Pharez
ఇలా కూడా పిలుస్తారు: Phares, Perez
Pharez ను ప్రస్తావించే వచనాలు
అయితే ఆ శిశువు చేయి వెనుకకు తీసుకున్నప్పుడు, అతని సోదరుడు బయటకు వచ్చాడు, అప్పుడు ఆమె, “ఇలా నీవు దూసుకుని వచ్చావు!” అన్నది. అతనికి పెరెసు అని పేరు పెట్టారు.
యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (కాని ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.
యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.
పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము.
యెహోవా ఈ యువతి ద్వారా నీకు ఇచ్చే సంతానం ద్వారా, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు వలె ఉండును గాక!” అని అన్నారు.
ఇది పెరెసు వంశావళి: పెరెసు కుమారుడు హెస్రోను
యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు.
పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.
యూదా వారసులు: పెరెసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు.
యూదా కుమారుడైన పెరెసు వారసుడు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడైన అమీహూదు పుట్టిన ఊతై.
అతడు పెరెసు వారసుడు, మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉన్నాడు.
యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;
యెరూషలేములో నివసించిన పెరెసు వారసులు 468 మంది, వీరంతా అసాధారణమైన పోరాట యోధులు.
యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము.
నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము హెస్రోను కుమారుడు, హెస్రోను పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు,