Skip to content

Genealogies గురించి బైబిల్ వచనాలు

33 వచనాలు · 7 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి:

  2. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా అతని సహోదరులు.

  3. యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము.

  4. అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు శల్మాను.

  5. శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెష్షయి.

  6. రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.

  7. సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబీయా, అబీయా కుమారుడు ఆసా.

  8. ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా.

  9. ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా.

  10. హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా.

  11. యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.

  12. బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.

  13. జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీము, ఎల్యాకీము కుమారుడు అజోరు.

  14. అజోరు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు ఆకీము, ఆకీము కుమారుడు ఎలీహూదు.

  15. ఎలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు.

  16. యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి.

  17. ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు.

  18. ఆ తర్వాత యేసు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంచుమించు ముప్పై యేండ్ల వయస్సు కలవాడు. ఆయన యోసేపు కుమారుడని అనుకున్నారు, యోసేపు హేలీ కుమారుడు,

  19. హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవీ కుమారుడు, లేవీ మెల్కి కుమారుడు, మెల్కి యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు,

  20. యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు, ఆమోసు నహూము కుమారుడు, నహూము ఎస్లి కుమారుడు, ఎస్లి నగ్గయి కుమారుడు,

  21. నగ్గయి మయతు కుమారుడు, మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు, సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు,

  22. యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు, షయల్తీయేలు నేరి కుమారుడు,

  23. నేరి మెల్కీ కుమారుడు, మెల్కి అద్ది కుమారుడు, అద్ది కోసాం కుమారుడు, కోసాము ఎల్మాదాం కుమారుడు, ఎల్మాదాం ఏరు కుమారుడు,

  24. ఏరు యెహోషువ కుమారుడు, యెహోషువ ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు యోరీము కుమారుడు, యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవీ కుమారుడు,

  25. లేవీ షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. యోసేపు యోనాము కుమారుడు, యోనాము ఎల్యాకీము కుమారుడు,