1 సమూయేలు 10:11సుమారు క్రీ.పూ. 1095
గతంలో అతన్ని తెలిసిన వారందరు అతడు ప్రవక్తలతో కలిసి ప్రవచించడం చూసి, “కీషు కుమారునికి ఏమైంది? సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
- 1 సమూయేలు 10:12సుమారు క్రీ.పూ. 1095
అక్కడ నివసించే ఒక వ్యక్తి, “వారి నాయకుడు ఎవరు?” అన్నాడు. అందువల్ల, “సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే సామెత పుట్టింది.
- 1 సమూయేలు 10:13సుమారు క్రీ.పూ. 1095
సౌలు ప్రవచించడం ఆపిన తర్వాత అతడు ఉన్నత స్థలానికి వెళ్లాడు.
- 1 సమూయేలు 10:14సుమారు క్రీ.పూ. 1095
సౌలు చిన్నాన్న అతన్ని అతని సేవకుడిని చూసి, “మీరు ఎక్కడికి వెళ్లారు?” అని అడిగాడు. అందుకతడు, “గాడిదలను వెదకడానికి వెళ్లాం, అవి కనబడలేదని సమూయేలు ప్రవక్త దగ్గరకు వెళ్లాం” అని చెప్పాడు.
- 1 సమూయేలు 10:15సుమారు క్రీ.పూ. 1095
అందుకు సౌలు చిన్నాన్న, “సమూయేలు నీతో ఏమి చెప్పాడో నాతో చెప్పు” అని అన్నాడు.
- 1 సమూయేలు 10:16సుమారు క్రీ.పూ. 1095
సౌలు, “గాడిదలు దొరికాయని అతడు మాకు హామీ ఇచ్చాడు” అని తన చిన్నాన్నకు చెప్పాడు. అయితే రాజ్యాధికారం గురించి సమూయేలు చెప్పిన విషయాన్ని అతడు తన మామకు చెప్పలేదు.
- 1 సమూయేలు 10:17సుమారు క్రీ.పూ. 1095
తర్వాత సమూయేలు మిస్పాలో యెహోవా దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలను పిలిపించి,
- 1 సమూయేలు 10:18సుమారు క్రీ.పూ. 1095
వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’
- 1 సమూయేలు 10:19సుమారు క్రీ.పూ. 1095
అయితే మీ కష్టాలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు తిరస్కరించారు. ‘మామీద రాజుగా ఒకరిని నియమించు’ అని ఆయనను అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల ప్రకారం మీరు యెహోవా సన్నిధికి రావాలి.”