కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని, అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.’ ”

  2. అతడు చెక్కించిన అషేరా స్తంభాన్ని తీసి ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.

  3. అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.

  4. ఆరవవాడు ఓజెము, ఏడవవాడు దావీదు.

  5. దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు వీరు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను మొదటి కుమారుడు; కర్మెలుకు చెందిన అబీగయీలుకు పుట్టిన దానియేలు రెండవ కుమారుడు;

  6. ఉంపుడుగత్తెల ద్వారా దావీదుకు పుట్టిన కుమారులు కాకుండా వీరందరు దావీదు కుమారులు. తామారు వీరికి సోదరి.

  7. బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే.

  8. నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు.

  9. తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్శాము, సమూయేలు. వీరు తమ కుటుంబాలకు పెద్దలు. దావీదు పాలనలో తోలా సంతానం యుద్ధవీరులుగా లెక్కించబడ్డారు. వీరి సంఖ్య 22,600.

  10. ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు.

  11. యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.

  12. ఇశ్రాయేలీయులందరు హెబ్రోనులో దావీదు దగ్గరకు వచ్చి, “మేము నీ రక్తసంబంధులము.

  13. ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు. యెహోవా సమూయేలు ద్వారా వాగ్దానం చేసినట్టే వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.

  14. దావీదు ఇశ్రాయేలీయులందరు యెబూసు అని కూడా పిలువబడే యెరూషలేముకు వెళ్లారు. యెబూసీయులు అక్కడ నివసిస్తున్నారు.

  15. అప్పుడు యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు” అన్నారు. అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.

  16. దావీదు, “ఎవడు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో వాడు ప్రముఖ సైన్యాధిపతి అవుతాడు” అని అన్నప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా దాడి చేసి అధిపతి అయ్యాడు.

  17. దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి దానికి దావీదు పట్టణం అని పేరు వచ్చింది.

  18. సైన్యాల యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.

  19. ఇశ్రాయేలుకు యెహోవా వాగ్దానం చేసిన ప్రకారం దావీదును ఆ ప్రాంతమంతటికి రాజుగా చేయడానికి అతనికి ఇశ్రాయేలు వారందరితో కలిసి సహాయం చేసిన వీరులలో ప్రధానులు వీరు.

  20. ఇది దావీదు యొక్క పరాక్రమశాలుల జాబితా: అధికారులలో ముఖ్యుడు, హక్మోనీయుడైన కుమారుడైన యషోబీము; అతడు తన ఈటెతో ఒకే యుద్ధంలో మూడువందల మందిని చంపాడు.

  21. ఒకసారి ఫిలిష్తీయులు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చినప్పుడు అతడు దావీదుతో పాటు ఉన్నాడు. యవలు నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు దళాలు పారిపోయారు.

  22. ముప్పైమంది ప్రముఖులలో ముగ్గురు అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది.

  23. ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు. ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది.

  24. దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు.

  25. అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు.