Skip to content

Solomon గురించి బైబిల్ వచనాలు

301 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాని మీ సేవకుడనైన నన్ను, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైనా బెనాయాను, మీ సేవకుడైన సొలొమోనును అతడు ఆహ్వానించలేదు.

  2. నా ప్రభువైన రాజు తన తర్వాత సింహాసనంపై ఎవరు కూర్చోవాలో తన సేవకులకు చెప్పకుండా ఇలా చేస్తారా?” అన్నాడు.

  3. అప్పుడు రాజైన దావీదు, “బత్షెబను లోపలికి పిలువండి” అన్నాడు. ఆమె రాజు సముఖానికి వచ్చి అతని ఎదుట నిలబడింది.

  4. అపుడు రాజు ప్రమాణం చేసి, “నన్ను ప్రతి ఆపద నుండి కాపాడిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న,

  5. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద నేను చేసిన ప్రమాణాన్ని ఖచ్చితంగా ఈ రోజు నెరవేరుస్తాను: నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత రాజవుతాడు, అతడు నా సింహాసనం మీద నా స్థానంలో కూర్చుంటాడు” అన్నాడు.

  6. అప్పుడు బత్షెబ తలవంచి, రాజు ఎదుట సాష్టాంగపడి, “నా ప్రభువా, రాజైన దావీదు చిరకాలం జీవించును గాక!” అని అన్నది.

  7. రాజైన దావీదు, “యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువండి” అన్నాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,

  8. రాజు వారితో, “మీ ప్రభు సేవకులను మీతో తీసుకెళ్లి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి దిగువనున్న గిహోనుకు తీసుకెళ్లండి.

  9. అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తారు. అప్పుడు బూర ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించు గాక!’ అని బిగ్గరగా కేకలు వేయండి.

  10. అప్పుడు మీరు అతని వెంట వెళ్లాలి, అతడు వచ్చి నా సింహాసనం మీద ఆసీనుడై నా స్థానంలో పరిపాలిస్తాడు. ఇశ్రాయేలు మీద యూదా మీద నేను అతన్ని పాలకునిగా నియమించాను” అని అన్నాడు.

  11. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “ఆమేన్! నా ప్రభువు దేవుడైన యెహోవా దానిని స్థిరపరచును గాక!

  12. యెహోవా రాజైన నా ప్రభువుతో ఉన్నట్లు సొలొమోనుతో ఉండి, అతని సింహాసనాన్ని నా ప్రభువును రాజునైన దావీదు సింహాసనం కంటే గొప్ప దానిగా చేయును గాక!” అన్నాడు.

  13. కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయా, వ్యక్తిగత సేవకులుగా ఉన్నా కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు.

  14. యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు.

  15. ప్రజలందరు పిల్లన గ్రోవులు ఊదుతూ ఎంతో ఆనందిస్తూ అతని వెంట వెళ్లారు. ఆ శబ్దానికి భూమి అదిరింది.

  16. అదోనియా, అతనితో ఉన్న అతిథులందరు తమ విందు ముగింపులో ఆ ధ్వని విన్నారు. ఆ బూరధ్వని విని యోవాబు, “పట్టణంలో ఈ శబ్దమేంటి?” అని అడిగాడు.

  17. అతడు ఇంకా మాట్లాడుతుండగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చాడు. అదోనియా, “లోపలికి రా, నీలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తి మంచి వార్తను తెస్తాడు” అన్నాడు.

  18. అందుకు యోనాతాను అదోనియాతో, “కానే కాదు, మన ప్రభువా, రాజైన దావీదు సొలొమోనును రాజుగా చేశాడు.

  19. రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరేతీయులను, పెలేతీయులను అతనితో పాటు పంపాడు. వారు అతన్ని రాజు కంచరగాడిద మీద ఎక్కించారు.

  20. యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను గిహోను దగ్గర అతన్ని రాజుగా అభిషేకించారు. అక్కడినుండి వారు సంతోషిస్తూ వెళ్లారు. అందుకే పట్టణం సందడిగా ఉంది. మీరు వినే శబ్దం అదే.

  21. అంతేకాక సొలొమోను రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు.

  22. రాజ్యాధికారులు కూడా తమ ప్రభువైన దావీదు రాజుతో, ‘మీ దేవుడు సొలొమోనుకు మీకంటే ఎక్కువ ఖ్యాతి కలిగేలా, అతని సింహాసనాన్ని మీకంటే గొప్ప దానిగా చేయును గాక!’ అంటూ అభినందించారు. అప్పుడు రాజు తన మంచం మీద సాగిలపడి నమస్కరించి,

  23. ‘ఈ రోజు నా సింహాసనం మీద ఒక వారసుడు కూర్చోవడం నేను కళ్లారా చూసేలా చేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక’ అన్నాడు” అని చెప్పాడు.

  24. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని పాలనాధికారం స్థిరపరచబడింది.

  25. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాను యోవాబు స్థానంలో సైన్యాధిపతిగా, సాదోకును అబ్యాతారు స్థానంలో యాజకునిగా నియమించాడు.