కంటెంట్‌కు వెళ్లండి

War గురించి బైబిల్ వచనాలు

639 వచనాలు · 45 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎందుకంటే మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల దేశం పడిపోతుంది, కాని అనేక సలహాదారుల ద్వారా విజయం కలుగుతుంది.

  2. ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి, మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.

  3. జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు.

  4. యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, కాని విజయం యెహోవా దగ్గర ఉంది.

  5. ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది.

  6. ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.

  7. గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు. ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో, అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు.

  8. ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు.

  9. ఇప్పుడు ఆ పట్టణంలో ఉండే ఒక పేదవాడు తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడాడు. కానీ ఆ పేదవాన్ని ఎవరూ జ్ఞాపకం ఉంచుకోలేదు.

  10. కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు.

  11. మూర్ఖుల పాలకుడి కేకల కంటే జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది.

  12. యుద్ధాయుధాలకంటె జ్ఞానం మేలు, కాని ఒక్క పాపి అనేకమైన మంచి వాటిని నాశనం చేస్తాడు.

  13. వారిలో అందరు ఖడ్గమును ధరించిన వారు, యుద్ధంలో అనుభవం కలవారు, ప్రతి ఒక్కరు రాత్రి కలిగే దాడులకు సిద్ధపడి, ఖడ్గం ధరించి సన్నద్ధులై వస్తున్నారు.

  14. మీ దేశం నాశనమైపోయింది. మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి; మీ కళ్లెదుటే మీ పొలాలు విదేశీయులచేత దోచుకోబడ్డాయి, కంటికి కనబడినవాటిని పరాయివారిగా నాశనం చేశారు.

  15. ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.

  16. ప్రజలు ఒకరిని ఒకరు ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు. యువకులు పెద్దవారి మీదికి, అనామకులు ఘనుల మీదికి లేస్తారు.

  17. మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు.

  18. సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.

  19. నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.

  20. ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.

  21. “కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.

  22. నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే దానికి ఇంకేమి చేయాలి? మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?

  23. నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది.

  24. నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”

  25. ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.