Zadok
Zadok ను ప్రస్తావించే వచనాలు
అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; శెరాయా కార్యదర్శి.
సాదోకు అతనితో ఉన్న లేవీయులందరు దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చారు. తర్వాత వారు మందసాన్ని క్రిందికి దించినప్పుడు ప్రజలందరూ పట్టణాన్ని దాటి వచ్చేవరకు అబ్యాతారు బలులు అర్పించాడు.
అప్పుడు రాజు సాదోకును పిలిచి, “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకెళ్లు. యెహోవా నా పట్ల దయ చూపిస్తే ఆయన నన్ను మరలా తీసుకువచ్చి ఆయన మందసాన్ని, ఆయన నివాస స్థలాన్ని నేను మళ్ళీ చూసేలా చేస్తారు.
రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి.
కాబట్టి సాదోకు అబ్యాతారులు దేవుని మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకెళ్లి అక్కడే ఉండిపోయారు.
యాజకులైన సాదోకు అబ్యాతారులు నీతో అక్కడ ఉంటారు. రాజభవనంలో నీవు విన్నవాటినన్ని వారికి చెప్పు.
వారి ఇద్దరు కుమారులు, సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అక్కడ వారితో పాటు ఉన్నారు. నీవు ఏది విన్నా, వారి ద్వారా నాకు తెలియజేయి” అని చెప్పాడు.
అప్పుడు హూషై వెళ్లి యాజకులైన సాదోకు, అబ్యాతారులతో, “అబ్షాలోముకు ఇశ్రాయేలు పెద్దలందరికి అహీతోపెలు ఇలా చేయండి అని సలహా ఇచ్చాడు, అయితే నేను అలా కాదు ఇలా చేయండి అని సలహా ఇచ్చాను.
తర్వాత సాదోకు కుమారుడైన అహిమయస్సు, “నేను రాజు దగ్గరకు పరుగెత్తి వెళ్లి, యెహోవా రాజును తన శత్రువుల చేతిలో నుండి విడిపించి రాజుకు న్యాయం చేశారని చెప్పనివ్వండి” అని అడిగాడు.
అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబును, “ఏమైనా కానివ్వండి, నేను కూషీయుని వెంట పరుగెడతాను; నన్ను వెళ్లనివ్వండి” అని మరోసారి వేడుకున్నాడు. కాని యోవాబు, “నా కుమారుడా, నీవెందుకు వెళ్లాలనుకుంటున్నావు? నీకు బహుమతిని తెచ్చే వార్తేమి నీ దగ్గర లేదు” అన్నాడు.
కావలివాడు, “మొదట పరుగెత్తుకొని వస్తున్నవాడు సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెడుతున్నట్టుంది” అని అన్నాడు. అందుకు రాజు, “అతడు మంచివాడు, మంచివార్తనే తెస్తున్నాడేమో” అని అన్నాడు.
అప్పుడు ఆ సంగతి విన్న రాజైన దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులకు ఇలా కబురు పంపించాడు: “ ‘ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటున్న విషయం రాజభవనంలో ఉన్న రాజుకు చేరింది. మరి రాజును తన భవనానికి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?
షెవా కార్యదర్శి; సాదోకు అబ్యాతారులు యాజకులు;
కాని యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, రేయీ దావీదు వ్యక్తిగత శూరులు అదోనియాతో కలవలేదు.
కాని మీ సేవకుడనైన నన్ను, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైనా బెనాయాను, మీ సేవకుడైన సొలొమోనును అతడు ఆహ్వానించలేదు.
రాజైన దావీదు, “యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువండి” అన్నాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,
అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తారు. అప్పుడు బూర ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించు గాక!’ అని బిగ్గరగా కేకలు వేయండి.
కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయా, వ్యక్తిగత సేవకులుగా ఉన్నా కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు.
యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు.
రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరేతీయులను, పెలేతీయులను అతనితో పాటు పంపాడు. వారు అతన్ని రాజు కంచరగాడిద మీద ఎక్కించారు.
యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను గిహోను దగ్గర అతన్ని రాజుగా అభిషేకించారు. అక్కడినుండి వారు సంతోషిస్తూ వెళ్లారు. అందుకే పట్టణం సందడిగా ఉంది. మీరు వినే శబ్దం అదే.
రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాను యోవాబు స్థానంలో సైన్యాధిపతిగా, సాదోకును అబ్యాతారు స్థానంలో యాజకునిగా నియమించాడు.
అతని ప్రముఖ అధికారులు వీరు: సాదోకు కుమారుడు యాజకుడైన అజర్యా;
యెహోయాదా కుమారుడైన బెనాయా సేనాధిపతి; సాదోకు, అబ్యాతారు యాజకులు;
అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు అహిమయస్సుకు తండ్రి,