- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- హెబ్రీయులకు 5:1సుమారు క్రీ.శ. 64
ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఏర్పరచబడి, దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజల ప్రతినిధిగా పాపపరిహార బలులను కానుకలను అర్పించడానికి నియమించబడ్డాడు.
- హెబ్రీయులకు 5:2సుమారు క్రీ.శ. 64
తాను కూడా బలహీనతలకు గురైనవానిగా ఉన్నా, అవివేకులైన వారిని దారి తప్పిపోతున్న వారిని దయతో నడిపించగల సమర్ధుడు.
- హెబ్రీయులకు 5:3సుమారు క్రీ.శ. 64
ఈ కారణంగా, అతడు తన పాపాల కోసం అలాగే ప్రజల పాపాల కోసం బలి అర్పించాల్సి ఉంది.
- హెబ్రీయులకు 5:4సుమారు క్రీ.శ. 64
ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు.
- హెబ్రీయులకు 5:5సుమారు క్రీ.శ. 64
అదేరీతిగా, క్రీస్తు కూడా ప్రధాన యాజకునిగా అవ్వడానికి తనంతట తానే మహిమను తీసుకోలేదు. అయితే దేవుడే ఆయనతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.”
- హెబ్రీయులకు 5:6సుమారు క్రీ.శ. 64
మరొక చోట ఆయన ఇలా అన్నారు, “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు.”
- హెబ్రీయులకు 5:7సుమారు క్రీ.శ. 64
యేసు భూమి మీద జీవించిన రోజుల్లో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీటితో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.
- హెబ్రీయులకు 5:8సుమారు క్రీ.శ. 64
ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు,
- హెబ్రీయులకు 5:9సుమారు క్రీ.శ. 64
ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు.
- హెబ్రీయులకు 5:10సుమారు క్రీ.శ. 64
మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకునిగా దేవుని చేత నియమింపబడ్డారు.
- హెబ్రీయులకు 5:11సుమారు క్రీ.శ. 64
దీనిని గురించి మేము చెప్పాల్సింది చాలా ఉంది కాని, గ్రహించడానికి మీరు ఏమాత్రం ప్రయత్నించడం లేదు కాబట్టి మీకు వివరించడం కష్టము.
- హెబ్రీయులకు 5:12సుమారు క్రీ.శ. 64
నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరము.
- హెబ్రీయులకు 5:13సుమారు క్రీ.శ. 64
పాలు త్రాగుతూ జీవించేవారు ఇంకా శిశువుగానే ఉన్నారు, కాబట్టి నీతిని గురించిన బోధతో పరిచయం లేదు.
- హెబ్రీయులకు 5:14సుమారు క్రీ.శ. 64
అయితే బలమైన ఆహారం పరిణతి చెందిన వారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే శిక్షణ పొందుకున్నవారికి.
- హెబ్రీయులకు 6:1సుమారు క్రీ.శ. 64
అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం,
- హెబ్రీయులకు 6:2సుమారు క్రీ.శ. 64
శుద్ధీకరణ ఆచారాలు, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్య తీర్పు గురించిన మళ్ళీ ఉపదేశం అవసరం లేదు.
- హెబ్రీయులకు 6:3సుమారు క్రీ.శ. 64
దేవుడు అనుమతిస్తే, మనం అలా చేద్దాము.
- హెబ్రీయులకు 6:4సుమారు క్రీ.శ. 64
ఒకసారి వెలిగించబడి, పరలోకసంబంధమైన వరాలను అనుభవించినవారు తెలుసుకొని, పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులై,
- హెబ్రీయులకు 6:5సుమారు క్రీ.శ. 64
దేవుని వాక్యం యొక్క అనుగ్రహాన్ని, భవిష్యత్కాలాల శక్తుల ప్రభావాలను రుచి చూసినప్పటికి,
- హెబ్రీయులకు 6:6సుమారు క్రీ.శ. 64
తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాపం వైపుకు నడిపించడం అసాధ్యము. అలాంటివారు తమ నాశనానికే దేవుని కుమారుని మళ్ళీ సిలువవేస్తూ, ఆయనను బహిరంగంగా అవమానానికి గురిచేస్తున్నారు.
- హెబ్రీయులకు 6:7సుమారు క్రీ.శ. 64
భూమి తనపై తరచుగా కురిసే వర్షపు నీటిని త్రాగి, దానిపై వ్యవసాయం చేసేవారికి ప్రయోజనకరమైన పంటను ఇస్తుండగా పండించినవారు దాన్ని దేవుని దీవెనగా పొందుతున్నారు.
- హెబ్రీయులకు 6:8సుమారు క్రీ.శ. 64
అయితే ముళ్ళపొదలను కలుపు మొక్కలను పండించే భూమి విలువలేనిదై శాపానికి గురి అవుతుంది ఆ తర్వాత చివరిలో అది కాల్చివేయబడుతుంది.
- హెబ్రీయులకు 6:9సుమారు క్రీ.శ. 64
అయితే ప్రియమైన వారలారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికి, మీ రక్షణ గురించి మంచి సంగతులు ఉన్నాయని మేము నిశ్చయంగా ఉన్నాము.
- హెబ్రీయులకు 6:10సుమారు క్రీ.శ. 64
దేవుడు అన్యాయస్థుడు కాడు; ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రజలకు మీరు చేసిన చేస్తున్న సహాయాన్ని మరచిపోయేవాడు కాడు.
- హెబ్రీయులకు 6:11సుమారు క్రీ.శ. 64
మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగి ఉన్న నిరీక్షణ సంపూర్ణంగా నెరవేరేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాము.