Skip to content

Michal గురించి బైబిల్ వచనాలు

26 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సౌలు తన సేవకులను పిలిచి, “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, ‘రాజుకు నీవంటే ఇష్టం, అలాగే అతని సేవకులందరు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పమని” వారిని ఆజ్ఞాపించాడు.

  2. సౌలు సేవకులు ఆ మాటలే దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు, “రాజుకు అల్లుడు కావడం చిన్న విషయమా? నేను ఒక పేదవాన్ని అంతగా గుర్తింపులేనివాన్ని” అన్నాడు.

  3. సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియజేశారు.

  4. అందుకు సౌలు, “రాజు వధువుకు కట్నంగా ఏమి కోరడంలేదు గాని రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకువస్తే సరిపోతుందని దావీదుతో చెప్పండి” అన్నాడు. దావీదు ఫిలిష్తీయుల చేతిలో పడాలనేదే సౌలు పన్నాగము.

  5. సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు తాను రాజుకు అల్లుడు అవ్వడానికి అంగీకరించాడు. కాబట్టి ఇచ్చిన సమయం కన్నా ముందే,

  6. దావీదు తన మనుష్యులను తీసుకెళ్లి రెండువందలమంది ఫిలిష్తీయులను చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చాడు. రాజుకు అల్లుడు అవ్వడానికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్ళి చేశాడు.

  7. యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతని ప్రేమించడం చూసి,

  8. యెహోవా దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చింది. అప్పుడు సౌలు చేతిలో ఈటె పట్టుకుని తన ఇంట్లో కూర్చున్నాడు. దావీదు సితారా వాయిస్తుండగా,

  9. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు వ్రేలాడదీయాలనుకుని ఈటె విసిరాడు. దావీదు ప్రక్కకు తప్పుకోగా సౌలు విసిరిన ఈటె గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రే తప్పించుకుని పారిపోయాడు.

  10. ఉదయానే దావీదును చంపాలని అతన్ని పట్టుకోమని చెప్పి సౌలు అతని ఇంటికి దూతలను పంపించాడు. అయితే దావీదు భార్యయైన మీకాలు, “ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని హెచ్చరించి,

  11. మీకాలు దావీదును కిటికీ గుండా క్రిందకు దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.

  12. తర్వాత మీకాలు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంచం మీద పెట్టి తల దగ్గర మేక వెంట్రుకలు ఉంచి దుప్పటితో దానిని కప్పింది.

  13. సౌలు దావీదును పట్టుకోడానికి దూతలను పంపినప్పుడు మీకాలు, “అతడు అనారోగ్యంగా ఉన్నాడు” అని చెప్పింది.

  14. సౌలు దావీదును చూడడానికి మళ్ళీ దూతలను పంపుతూ వారితో, “అతన్ని మంచంతో సహా తీసుకురండి నేను అతన్ని చంపుతాను” అన్నాడు.

  15. అయితే ఆ దూతలు లోపలికి వచ్చి చూసినప్పుడు తల దగ్గర మేక వెంట్రుకలు ఉన్న ఒక విగ్రహం మంచం మీద కనబడింది.

  16. అప్పుడు సౌలు, “నా శత్రువు తప్పించుకునేలా అతన్ని పంపించివేసి ఎందుకు నన్ను మోసం చేశావు?” అని మీకాలును అడిగాడు. అందుకు మీకాలు, “నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను వెళ్లనివ్వు” అని దావీదు తనతో అన్నాడని సౌలుతో చెప్పింది.

  17. అయితే సౌలు తన కుమార్తె దావీదు భార్యయైన మీకాలును గల్లీముకు చెందిన లాయిషు కుమారుడైన పల్తీయేలుకు ఇచ్చాడు.

  18. అప్పుడు దావీదు, “మంచిది, నీతో ఒక ఒప్పందానికి వస్తాను కాని నీవు ఒక పని చేయాలి. నీవు నన్ను చూడడానికి వచ్చేటప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా దగ్గరకు తీసుకువస్తేనే నీవు నన్ను చూడగలవు” అని చెప్పాడు.

  19. ఆ తర్వాత దావీదు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు దగ్గరకు దూతలను పంపించి, “వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తెచ్చి వెల చెల్లించి నేను పెండ్లి చేసుకున్న నా భార్య మీకాలును నాకు అప్పగించు” అని కబురు చేశాడు.

  20. ఇష్-బోషెతు మనుష్యులను పంపి ఆమె భర్త లాయిషు కుమారుడైన పల్తీయేలు దగ్గర నుండి ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.

  21. ఆమె భర్త ఆమె వెంట ఏడుస్తూ బహూరీము వరకు వచ్చాడు. అయితే అబ్నేరు అతన్ని వెనుకకు వెళ్లిపొమ్మని చెప్పడంతో అతడు వెళ్లిపోయాడు.

  22. యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో రాజైన దావీదు గంతులు వేస్తూ నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.

  23. తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు సౌలు కుమార్తె మీకాలు ఎదురు వచ్చి అతనితో, “ఇశ్రాయేలు రాజు తన సేవకులైన బానిస అమ్మాయిలు చూస్తుండగా ఒక పిచ్చివాడు చేసినట్లుగా ఈ రోజు బట్టలు విప్పి అర్థనగ్నంగా ఎంత గొప్పగా కనబడ్డాడో!” అని హేళనగా మాట్లాడింది.

  24. అందుకు దావీదు మీకాలుతో, “నీ తండ్రిని నీ తండ్రి ఇంటివారిని కాదని నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన యెహోవా సన్నిధిలో నేను ఆనందిస్తూ నాట్యం చేశాను.

  25. నేను ఇంతకన్నా ఎక్కువ అవమానపడినా నా దృష్టికి నేను తక్కువ వాడినైనా ఫర్వాలేదు, కాని నీవు చెప్తున్న బానిస అమ్మాయిల దృష్టిలో గౌరవించబడతాను” అన్నాడు.