కంటెంట్‌కు వెళ్లండి

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 46:7సుమారు క్రీ.పూ. 1706

    యాకోబు తనతో తన కుమారులను, మనవళ్లను, కుమార్తెలను, మనవరాళ్లను, తన సంతానమంతటిని ఈజిప్టుకు తీసుకువచ్చాడు.

  2. ఆదికాండము 46:8సుమారు క్రీ.పూ. 1706

    ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల (యాకోబు అతని సంతానం) పేర్లు: రూబేను, యాకోబు యొక్క మొదటి కుమారుడు.

  3. ఆదికాండము 46:9సుమారు క్రీ.పూ. 1706

    రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

  4. ఆదికాండము 46:10సుమారు క్రీ.పూ. 1706

    షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీ యొక్క కుమారుడైన షావూలు.

  5. ఆదికాండము 46:11సుమారు క్రీ.పూ. 1706

    లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.

  6. ఆదికాండము 46:12సుమారు క్రీ.పూ. 1706

    యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (కాని ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.

  7. ఆదికాండము 46:13సుమారు క్రీ.పూ. 1706

    ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యోబు, షిమ్రోను.

  8. ఆదికాండము 46:14సుమారు క్రీ.పూ. 1706

    జెబూలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.

  9. ఆదికాండము 46:15సుమారు క్రీ.పూ. 1706

    వీరు పద్దనరాములో లేయాకు యాకోబుకు పుట్టిన కుమారులు, దీనా వారి కుమార్తె. కుమారులు, కుమార్తెలు కలిసి వీరంతా ముప్పై ముగ్గురు.

  10. ఆదికాండము 46:16సుమారు క్రీ.పూ. 1706

    గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోది, అరేలీ.

  11. ఆదికాండము 46:17సుమారు క్రీ.పూ. 1706

    ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వారి సోదరి. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.

  12. ఆదికాండము 46:18సుమారు క్రీ.పూ. 1706

    వీరు లాబాను తన కుమార్తె లేయాకు ఇచ్చిన జిల్పా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం పదహారు మంది.

  13. ఆదికాండము 46:19సుమారు క్రీ.పూ. 1706

    యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు: యోసేపు, బెన్యామీను.

  14. ఆదికాండము 46:20సుమారు క్రీ.పూ. 1706

    ఈజిప్టులో యోసేపుకు ఓను పట్టణానికి యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసెనతు ద్వారా మనష్షే, ఎఫ్రాయిం పుట్టారు.

  15. ఆదికాండము 46:21సుమారు క్రీ.పూ. 1706

    బెన్యామీను కుమారులు: బేల, బెకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.

  16. ఆదికాండము 46:22సుమారు క్రీ.పూ. 1706

    వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది.

  17. ఆదికాండము 46:23సుమారు క్రీ.పూ. 1706

    దాను కుమారుడు: హూషీము.

  18. ఆదికాండము 46:24సుమారు క్రీ.పూ. 1706

    నఫ్తాలి కుమారులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.

  19. ఆదికాండము 46:25సుమారు క్రీ.పూ. 1706

    వీరు లాబాను తన కుమార్తె రాహేలుకు ఇచ్చిన బిల్హా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం ఏడుగురు.

  20. ఆదికాండము 46:26సుమారు క్రీ.పూ. 1706

    యాకోబుతో ఈజిప్టుకు అతని కుమారుల భార్యలు కాక, యాకోబు సంతతివారు మొత్తం అరవై ఆరు మంది వ్యక్తులు.

  21. ఆదికాండము 46:27సుమారు క్రీ.పూ. 1706

    ఈజిప్టులో యోసేపుకు పుట్టిన కుమారులు ఇద్దరితో కలిపి, ఈజిప్టుకు వెళ్లిన యాకోబు కుటుంబీకులంతా డెబ్బైమంది.

  22. ఆదికాండము 46:28సుమారు క్రీ.పూ. 1706

    గోషేనుకు త్రోవ చూపడానికి యాకోబు యూదాను తనకన్నా ముందు యోసేపు దగ్గరకు పంపాడు. వారు గోషేను ప్రాంతం చేరుకున్నప్పుడు,

  23. ఆదికాండము 46:29సుమారు క్రీ.పూ. 1706

    యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషేనుకు వెళ్లాడు. యోసేపు కనుపరచుకున్న వెంటనే, తన తండ్రిని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు.

  24. ఆదికాండము 46:30సుమారు క్రీ.పూ. 1706

    ఇశ్రాయేలు యోసేపుతో, “నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను కళ్లారా చూశాను కాబట్టి, ఇప్పుడు హాయిగా చనిపోగలను” అని అన్నాడు.

  25. ఆదికాండము 46:31సుమారు క్రీ.పూ. 1706

    అప్పుడు యోసేపు తన సోదరులతో తన తండ్రి ఇంటివారితో, “నేను వెళ్లి ఫరోతో మాట్లాడి అతనికి, ‘కనాను దేశంలో నివసించే నా సోదరులు, నా తండ్రి ఇంటివారు నా దగ్గరకు వచ్చారు.