Skip to content

Zobah గురించి బైబిల్ వచనాలు

59 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అంతేకాక, సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు హమాతు పరిసరాల్లో దావీదు అతన్ని ఓడించాడు.

  2. దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు.

  3. సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు.

  4. దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా అరామీయులు అతనికి దాసులై, అతనికి కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు.

  5. దావీదు హదదెజెరు సైన్యాధిపతులు ధరించిన బంగారు డాళ్లను తీసుకుని, వాటిని యెరూషలేముకు తెచ్చాడు.

  6. హదదెజెరుకు చెందిన తెబా కూను అనే పట్టణాల నుండి దావీదు చాలా మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఇత్తడితో సొలొమోను ఇత్తడి నీళ్ల తొట్టెను, స్తంభాలను, ఇతర ఇత్తడి వస్తువులను చేయించాడు.

  7. సోబా రాజైన హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు,

  8. దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, హానూను అమ్మోనీయులు వేయి తలాంతుల వెండిని పంపి అరాము నహరయీము నుండి, అరాము మయకా నుండి, సోబా నుండి రథాలను, రథసారధులను కిరాయికి తీసుకున్నారు.

  9. వారు 32,000 రథాలను, రథసారధులను, మయకా రాజును, అతని సైన్యాన్ని కిరాయికి తీసుకున్నారు. వారు మెదెబా దగ్గరలో శిబిరం ఏర్పరచుకున్నారు, ఆ సమయంలో అమ్మోనీయులు తమ పట్టణాల నుండి సమకూడి యుద్ధం చేయడానికి వెళ్లారు.

  10. ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు.

  11. అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. అక్కడికి వచ్చిన రాజులు విడిగా పొలాల్లో ఉన్నారు.

  12. యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు.

  13. మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచాడు, వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు.

  14. యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి; అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను నేను రక్షిస్తాను.

  15. ధైర్యంగా ఉండు, మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.

  16. అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు.

  17. అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు కూడా యోవాబు సోదరుడైన అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

  18. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు దూతలను పంపి, యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించారు. హదదెజెరు సేనాధిపతియైన షోఫకు వారిని నడిపించాడు.

  19. దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి వెళ్లాడు; వారికి ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాడు. దావీదు అరామీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాక వారు అతనితో యుద్ధం చేశారు.

  20. అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు. దావీదు వారిలో 7,000 మంది రథసారధులను 40,000 సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోఫకును కూడా చంపాడు.

  21. హదదెజెరు సేవకులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి దావీదుతో సమాధానపడి అతనికి లొంగిపోయారు. అప్పటినుండి ఇంకెప్పుడు అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు.

  22. తర్వాత సొలొమోను హమాత్-సోబా పట్టణం మీదికి వెళ్లి, దానిని స్వాధీనపరచుకున్నాడు.

  23. సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను అరాము సోబా వారితోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది. దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!

  24. మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు; దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది.

  25. మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు; మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు.