Skip to content

War గురించి బైబిల్ వచనాలు

639 వచనాలు · 45 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు.

  2. మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు; జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.

  3. నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా శత్రువులు మా ఎదుటకు వస్తే, దినమంతా మాకు అవమానమే; సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది.

  4. For the voice of him that reproacheth and blasphemeth; by reason of the enemy and avenger.

  5. రండి యెహోవా చేసిన క్రియలను చూడండి, లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి.

  6. ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు.

  7. రాజులు దళాలతో కలిసి, వారు ముందుకు వచ్చినప్పుడు,

  8. వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; వారు భయంతో పారిపోయారు.

  9. వారిలో వణుకు పుట్టింది, ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.

  10. తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా మీరు వారిని నాశనం చేశారు.

  11. అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి, కాని అతని హృదయంలో యుద్ధం ఉంటుంది; అతని మాటలు నూనె కన్న నున్నగా ఉంటాయి కానీ అవి దూసిన ఖడ్గాల్లాంటివి.

  12. సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను అరాము సోబా వారితోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది. దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!

  13. మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు; దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది.

  14. మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు; మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు.

  15. దేవా! రెల్లు మధ్యలో ఉండే మృగాన్ని, అడవి జంతువుల లాంటి దేశాల మధ్యలో ఉన్న ఎడ్ల గుంపును గద్దించండి. అవి తగ్గించబడి వెండి కడ్డీలను పన్నుగా తెచ్చును గాక యుద్ధాలంటే ఇష్టపడే దేశాలను చెదరగొట్టండి.

  16. అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు, డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా

  17. ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు; వారికి నిత్య అవమానాన్ని కలిగించారు.

  18. ఆసాపు కీర్తన. ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు; అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.

  19. వారు మీ సేవకుల కళేబరాలను ఆకాశపక్షులకు ఆహారంగా, మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు.

  20. వారు యెరూషలేము చుట్టూ రక్తాన్ని నీటిలా పారబోశారు, చనిపోయినవారిని పాతిపెట్టడానికి ఎవరూ లేరు.

  21. “వారి దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలు ఎందుకు అనాలి? మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.

  22. తన ప్రజలను వారు ద్వేషించేలా ఆయన వారి హృదయాలు మార్చివేశారు, తన సేవకులకు వ్యతిరేకంగా కుట్ర చేసేలా వారిని పురికొల్పారు.

  23. సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.

  24. నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

  25. మీ పసిపిల్లల్ని పట్టుకుని వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు.