కంటెంట్‌కు వెళ్లండి

War గురించి బైబిల్ వచనాలు: God threatens defeat in

22 వచనాలు · 45 కోణాలు

God threatens defeat in గురించి వచనాలు

  1. బయట ఖడ్గం వారిని సంతానం లేనివారినిగా చేస్తుంది; వారి ఇళ్ళలో భయం పరిపాలిస్తుంది, యువతీ యువకులు, నశిస్తారు శిశువులు, తల నెరసినవారు నశిస్తారు.

  2. యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు. పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు; భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు. “ఆయన తన రాజుకు బలాన్నిస్తారు తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు.”

  3. మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.

  4. అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.

  5. అతడు వచ్చినప్పుడు, రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, వెళ్లొద్దా?” అని అడిగాడు. అందుకతడు, “దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే వారు మీ చేతికి అప్పగించబడతారు” అని జవాబిచ్చాడు.

  6. రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు.

  7. అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.

  8. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది, ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది కానీ మీకు ఇవేవి లభించవు.

  9. మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు! మీరు, ‘మేము వేగంగా పరుగెత్తే గుర్రాల మీద స్వారీ చేస్తాం’ అన్నారు. కాబట్టి మిమ్మల్ని వెంటాడేవారు వేగంగా తరమబడతారు!

  10. పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా కొండమీద ఉన్న జెండాలా మీరు మిగిలేవరకు ఒకరు గద్దించగా మీలో వెయ్యిమంది పారిపోతారు; అయిదుగురు గద్దించగా మీరందరు పారిపోతారు.”

  11. “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలా అగ్నికి అప్పగించానో అలానే యెరూషలేములో నివసించే ప్రజలను అప్పగిస్తాను.

  12. నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  13. వారు నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి నేను దేశాన్ని పాడుచేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”

  14. “మనుష్యకుమారుడా, నీవు ప్రవచించి ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం పదును పెట్టబడి మెరుగు పెట్టబడింది.

  15. వధించడానికి పదును పెట్టబడింది, మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది! “ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది.

  16. “ ‘ఆ ఖడ్గం మెరుగుపరచడానికి, చేతితో పట్టుకోడానికి నియమించబడింది; హతం చేసేవాడు పట్టుకోడానికి, అది పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి సిద్ధంగా ఉంది.

  17. మనుష్యకుమారుడా, మొరపెట్టు, రోదించు ఆ ఖడ్గం నా ప్రజలమీదికి ఇశ్రాయేలు అధిపతులందరి మీదికి వస్తున్నది. నా ప్రజలతో పాటు వారు కూడా ఖడ్గంతో చంపబడతారు. కాబట్టి నీ రొమ్ము కొట్టుకో.

  18. “ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’

  19. “కాబట్టి మనుష్యకుమారుడా, ప్రవచించు, నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టు. ఖడ్గం రెండు సార్లు దాడి చేయును గాక మూడుసార్లు అయినా దాడి చేయును గాక. అది వధ కొరకైన ఖడ్గం, మహా వధ కొరకైన ఖడ్గం, అన్ని వైపుల నుండి వారి మీద దాడి చేస్తుంది.

  20. తద్వార వారి హృదయాలు భయంతో కరిగిపోవును గాక, చాలామంది హతమవుదురు గాక, వారి గుమ్మాలన్నిటి దగ్గర నేను ఖడ్గాన్ని నిలబెట్టాను. చూడండి! అది తళతళ మెరుస్తూ ఉంది, అది వధ కోసం దూయబడింది.

  21. ఖడ్గమా! కుడివైపు వేటు వేయి, తర్వాత ఎడమవైపు వేటు వేయి. ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి.

  22. నేను కూడా నా చేతులతో చప్పట్లు కొట్టి, నా ఉగ్రత తీర్చుకుంటాను. యెహోవానైన నేనే ఈ మాట అన్నాను.”