కంటెంట్‌కు వెళ్లండి

Saul

265 వచనాలు · 11 కుటుంబ సభ్యులు

Saul ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సౌలు తనకు కీడు చేయాలని కుట్ర చేస్తున్నాడని తెలుసుకున్న దావీదు యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదు తీసుకురా” అని చెప్పాడు.

  2. అప్పుడు దావీదు, “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నా కారణంగా పట్టణాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని మీ దాసుడనైన నాకు ఖచ్చితంగా తెలిసింది.

  3. కెయీలా పౌరులు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? మీ సేవకుడనైన నేను విన్నట్లుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, దయచేసి మీ సేవకుడనైన నాకు చెప్పండి” అని ప్రార్థించాడు. “అతడు వస్తాడు” అని యెహోవా జవాబిచ్చారు.

  4. దావీదు మరల, “కెయీలా పౌరులు నన్ను నా ప్రజలను సౌలు చేతికి అప్పగిస్తారా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వారు నిన్ను అప్పగిస్తారు” అని జవాబిచ్చారు.

  5. కాబట్టి దావీదు, అతని మనుష్యులు దాదాపు ఆరువందలమంది కెయీలాను విడిచి ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్లారు. దావీదు కెయీలా నుండి పారిపోయాడని సౌలుకు తెలిసి అక్కడికి వెళ్లలేదు.

  6. అయితే దావీదు అరణ్యంలో, బలమైన కోటలలో, జీఫు అడవి కొండల్లో నివసించాడు. ప్రతిరోజు సౌలు అతన్ని వెదికాడు కాని దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు.

  7. తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని తెలుసుకుని దావీదు జీఫు ఎడారిలోని హోరేషులో ఉన్నాడు.

  8. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ,

  9. “భయపడకు, నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకోలేడు నీవు ఇశ్రాయేలీయులకు రాజవుతావు; నీ తర్వాతి స్థానంలో నేను ఉంటాను. ఇది నా తండ్రియైన సౌలుకు కూడా తెలుసు” అని చెప్పాడు.

  10. జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వచ్చి, “యెషీమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండమీద హోరేషు బలమైన కోటల దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడా హోరేషు కొండ దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడు?

  11. అప్పుడు సౌలు వారితో, “మీకు నాపై ఉన్న కనికరాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

  12. వారు బయలుదేరి సౌలు కంటే ముందు జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు అతని ప్రజలు యెషీమోనుకు దక్షిణాన ఉన్న అరాబాలో మాయోను ఎడారిలో ఉన్నారు.

  13. సౌలు అతని మనుష్యులు తనను వెదకడం మొదలుపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు కొండ శిఖరం దిగి మాయోను ఎడారిలో నివసించాడు. సౌలు అది విని దావీదును తరుముతూ మాయోను ఎడారిలోనికి వెళ్లాడు.

  14. అయితే పర్వతానికి ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు అతని ప్రజలు వెళ్తుండగా దావీదు సౌలు నుండి తప్పించుకోవాలని తొందరపడుతున్నాడు. సౌలు అతని ప్రజలు దావీదును అతని ప్రజలను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.

  15. అప్పుడు ఒక దూత సౌలు దగ్గరకు వచ్చి, “త్వరగా రా, దేశం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు” అని చెప్పాడు.

  16. సౌలు దావీదును తరమడం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోడానికి వెనుకకు తిరిగి వెళ్లాడు. కాబట్టి ఆ స్థలానికి సెలా హమ్మలెకోతు అని ఆ పేరు పెట్టారు.

  17. సౌలు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగివచ్చిన తర్వాత, “దావీదు ఎన్-గేదీ ఎడారిలో ఉన్నాడు” అని అతనికి వార్త వచ్చింది.

  18. కాబట్టి సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడువేలమంది యువకులను ఏర్పరచుకొని కొండమేకలు ఉండే రాతి గుట్టలలో దావీదును అతని ప్రజలను వెదకడానికి బయలుదేరాడు.

  19. దారిలో గొర్రెల దొడ్ల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక గుహ ఉంది. సౌలు మూత్ర విసర్జన కోసం దాని లోపలికి వెళ్లాడు. ఆ గుహలో చాలా లోపల దావీదు అతని మనుష్యులు ఉన్నారు.

  20. ఆ మనుష్యులు, “ ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. అప్పుడు దావీదు ప్రాకుతూ ముందుకు వెళ్లి సౌలు వస్త్రపు అంచును కత్తిరించాడు.

  21. కాని తర్వాత, సౌలు పైవస్త్రపు అంచును కోసినందుకు దావీదుకు మనస్సులో ఎంతో బాధ కలిగి,

  22. ఈ మాటలు చెప్పి దావీదు తన ప్రజలను గద్దించి సౌలు మీద దాడి చేయకుండ వారిని ఆపాడు. సౌలు ఆ గుహ నుండి బయటకు వచ్చి తన దారిలో వెళ్లిపోయాడు.

  23. అప్పుడు దావీదు గుహ నుండి బయటకు వచ్చి, “నా ప్రభువా రాజా!” అని పిలిచాడు. సౌలు అతని వెనుక చూసినప్పుడు దావీదు నేలకు సాష్టాంగపడి ఉన్నాడు.

  24. అతడు సౌలుతో ఇలా అన్నాడు, “ ‘దావీదు నీకు హాని చేస్తాడు’ అని మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు?

  25. దావీదు ఇలా చెప్పడం ముగించినప్పుడు సౌలు, “దావీదూ, నా కుమారుడా, అది నీ స్వరమా?” అని అడిగి బిగ్గరగా ఏడ్చాడు,