కంటెంట్‌కు వెళ్లండి

War గురించి బైబిల్ వచనాలు

639 వచనాలు · 45 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.

  2. వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు; తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో వారందరు రోదిస్తారు, ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.

  3. హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు, యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది. కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు, వారి హృదయాలు క్రుంగిపోతాయి.

  4. మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది; వారిలో పారిపోయినవారు సోయరు వరకు, ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు. వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు; హొరొనయీము వెళ్లే దారిలో తమ నాశనం గురించి విలపిస్తారు.

  5. నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.

  6. కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.

  7. వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి; వారి రోదన ఎగ్లయీము వరకు వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.

  8. దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను. మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.

  9. అందువల్ల యాజెరు ఏడ్చినట్లు నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ ఎల్యాలెహు, నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను. నీ పండిన ఫలాల కోసం నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి.

  10. ఫలభరితమైన పొలాల నుండి ఆనంద సంతోషాలు తీసివేయబడతాయి; ద్రాక్షతోటలో ఎవరూ పాడరు, కేకలు వేయరు; గానుగులలో ద్రాక్షగెలలను ఎవరూ త్రొక్కరు. ఎందుకంటే, నేను వారి సంతోషపు అరుపులు ఆపివేశాను.

  11. అవి పర్వత పక్షులకు, భూమిమీది మృగాలకు విడిచిపెట్టబడతాయి; వాటిని వేసవి కాలమంతా పక్షులు, శీతాకాలమంతా భూమిమీది మృగాలు తింటాయి.

  12. “నేను ఈజిప్టువారి మీదికి ఈజిప్టువారిని రేపుతాను, సోదరుని మీదికి సోదరుడు, పొరుగువారి మీదికి పొరుగువారు, పట్టణం మీదికి పట్టణం, రాజ్యం మీదికి రాజ్యం రేపుతాను.

  13. ఈజిప్టువారు ఆత్మస్థైర్యం కోల్పోతారు, వారి ఆలోచనలను నాశనం చేస్తాను; వారు విగ్రహాలను, మరణించిన వారి ఆత్మలను, భవిష్యవాణి చెప్పేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదిస్తారు.

  14. నేను ఈజిప్టువారిని క్రూరమైన అధికారి చేతికి అప్పగిస్తాను, భయంకరమైన రాజు వారిని పాలిస్తాడు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  15. సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.

  16. కాలువలు కంపుకొడతాయి; ఈజిప్టు కాలువలు ఇంకి ఎండిపోతాయి. రెల్లు, గడ్డి వాడిపోతాయి,

  17. నైలు నది ప్రాంతంలో దాని ఒడ్డున ఉన్న మొక్కలు కూడా వాడిపోతాయి, నైలు తీరం వెంట ఉన్న ప్రతి పొలం వాడిపోయి దుమ్ములా కొట్టుకు పోయి ఇక కనబడవు.

  18. జాలరులు మూల్గుతారు, దుఃఖిస్తారు, నైలు నదిలో గాలాలు వేసే వారందరు ఏడుస్తారు; నీటి మీద వలలు వేసేవారు విలపిస్తారు.

  19. దువ్వెనతో చిక్కుతీసి జనపనారతో పని చేసేవారు నిరాశపడతారు, సన్నని నారతో అల్లేవారు నిరీక్షణ కోల్పోతారు.

  20. బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు, కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.

  21. సోయను అధిపతులు మూర్ఖులు తప్ప మరేమీ కాదు; ఫరో సలహాదారులు అర్థంలేని సలహాలు ఇస్తారు. “నేను జ్ఞానులలో ఒకడిని, పూర్వపురాజుల శిష్యుడను” అని ఫరోతో మీరెలా చెప్తారు?

  22. నీ జ్ఞానులు ఏమయ్యారు? సైన్యాల యెహోవా ఈజిప్టు గురించి నిర్ణయించిన దానిని వారు నీకు చూపించి, తెలియజేయనివ్వు.

  23. సోయను అధిపతులు మూర్ఖులయ్యారు, మెంఫిసు నాయకులు మోసపోయారు. ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు దానిని దారి తప్పేలా చేశారు.

  24. యెహోవా వారి మీద భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు.

  25. తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గాని ఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు.