కంటెంట్‌కు వెళ్లండి

Judah

244 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Judas, Juda

Judah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యూదా దేశంలో రాజైన ఆసా పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యరొబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలును పరిపాలించాడు.

  2. యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బయెషా నాదాబును చంపి, అతని తర్వాత రాజయ్యాడు.

  3. యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.

  4. యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఆరవ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలహు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు తిర్సాలో రెండేళ్ళు పరిపాలించాడు.

  5. జిమ్రీ లోపలికి వచ్చి, అతన్ని మొత్తి చంపాడు, అతని తర్వాత అతడు రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఇరవై ఏడవ ఏట పరిపాలనలో జరిగింది.

  6. యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఏడవ సంవత్సరంలో జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పరిపాలించాడు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోను అనే పట్టణం ముట్టడించారు.

  7. యూదా రాజైన ఆసా పరిపాలన యొక్క ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండు సంవత్సరాల పరిపాలనలో ఆరు సంవత్సరాలు తిర్సాలో పరిపాలన చేశాడు.

  8. యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  9. ఏలీయా భయపడి, తన ప్రాణం కాపాడుకోడానికి పారిపోయాడు. అతడు యూదాలోని బెయేర్షేబకు చేరి, అక్కడ తన సేవకుడిని విడిచిపెట్టి,

  10. మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును సందర్శించడానికి వెళ్లాడు.

  11. ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని సమరయ నగర ద్వారం దగ్గర ఉన్న నూర్పిడి కళ్ళం దగ్గరలో ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉండగా, తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు.

  12. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు.

  13. ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు.

  14. యెహోషాపాతు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విజయాలు, యుద్ధం విన్యాసాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  15. యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో అహాబు కుమారుడైన అహజ్యా ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  16. కాబట్టి ఏలీయా చెప్పిన యెహోవా వాక్కు ప్రకారమే అతడు చనిపోయాడు. అహజ్యాకు కుమారుడు లేనందుకు, యూదాలో రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యోరాము రాజయ్యాడు.

  17. యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అహాబు కుమారుడైన యోరాము సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతడు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  18. అతడు యూదా రాజైన యెహోషాపాతుకు, “మోయాబు రాజు నా మీద తిరుగబడ్డాడు, మీరు నాతో కూడా మోయాబు మీదికి యుద్ధానికి వస్తారా?” అని కబురు పంపాడు. అందుకు యెహోషాపాతు, “నేను మీలాంటి వాడినే, నా ప్రజల మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అని అన్నాడు.

  19. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదారాజు, ఎదోము రాజు కలిసి బయలుదేరి ఏడు రోజులు చుట్టూ తిరిగి ప్రయాణించిన తర్వాత సైన్యానికి పశువులకు వారి దగ్గర నీళ్లు మిగల్లేదు.

  20. అందుకు ఎలీషా ఇలా అన్నాడు, “నేను సేవించే సజీవుడైన సైన్యాల యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్నాను, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవించకపోతే, అసలు నీవైపు చూసేవాన్ని కూడా కాదు.

  21. అహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యోరాము పరిపాలనలోని అయిదవ సంవత్సరంలో, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యూదాలో రాజయ్యాడు.

  22. అయితే, యెహోవా తన సేవకుడైన దావీదును బట్టి యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.

  23. యెహోరాము కాలంలో ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు.

  24. ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది.

  25. యెహోరాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?