కంటెంట్‌కు వెళ్లండి

Judah

244 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Judas, Juda

Judah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “యూదా రాజైన మనష్షే ఈ అసహ్యకరమైన పాపాలు చేశాడు. అతనికంటే ముందు ఉన్న అమోరీయుల కంటే మించి చెడు చేశాడు, అతడు విగ్రహాలతో యూదాను తప్పుదారి పట్టించాడు.

  2. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను యెరూషలేము మీదికి, యూదా మీదికి విపత్తు రప్పిస్తాను. ఆ విపత్తును గురించి విన్న వారందరి చెవులు గింగురుమంటాయి.

  3. యూదా వారు యెహోవా దృష్టిలో తప్పుగా ప్రవర్తించేటట్టు మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేము ఆ చివర నుండి ఈ చివర వరకు చిందించాడు.

  4. మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన పాపం గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  5. ఆమోనును పరిపాలన గురించిన ఇతర విషయాలు అతడు చేసినవి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

  6. “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ప్రజల కోసం యూదా అంతటి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు; మనలను ఉద్దేశించి అందులో వ్రాయబడిన ప్రకారం వారు చేయలేదు.”

  7. ‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన కీడంతటిని నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను.

  8. యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:

  9. అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు.

  10. అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, ప్రవక్తలతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు.

  11. అంతకుముందు యూదా పట్టణాల్లో, యెరూషలేము చుట్టూ క్షేత్రాల్లో ధూపం వేయడానికి యూదా రాజులు నియమించిన విగ్రహాల పూజారుల బృందాన్ని అతడు తొలగించాడు. వారు బయలుకు, సూర్యునికి, చంద్రునికి, నక్షత్ర సమూహాలన్నిటికి వేసేవారు.

  12. యోషీయా యూదా పట్టణాల్లో ఉన్న యాజకులందరిని యెరూషలేముకు తెప్పించి ఆ యాజకులు ధూపం వేసే క్షేత్రాలను గెబా నుండి బెయేర్షేబ వరకు అపవిత్రపరచాడు. అతడు యెరూషలేము నగర అధికారియైన యెహోషువ ఇంటి ద్వారం ఎడమవైపు ఉన్న క్షేత్రాలను పడగొట్టించాడు.

  13. యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను అతడు యెహోవా ఆలయ ద్వారం నుండి తొలగించాడు. అవి నాతాన్-మెలెకు అనే అధికారి గదికి సమీపంలో ఉన్న ఆవరణంలో ఉన్నాయి. యోషీయా సూర్యునికి అంకితం చేయబడిన రథాలను కాల్చివేశాడు.

  14. అతడు ఆహాజు మేడమీది పైకప్పు మీద యూదా రాజులు కట్టించిన బలిపీఠాన్ని, యెహోవా మందిరం యొక్క రెండు ఆవరణాల్లో మనష్షే కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టాడు. వాటిని అక్కడినుండి తీసివేసి, ముక్కలు ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కిద్రోను లోయలో పారవేశాడు.

  15. రాజు, “నాకు కనిపిస్తున్న ఆ సమాధి రాయి ఏంటి?” అని అడిగాడు. అందుకు ఆ పట్టణస్థులు చెప్పారు, “అది యూదా నుండి వచ్చిన దైవజనుని సమాధి. మీరు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన దాని గురించి ప్రకటించింది అతడే” అని చెప్పారు.

  16. అలాంటి పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలను న్యాయం తీర్చిన న్యాయాధిపతుల కాలం నుండి ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు పరిపాలించిన కాలం వరకు ఎన్నడూ ఆచరించలేదు.

  17. అంతేకాక యోషీయా కర్ణపిశాచులను, ఆత్మలతో మాట్లాడేవారిని, గృహదేవతలు, విగ్రహాలు, యూదాలో యెరూషలేములో కనిపించే ఇతర అసహ్యకరమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకుడైన హిల్కీయాకు యెహోవా మందిరంలో దొరికిన గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అతడు ఇలా చేశాడు.

  18. బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు.

  19. యూదారాజు యొక్క రాజభవనంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను రాజు యొక్క అధికారుల దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూసి వెటకారంగా ఇలా అంటారు: “ ‘మీ నమ్మకమైన స్నేహితులు మిమ్మల్ని తప్పుదారి పట్టించారు, వారు మిమ్మల్ని అప్పగించారు. మీ పాదాలు బురదలో దిగబడినప్పుడు; మీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు.’