Segub గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అహాబు కాలంలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టించాడు. దాని పునాది వేసినప్పుడు అతని పెద్దకుమారుడైన అబీరాము చనిపోయాడు, దానికి గుమ్మాలు పెట్టినప్పుడు అతని చిన్నకుమారుడు సెగూబు చనిపోయాడు. ఈ విధంగా నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు.
పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.
తర్వాత, హెస్రోను అరవై సంవత్సరాల వయస్సులో గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఆమె ద్వారా అతనికి సెగూబు పుట్టాడు.
సెగూబు కుమారుడు యాయీరు. యాయీరుకు గిలాదులో ఇరవై మూడు పట్టణాలున్నాయి.