కంటెంట్‌కు వెళ్లండి

Zobah గురించి బైబిల్ వచనాలు: Conquest of, by David

17 వచనాలు · 5 కోణాలు

Conquest of, by David గురించి వచనాలు

  1. రెహోబు కుమారుడు సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది దగ్గర తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.

  2. దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు.

  3. సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు.

  4. దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా, అరామీయులు అతనికి దాసులై కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు.

  5. దావీదు హదదెజెరు సైన్యాధిపతులకు చెందిన బంగారు డాళ్లను తీసుకుని వాటిని యెరూషలేముకు తెచ్చాడు.

  6. హదదెజెరుకు చెందిన తెబా బెరోతయి అనే పట్టణాల నుండి రాజైన దావీదు పెద్ద మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు.

  7. Of Syria, and of Moab, and of the children of Ammon, and of the Philistines, and of Amalek, and of the spoil of Hadadezer, son of Rehob, king of Zobah.

  8. దేవుడు సొలొమోను మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అనే ఇంకొక విరోధిని లేపారు; ఇతడు తన యజమాని సోబా రాజైన హదదెజెరు నుండి పారిపోయిన వాడు.

  9. దావీదు సోబా సైన్యాన్ని నిర్మూలం చేసినప్పుడు, రెజోను కొంతమంది తిరుగుబాటుదారుల గుంపు పోగుచేసుకుని వారికి నాయకునిగా ఉన్నాడు; వారు దమస్కుకు వెళ్లి స్థిరపడి, ఆ పట్టణాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు.

  10. దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు, వారు లొంగిపోయి అతనికి కప్పం చెల్లించారు.

  11. అంతేకాక, సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు హమాతు పరిసరాల్లో దావీదు అతన్ని ఓడించాడు.

  12. దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు.

  13. సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు.

  14. దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా అరామీయులు అతనికి దాసులై, అతనికి కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు.

  15. దావీదు హదదెజెరు సైన్యాధిపతులు ధరించిన బంగారు డాళ్లను తీసుకుని, వాటిని యెరూషలేముకు తెచ్చాడు.

  16. హదదెజెరుకు చెందిన తెబా కూను అనే పట్టణాల నుండి దావీదు చాలా మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఇత్తడితో సొలొమోను ఇత్తడి నీళ్ల తొట్టెను, స్తంభాలను, ఇతర ఇత్తడి వస్తువులను చేయించాడు.

  17. సోబా రాజైన హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు,